Homeట్రెండింగ్ న్యూస్Jamshedpur : సిటీకి దూరంగా.. పచ్చటి పల్లెలో జీవనం.. ఇది కదా లైఫ్‌ అంటే..!

Jamshedpur : సిటీకి దూరంగా.. పచ్చటి పల్లెలో జీవనం.. ఇది కదా లైఫ్‌ అంటే..!

Jamshedpur : ముంబై(Mumbai) లాంటి మహానగరంలో భారీ శాలరీతో లక్షల మంది ఉద్యోగం చేస్తున్నారు. కాంక్రీటు జంగిల్‌లో, కాలుష్యపు కోరల్లో కష్టంగా జీవనం సాగిస్తున్నారు. ఉదయం లేవగానే రణగొణ ధ్వనులు, అర్ధరాత్రి వరకు భారీ శబ్దాలు.. ఇలాంటి జీవనం ఎందుకని భావించిన ఓ వ్యక్తి కాంక్రీటు జీవింతం నుంచి పచ్చని పల్లెకు మకాం మార్చాడు. ఇందు కోసం లక్షల రూపాయల వేతనం వదిలేసుకున్నాడు. ఎన్నో సౌకర్యాలను కాదనుకున్నాడు. ప్రశాంతమైన జీవితంతోపాటు మరెన్నో సౌకర్యాలతో సక్సెస్‌ఫుల్‌గా కెరీర్‌(Succsfull Carer)ను లీడ్‌ చేస్తున్నాడు. ఐదేళ్ల క్రితం కరోనా(Corona) లాంటి మహమ్మారి ప్రభావంతో ఓ వ్యక్తి తన జీవితంలో కీలక నిర్ణయం తీసుకున్నాడు. ముంబై నగరంలో బిజీ లైఫ్‌ గడపడం ఇష్టం లేక సొంత ఊరికి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్నదే తడవుగా లగేజీ సర్దుకుని సొంత ఊరు జంషెడ్‌పూర్‌(Jamshadpur)కు వెళ్లాడు. అతను తీసుకున్న నిర్ణయాన్ని చాలా మంది ఎగతాళి చేశారు. మరికొందరు బతకడం తెలియదని జాలి పడ్డారు. కానీ, అతను ప్రస్తుతమున్న స్థానం చూసి అంతా ముక్కున వేలేసుకుంటున్నారు.

ఒడిదుడుకులు అధిగమించి..
జంషెడ్‌పూర్‌లో ఎదిగిన సుమిత్‌ అనే వ్యక్తి హైదరాబాద్(Hyderabad), ముంబై లాంటి నగరాల్లో చాలా ఏళ్లు పనిచేశాడు. అతను తన సొంతూరికి వెళ్దామనుకున్నాడు. అక్కడి సమాజంలో ఇమడగలనా.. పని దొరుకుతుందా అనే ప్రశ్నలు అతడిని వెంటాడాయి. కానీ, ఇంత చిన్న పట్టణంలో కూడా ఆయనకు అందిన సౌకర్యాలను ముందుగా ఊహించలేకపోయాడు.

ఐదు కారణాలతో సొంత ఊరికి..

1. ట్రాఫిక్‌ లేని ప్రదేశం
సుమిత్‌ సొంత ఊరికి వెళ్లడానికి ప్రధాన కారణం ట్రాఫిక్‌ చిక్కులు లేకపోవడం. రోజు మొత్తంలో 20 నుంచి 25 శాతం ట్రాఫిక్‌(Traffic)లో గడపాల్సిన ముంబై.. జంషెడ్‌పూర్‌లో ట్రాఫిక్‌ లేకపోవడం. ముంబైలో 14 గంటలు ప్రయాణానికే సరిపోయేది. జంషెడ్‌పూర్‌లో 15 నిమిషాలలో ఇంటికి చేరుకోగలుగుతున్నాడు.

2. తక్కువ లివింగ్‌ కాస్ట్‌..
కొత్త ప్రదేశంలో సాధాణంగా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. కానీ, ఇది సుమిత్‌ సొంత ఊరు కావడంతో అక్కడ అలాంటివ ఇలేవు. నెలకు అయ్యే ఖర్చు కూడా బాగా తగ్గింది. దీంతో మహానగరంలో గడిపేదానికన్నా బెటర్, క్వాలిటీ లైఫ్‌(Quality Life) లీడ్‌ చేస్తున్నాడు.

3. అందుబాటు ఖర్చు
ఇక ఫుడ్‌ డెలివరీ, ఈ కామర్స్‌ సైట్లు కూడా జంషెడ్‌పూర్‌లో అందుబాటులోకి రావడంతో మహానగరంలో గడిపిన ఖర్చులు ఎక్కువగా పెట్టాల్సి అవసరం లేదు. ఇక్కడే ఉంటే శక్తికి మించిన ఖర్చులు లేవు. క్యాబ్స్(Cabs), ఈవెంట్లు, మల్టీ ఫ్లెక్సులు(Multi Felx) అన్నీ తక్కువ ధరకే అందుబాటులో ఉన్నాయి.

4. ప్రశాంతమైన ప్రదేశాలు
ఇక వీకెండ్స్‌లో బయటకు వెళ్లాలంటే మహానగరాల్లో బిజీ వాతావరణం ఇక్కడ లేదు. గుంపులు గుంపులుగా లేకపోవడంతో ప్రశాంతమైన, ఆహ్లాదకరమైన ప్రదేశాలు ఉన్నాయి.

5. ఆరోగ్యం కోసం ఎక్కువ సమయం
ఇక జంషెడ్‌పూర్‌లో ఫిట్‌నెస్(Fitness), స్పోర్ట్స్‌(Sports) కోసం ఎక్కువ సమయ కేటాయిస్తున్నాడు. ముంబైలో కూడా లేని సౌకర్యం ఇక్కడ ఉంది.

సిటీలైఫ్‌ గడిపి వచ్చిన తర్వాత పల్లోటూరులో అందే సౌకర్యాలకన్నా అందుబాటులో లేని లగ్జరీలను పెద్దగా పట్టించుకోలేదు. అయితే ఇది పూర్తిగా వ్యక్తిగతం. కొందరికి నచ్చకపోవచ్చు అని తెలిపాడు సుమిత్‌. ఐదేళ్ల క్రితం చిన్న పట్టణంలో ఉంటానా అనుకున్న సుమిత్‌.. ఇప్పుడు ఇక్కడే బాగుందని చెబుతున్నాడు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular