Photo Story: సినిమాల్లో అలరించిన కొందరు నటీమణుల చిన్న నాటి ఫోటోలు ఇటీవల సోషల్ మీడియాలో అలరిస్తున్నాయి. కొన్ని సందర్భంగాల్లో వారు దిగిన ఫొటోలు వారి బర్త్ డే సందర్భంగా బయటపెడుతున్నారు. ఈ సందర్భంగా అప్పటికీ, ఇప్పటికీ వారిలో వచ్చిన మార్పుపై సోషల్ మీడియాలో ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. తాజాగా దిష్టి చుక్క పెట్టుకున్న ఓ బేబి ఏంతో క్యూట్ గా బ్లాక్ అండ్ వైట్ ఫొటోలో అలరిస్తోంది. ఇప్పుడు కూడా అదే అందంతో ఆకట్టుకుని స్టార్ హీరోయిన్ అయింది. మహేశ్ బాబు, పవన్ కల్యాణ్ లాంటి స్టార్ హీరోల పక్కన నటించిన ఈమె ప్రస్తుతం తక్కువ సినిమాల్లో కనిపిస్తోంది. ఇంతకీ ఈ క్యూట్ బేబీ ఎవరో తెలుసా?
అందాల బేబీ ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్. ఆమెనే ముద్దుల గుమ్మ సమంత. సమంత నటించిన లాస్ట్ మూవీ ‘ఖుషి’ సెప్టెంబర్ 1న రిలీజ్ అయింది. ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం సమంత విశ్రాంతి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. తెలుగులో ‘ఏమాయ చేశావె’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన సమంత ఆ తరువాత మహేష్ బాబుతో దూకుడు, ఆ తరువాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో కలిసి ‘సన్నాఫ్ సత్యమూర్తి’ సినిమాలో అలరించింది. ఆ తరువాత పవన్ కల్యాణ్ పక్కన ‘అత్తారింటికి దారేది’, జూనియర్ ఎన్టీఆర్ తో ‘రభస’లో కలిసి నటించింది.

తన మొదటి సినిమాలో హీరోగా నటించిన నాగచైతన్యతో ప్రేమలో పడిన సమంత ఆ తరువాత కొన్ని కారణాల వల్ల దూరంగా ఉంటోంది. ఆ తరువాత తెలుగులో పాటు పలు వెబ్ సిరీసుల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఈ మధ్య సమంత సినిమాలు తక్కువయ్యాయి. ఆమెకు వయో సైటిస్ వ్యాధి రావడంతో కాస్త డల్ అయినట్లు తెలుస్తోంది. అయితే ఈ వ్యాధి నుంచి సీరియస్ గా చికిత్స తీసుకున్న ఆమె తొందర్లోనే కోలుకున్నారు. ప్రస్తుతం సిటాడెల్ అనే వెబ్ సిరీస్ తో బిజీగా ఉంది.
సమంత 1987 ఏప్రిల్ 28న తమిళనాడులోని చెన్నైలో జన్మించారు. చెన్నైలోని హోలి ఏంజెల్స్ ఆంగ్లో ఇండియన్ హయ్యర్ సెకండరీ స్కూల్ లో చదివారు. ఓ వైపు డిగ్రీ చేస్తూనే.. మరోవైపు మోడలింగ్ రంగలో అడుగుపెట్టింది. ఈ క్రమంలో ఆమెకు 2010లో ఏమాయ చేశావె అనే సినిమాలో అవకాశం వచ్చింది. చిన్నప్పుడు కూడా సమంత ఎంతో క్యూట్ ఉండేది. దిష్టిచుక్కలతో పాటు మల్లెపూల మధ్య కనిపిస్తున్న ఈ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.