https://oktelugu.com/

Viral Video: వీడు మాములోడు కాదు.. ఎవరూ చేయలేని సాహసం చేశాడు.. ఏం చేశాడో చూడండి..

నేటి కాలంలో సైకిల్ మచ్చుకైనా కనిపించడం లేదు. ఇప్పుడున్న వారిలో చాలా మందికి సైకిల్ తొక్కడం రాదంటే ఎవరూ నమ్మరు. కానీ కొందరు యువకులు సైకిల్ పై సాహసాలు చేస్తూ ఆకట్టుకుంటున్నారు.

Written By:
  • Srinivas
  • , Updated On : October 10, 2023 / 05:58 PM IST

    Viral Video

    Follow us on

    Viral Video: సోషల్ మీడియా పుణ్యమాని ప్రపంచంలో ఎక్కడ ఏ విషయం జరిగిన తెలిసిపోతుంది. కొందరు తమ టాలెంట్ ను చూపించుకోవడానికి కూడా సోషల్ మీడియా ఉపయోగపడుతుంది. ఈ నేపథ్యంలో కొందరు డ్యాన్స్, పాటలతో పాటు ఇతర రంగాల్లో ప్రతిభ ఉన్న వారు తమ వీడియోలను తీసి ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్ స్ట్రాగ్రామ్ ద్వారా షేర్ చేస్తున్నారు. ఇలా వీటి ద్వారా ఫేమస్ అయిన వారు ఆ తరువాత సినిమాల్లో, ఇతర రంగాల్లో స్టార్లు అయ్యారు. ఇదే సమయంలో కొందరు సాహసాలు చేస్తూ వీడియోలు తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు. తాజాగా ఓ కుర్రాడు చేసిన సాహసానికి అందరూ నోరెళ్లబెడుతున్నారు. ఇంతకీ అతగాడు ఏం చేశాడంటే..

    నేటి కాలంలో సైకిల్ మచ్చుకైనా కనిపించడం లేదు. ఇప్పుడున్న వారిలో చాలా మందికి సైకిల్ తొక్కడం రాదంటే ఎవరూ నమ్మరు. కానీ కొందరు యువకులు సైకిల్ పై సాహసాలు చేస్తూ ఆకట్టుకుంటున్నారు. సైకిల్ పై వెళ్లడమే కాకుండా పెద్ద ఎత్తున బరువులు మోస్తూ ఆకర్షిస్తున్నారు. తాజాగా ఓ యువకుడు సైకిల్ పై వెళ్తే నెత్తిన ఫ్రిజ్ పెట్టుకొని వెళ్తున్నాడు. ఒకవైపు సైకిల్ హ్యాండిల్ పట్టుకొని, మరోవైపు నెత్తిన ఫ్రిజ్ పెట్టుకొని వెళ్తున్నాడు.

    ఇన్ స్ట్రాగ్రాంలో వైరల్ అవుతున్న ఈ వీడియోనుచూసి అంతా షాక్ అవుతున్నారు. అంతేకాకుండా రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఫ్రిజ్ ను సాధారణంగానే ఇద్దరు లేకుండా పక్కకు కూడా కదపలేదు. అలాంటిది చిన్న సైకిల్ పై ఓ యువకుడు నెత్తిన పెట్టుకొని పోవడంపై ఆ యువకుడు మాములోడు కాదు.. అంటూ కామెంట్స్ పెడుతున్నారు. అంతేకాకుండా ఇతనికి ఏదో తెలియని విద్య ఉందని మెసేజ్ పెడుతున్నాడు. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ప్రతిభావంతులు ఇలాంటి వారు ఉంటారు. వారిలో ఇతనొకరు అని కొనియాడుతున్నారు. బార్సుల్ స్పోర్ట్స్ అనే ఇన్ స్ట్రాగ్రామ్ ఖాతాలో ఉన్న ఈ వీడియోను మీరు కూడా చూసి ఆనందించండి..