Mother Anarchy: మనిషి మృగంలా మారుతున్నాడు.. ఇందుకు ఉదాహరణగా అనేక సంఘటనలు నిత్యం సమాజంలో జరుగుతూనే ఉన్నాయి. అఘాయిత్యాలు, రేప్‌లు, క్రూరమైన మర్డర్లు మనిషిలోని మృగత్వాన్ని తెలియజేస్తున్నాయి. అయితే కొన్ని ఘటనలు చూసినప్పుడు ఆ మృగాలు.. పశువులే నయం అనిపిస్తుంది. మనిషిని మృగంతో పోల్చడం కూడా తప్పనిపిస్తుంది. ఎందుకంటే.. ఏమృగం కూడా తన పిల్లలనే అనుభవించాలనుకోదు.. పెరిగి పెద్దయ్యాక..అవి స్వేచ్ఛగా తిరగడం మొదలు పెట్టిన తర్వాత వాటికి ఆలోచన శక్తి లేకు కాబట్టి జత కోసం మగ జంతువులను ఆకర్షిస్తుంటాయి. కానీ ఇక్కడ అంతకంటే దారుణం జరిగింది. తెలివి ఉండి.. సమాజంలో ఇలాంటి పని చేయడం దారుణం అని తెలిసి.. కూడా పశువులన్నా దుర్మార్గంగా వ్యవహరించారు. ఓ పిన తండ్రి తన భార్యకు పిట్టిన పిల్లలతోనే సంసారం చేశాడు. అందుక ఆ పిల్లల తల్లి సహకారం అందించింది. సభ్య సమాజం తలదించుకునే.. తల్లిగా ఆమె.. పిన తండ్రిగా ఆ దుర్మార్గుడు మనిషిగా పుట్టడమే తపపనుకునే ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు జిల్లాలో జరిగింది.
మాతృత్వానికే మచ్చ తెచ్చేలా..
ఏలూరు జిల్లా పెదపాడు మండలంలోని ఓ గ్రామానికి చెందిన మహిళకు ఇద్దరు కుమార్తెలు.. ఆమె కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుంది. 2007లో ఆమె భర్త అనారోగ్యంతో మరణించాడు. దీంతో ఆమె మేనత్త కుమారుడ్ని రెండో వివాహం చేసుకుంది. తన ఇద్దరు కూతుళ్లను విశాఖలోని తన పుట్టింటికి పంపించేసింది.
పిల్లలకు కావాలని వేదించడంతో..
కొన్ని రోజుల ఇద్దరూ ఎంజాయ్ చేశారు. ఈ క్రమంలో ఆమె రెండో భర్త తనకు పిల్లలకు కావాలని వేధించడం మొదలు పెట్టాడు. పిల్లల కోసం మరో పెళ్లి చేసుకుంటానని బెదిరించాడు. ఇంతలో ఆమె కూతుళ్లు ఇద్దరు యుక్త వయసుకు వచ్చారు. సమాజంలో ఏ తల్లికి రాని ఆలోచన ఆమెకు వచ్చింది. ఏ అమ్మ ఆలోచన చేయని నీచమైన ఆలోచన ఆమె చేసింది. వేరే పెళ్లి వద్దని, తన కుమార్తెల ద్వారా సంతానం పొందాలని తన రెండో భర్తను ఆమె ఒప్పించింది. ఇందుకోసం పుట్టింటి దగ్గర ఉన్న ఇద్దరు కుమార్తెలను తీసుకొచ్చింది.
ఇద్దరూ మైనర్లే..
పెద్ద కుమార్తె 8వ తరగతి చదువుతున్న సమయంలో కన్న తల్లి ఆమెను భర్త దగ్గరకు పంపించింది.. ఓసారి గర్భవతి కాగా.. చదువుకు ఇబ్బంది అవుతుందని అబార్షన్ చేయించింది. మరోసారి గర్భందాల్చి 2021లో ఆడపిల్లకు జన్మనిచ్చింది. తర్వాత భర్త తనకు కొడుకు కావాలని మళ్లీ భార్యను వేధించడం మొదలు పెట్టాడు. దీంతో మళ్లీ నీచమైన ఆలోచన చేసింది ఆ తల్లి. తన రెండో కుమార్తెనూ భర్తకు అప్పగించింది. ఆమెకు ఏడాది క్రితం మగశిశువు పుట్టి చనిపోయాడు.. అయితే ఇంట్లోనే పురుడు పోసే ప్రయత్నంలో శిశువు చనిపోయినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఆ మృతదేహాన్ని తీసుకెళ్లి కాలువలో పడేశారు.
దంపతుల మధ్య విభేదాలు..
ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం భర్తతో భార్యకు విభేదాలు వచ్చాయ.. దీంతో ఆ దుర్మార్గపు తల్లి.. ఇద్దరు కుమార్తెలను గ్రామంలోనే వదిలేసి.. విశాఖలోని పుట్టింటికి వెళ్లిపోయింది. ఆ తర్వాత కూడా అతడు ఇద్దరు కూతుళ్లను అతడు హింసించడం మొదలు పెట్టాడు. ఈ క్రమంలో చిన్న కుమార్తె ఈ విషయాన్ని తనకు తెలిసినవాళ్ల ద్వారా మేనమామకు చేరవేసింది.
మేనమామ ఫిర్యాదుతో..
ఆ పిల్లల మేనమామ బంధువులను తీసుకెళ్లి.. ఏలూరులో బాధితులతో దిశ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయించగా.. నిందితులపై పోక్సో కేసు నమోదు చేశారు. ఇద్దరినీ అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. ప్రస్తుతం పెద్ద కుమార్తె మూడో నెల గర్భిణి అని పోలీసులు గుర్తించారు.
కన్న తల్లిని అనే సంగతి మర్చిపోయి.. ఇద్దరు కూతుళ్లను దారుణంగా భర్త దగ్గరకే పంపించడం ద్వారా ఆమె పశువుకన్నా హీనంగా వ్యవహరించింది. ఇద్దరు ఆడపిల్లలు ఉన్న తాను రెండో పెళ్లి చేసుకోవడమే తప్పు.. అదీకాక.. భర్త దగ్గరికి తన పిల్లలను పంపించడం అదీ మనిషిగా పుట్టి ఇలా చేయడం మనిషన్న ప్రతీ వాడిని ఆ తల్లి అంటే చీదరించుకునేలా చేస్తోంది.