https://oktelugu.com/

Love Letter: 250 ఏళ్ల క్రితం నాటి ప్రేమలేఖ.. ఏముందో తెలుసా..!!

లవ్ లెటర్స్ కు ఉన్న క్రేజ్ అంత ఇంతా కాదు.. ప్రియురాలు లేదా ప్రియుడు మాట్లాడుకోవాలంటే తప్పనిసరిగా ప్రేమలేఖలు రాసుకునే వారు.. వాటిని పంపేందుకు రకరకాల మార్గాలను అన్వేషించేవారన్న సంగతి తెలిసిందే.

Written By:
  • Velishala Suresh
  • , Updated On : December 2, 2023 / 03:52 PM IST

    Love Letter

    Follow us on

    Love Letter: ప్రేమలేఖలు.. ప్రస్తుత కాలంలో వీటి వాడకం లేదు.. పురాతన కథల తరహాలో ప్రేమలేఖలు రాసేవారు.. ఇలా ఇచ్చేవారు అనే పరిస్థితులు ఉన్నాయి. కాలం మారుతుండటంతో ఆధునిక సమాజంలో సెల్ ఫోన్లు, ఇంటర్నెట్ లు వచ్చిన తరువాత ప్రేమలేఖల అవసరం లేకుండా పోయింది.. ఇది వరకు అయితే లవ్ లెటర్స్ కు ఉన్న క్రేజ్ అంత ఇంతా కాదు.. ప్రియురాలు లేదా ప్రియుడు మాట్లాడుకోవాలంటే తప్పనిసరిగా ప్రేమలేఖలు రాసుకునే వారు.. వాటిని పంపేందుకు రకరకాల మార్గాలను అన్వేషించేవారన్న సంగతి తెలిసిందే.

    ప్రేమను వ్యక్తపరిచేందుకు పదాలకు అక్షర రూపాన్ని కల్పించి ప్రేమ లేఖలను రాస్తుంటారు. అయితే తాజాగా ఓ ప్రేమలేఖ సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తుంది. దీనికి కారణం ఆ లేఖ సుమారు 250 సంవత్సరాల క్రితం నాటిది కావటం… అవునండి.. మీరు వింటున్నది నిజమే అది సుమారు 250 ఏళ్ల నాటి ప్రేమలేఖ. అయితే అందులో ఏముందనేది తెలుసుకోవాలనుకుంటున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం..రండి చూసేద్దాం.

    సుమారు 250 ఏళ్ల క్రితం నాటి ప్రేమలేఖలు.. కానీ వాటిని ఇంతవరకు ఓపెన్ చేయకపోవడం మరో విషయం. ఫ్రాన్స్ నావికాదళంలో పని చేసే సైనికులకు ఈ లెటర్స్ వచ్చాయని తెలుస్తోంది. బ్రిటన్ – ఫ్రాన్స్ ఏడేళ్ల యుద్ధంలో పాల్గొన్న సైనికుల కోసం ఈ ప్రేమలేఖలు రాశారట. అయితే ఈ ఉత్తరాలు ఏవీ వారికి చేరలేదు. దీంతో బ్రిటిష్ నేవి ఆ లేఖలను హస్తగతం చేసుకుంది.. తాజాగా కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి చెందిన ఓ ప్రొఫెసర్ ఈ లేఖలను కనుగొన్నారని సమాచారం. ఈ క్రమంలోనే వాటిని ఓపెన్ చేసిన ప్రొఫెసర్ ప్రేమలేఖలను చదివేందుకు ప్రయత్నించారు.

    ఎస్సెమ్మెస్ తరహాలో పదాలున్నాయని తెలుస్తోంది. నీ ప్రేమను పొందాలని ప్రయత్నిస్తున్నాను.. నీకు లేఖ రాస్తూ రాత్రి సమయం అంతా గడపగలను.. నువ్వంటే నాకు చనిపోయేంత ప్రేమ ఉందంటూ లేఖల్లో రాసి ఉందంట. ఈ విషయాన్ని లేఖలను చదివిన ప్రొఫెసర్ తెలిపారు. వీటిలోని మరికొన్ని లెటర్లు చదువుతుంటూ చాలా బాధగా అనిపించిందని ఆయన పేర్కొన్నారు. ఈ లేఖల్లో వారి ప్రేమను వ్యక్త పర్చడమే కాకుండా రోజువారీ జీవితంలో జరిగే సంఘటనలు, ఇంట్లో ఖర్చులు వంటి విషయాలు కూడా ఉన్నాయట. అయితే ఈ లేఖలు సైనికులకు చేరి ఉంటే బావుండని పలువురు నెటిజన్లు కామెంట్స్ చేశారు.

    అయితే… రోజులు మారుతున్నప్పటికీ ప్రేమ ఎప్పుడూ మారదు. అలాంటి ప్రేమ భావాన్ని కళ్లకు కట్టినట్లుగా చూపే ప్రేమలేఖలను మాత్రం మార్చినా, మారిపోయినా ఏం బావుంటుంది చెప్పండి. అందుకే ప్రేమలో పడిన ప్రతి ఒక్కరూ అప్పుడప్పుడూ తమ ప్రేమను వ్యక్తపరుస్తూ ప్రేమలేఖలు రాయాలని పలువురు తమ మనసులోని భావాలను భయటపెడుతున్నారు.