Bihar: కదులుతున్న రైలు ఎక్కబోయి.. దిగబోయి ఇటీవల చాలా మంది అదుపుతప్పి పడిపోతున్నారు. జాగ్రత్తగా ఉండాలని రైల్వే అధికారులు ఎంత చెప్పినా.. రైలు వెళ్లిపోతుంది అన్న ఆతృతలో అధికారుల సూచనలు మర్చిపోతున్నారు. ఈ క్రమంలో కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయారు. అయితే భూమ్మీద నూకలు ఉంటే.. మెరాకిల్స్ కూడా జరుగుతాయి. రైలు పైనుంచి వెళ్లినా.. లారీ ఢీకొట్టినా.. ఎత్తయిన భవనం పైనుంచి కింద పడినా బతికి బట్టకడతారు. కదిలే రైలు ఎక్కబోయిన ఓ యువకుడి విషయంలో ఇలాంటి మెరాకిలే జరిగింది. పెను ప్రమాదం నుంచి అతడు అద్భుతంగా బయటపడ్డాడు. రైలు స్టేషన్ నుంచి వెళ్లిపోయిన వెంటనే అతడు క్షేమంగా లేచి నిలబడ్డాడు. జరిగిన ఘటనపై పోలీసులు ఆరా తీశారు. ఈ షాకింగ్ ఘటన బీహార్‌లోని బగాహ రైల్వే స్టేషన్‌లో జరిగింది.
ఏం జరిగిందంటే..
బీహార్‌లోని బెట్టియాలోని ఉత్తరవారీ పోఖారా ప్రాంతంలో నివసించే 24 ఏళ్ల ప్రతీక్ కుమార్ రైల్లో ప్రయాణిస్తున్నాడు. స్నాక్స్ కోసం రైలు దిగాడు. స్నాక్స్ కొనుక్కుని రైలు దగ్గరకు వెళ్తుండగా అది కదిలింది. ఈ క్రమంలో పరిగెత్తి కదులుతున్న రైతు ఎక్కే ప్రయత్నంలో అదుపుతప్పి కిందపడ్డాడు. ప్లాట్‌ఫాం, కదిలే రైలు మధ్య ఇరుక్కుపోయాడు. రైలు ప్రయాణిస్తున్న సమయంలో ఆ వ్యక్తి రైలు పట్టాలపైకి దిగినట్లుగా వీడియోలో స్పష్టంగా కనిపించింది. అయినప్పటికీ అతనికి ఎలాంటి గాయాలు కాలేదు. సంఘటనా స్థలంలో ఉన్న పోలీసు అధికారి ఈ విషయాన్ని గమనించి అతనికి సాయం చేశారు.
రైలు వెళ్లిపోయాక..
అక్కడే స్టేషన్‌లో డ్యూటీలో ఉన్న ఎస్సై, ఇతర ప్రయాణీకులు అతనికి సహాయం చేయడానికి, ముందుకు వచ్చారు. కానీ, రైలు అప్పటికే బయలుదేరింది.. రైలు వెళ్లేంత వరకు అతడిని కదలకుండా అక్కడే నక్కి కూర్చోమని సలహా ఇచ్చారు. ట్రాక్‌పై నేరుగా పడుకోమని మార్గనిర్దేశం చేశారు. పోలీస్ అధికారి సూచనలను పాటించి ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. రైలు వెళ్లిపోయాక స్వల్పంగా గాయపడిన ప్రతీక్ కుమార్‌ను ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స చేయించారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కామెంట్ చేస్తున్న నెటిజన్లు..
వీడియో చూసిన నెటిజన్లు తమ స్పందన తెలియజేశారు. గురుడికి ఇంకా ఈ భూమిపై నూకలు మిగిలే ఉన్నాయ్.. అందుకే అంతపెద్ద ప్రమాదం నుంచి తప్పించుకుని క్షేమంగా బయటపడ్డాడు అని అంటున్నారు. మరికొందరు అతడు మృత్యుంజయుడు అంటున్నారు. ఇంకొందరు.. అతడి అదృష్టం బాగుంది.. అంటూ కామెంట్ చేశారు. ఇలా చాలా మంది నెటిజన్లు వీడియోపై తమ అభిప్రాయాలను తెలియజేశారు.
पश्चिम चंपारण के बगहा स्टेशन पर ट्रेन पकड़ने के दौरान पटरियों पर #गिरा_शख्स
ऊपर से गुजर गई पूरी #ट्रेन, सही सलामत बच गया शख्स@RailwaySeva pic.twitter.com/SMKEQy0NUA
— Goldy Srivastav (@GoldySrivastav) September 30, 2023