Telangana Assembly Elections 2023 : తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఎన్నికల వేడి రాజుకుంది. తెలంగాణలో గెలుపు ఎవరిదన్నది ఆసక్తి మారింది. నిన్నా మొన్నటి సర్వేలు చూస్తే.. ‘సీఓటర్’ కు విశ్వసనీయత ఉంది. సీఓటర్ సర్వే ప్రకారం.. బీఆర్ఎస్ కు 43-55 సీట్లు, కాంగ్రెస్ కు 48-60 సీట్లు వస్తాయని, బీజేపీకి కేవలం 5 నుంచి 11, ఇతరులకు 5-11 వస్తాయని సీఓటర్ అంచనావేసింది. ఓట్లశాతం చూస్తే కాంగ్రెస్ 39 శాతం, బీఆర్ఎస్ కు 37 శాతం, బీజేపీకి 16శాతం, ఇతరులకు 7శాతం అని అంచనావేశారు.
ఉన్న వారందరినీ చూస్తే.. అన్ని సర్వేల్లో కంటే సీఓటర్ ఎంతో విశ్వసనీయత గల సంస్థ. ఈ ఫలితాలు దగ్గరగా వస్తే ఏం జరుగుతుందన్నది ప్రశ్న. ఇదే జరిగితే ఏ పార్టీకి మెజార్టీ రాదు. ఏ పార్టీకి మెజార్టీ రానప్పుడు ప్రభుత్వం ఎవరు ఏర్పాటు చేస్తారు. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా కాంగ్రెస్ ఉంటుంది. ఆ తర్వాత ఐదు సీట్ల తేడాతో బీఆర్ఎస్ వస్తుందన్నది అంచనా..
సీఓటర్ సర్వే సంస్థ ఒకటి మరిచిపోయింది. ఇతరుల్లో 5-11 ఉంది కదా.. ఈ సీట్లు ఎంఐఎంవే.. తెలంగాణలో ఖచ్చితంగా 7 సీట్లు ఎంఐఎంకు వస్తాయి. ఎంఐఎం అప్రకటితంగా బీఆర్ఎస్ కే మద్దతు పలుకుతుంది. అది మనం మరిచిపోవద్దు.. అది కలిపి లెక్కేసుకుంటే.. కాంగ్రెస్ కన్నా కూడా బీఆర్ఎస్ కే ఎక్కువ సీట్లు ఉన్నాయని అనుకోవాలి. ఒకవేళ ఒకటి రెండు తగ్గినా బీఆర్ఎస్ లోకి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జంప్ అవుతారు. దీంతో తిరిగి కేసీఆర్ సంకీర్ణ ప్రభుత్వం వస్తుంది. ఎంఐఎంతో కలిసి కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తారు.
మరి తెలంగాణలో బీజేపీ పుంజుకోవాలంటే.. కిషన్ రెడ్డి చెప్పిన నిశ్శబ్ద విప్లవం రావాలంటే బీజేపీ ఏం చేయాలన్న దానిపై రామ్ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.