
King Cobra: భూ ప్రపంచంలో ఎన్నో కోట్ల రకాల జంతువులు ఉన్నాయి. అందులో విషపూరితమైనవి ఉంటాయి. సాధు జంతువులు కూడా ఉంటాయి. ప్రతి ప్రాణికి తాను జీవించే అవకాశం ఇస్తాడు భగవంతుడు. ఇందులో భాగంగానే వాటి రక్షణ కోసం వాటికి ఏదో ఒక ఆయుధం ఇస్తుంటాడు.పాములకు, తేళ్లకు విషం ఇచ్చాడు. వాటిని ముట్టుకుంటే అవి కాటు వేస్తాయి. దీంతో మన ప్రాణాలు గాల్లో కలవాల్సిందే. పాముల్లో అత్యంత ప్రమాకరమైనది నల్లత్రాచు. దీన్నే కింగ్ కోబ్రా అని ఆంగ్లంలో పిలుస్తారు. ఇది అత్యంత విషపూరితమైనది. దీంతో దీని జోలికి వెళ్లాలంటేనే జంకుతారు. అది కనబడితే చాలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగెత్తాల్సిందే.
పాములంటే..
పాములంటే అందరికి భయమే. అవి తారసపడితే చాలు మన ప్రాణాలు కాపాడుకోవడానికి లగెత్తడం సహజమే. ఇందులో పొడవాటి పాముల్లో నల్లత్రాచు ప్రధానమైనది. ఇది దాదాపు 19 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. చిన్న చిన్న పాములు నల్లత్రాచును చూస్తేనే భయపడతాయి. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. 18 మీటర్ల పొడవున్న నల్లత్రాచు ఎత్తైన ప్రదేశంలో నిలబడి ఉండటం చూస్తే మనిషికన్నా పొడవుగా కనిపిస్తోంది. దాని ఆకారం చూసి అందరు బెంబేలెత్తుతున్నారు. సరిగ్గా ఇలాంటి సంఘటన చోటుచేసుకోవడంతో వీక్షకుల్లో ఆందోళన కలుగుతోంది. నల్లత్రాచు అంత పొడవుంటుందా అని పరేషాన్ అవుతున్నారు.

అటవీ ప్రాంతంలో..
అటవీ ప్రాంతంలో అత్యంత పొడవైన పాముగా కింగ్ కోబ్రా నిలుస్తుంది. ఇది కాటు వేస్తే నిమిషాల్లోనే ప్రాణాలు పోవడం ఖాయం. దీంతో కింగ్ కోబ్రాను రెచ్చగొడిే ప్రమాదకరం. తాజాగా కింగ్ కోబ్రా విన్యాసాలు చూసే వారికి గుండెల్లో దడ పుట్టడం సహజం. వీడియో పాతదే అయినా సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్ గా నిలుస్తోంది. ఇప్పటి వరకు దీన్ని 170 వేల వీక్షణలు, 11 వేల లైకులు రావడం గమనార్హం. పాములకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో బాగా ట్రోలింగ్ కావడం చూస్తుంటాం.
18 అడుగుల..
ఈ నల్లత్రాచు 18 అడుగుల పొడవుతో ఎత్తైన ప్రదేశంలో నిలబడి ఉండటంతో వీడియో చూసే వారికే భయం కలుగుతోంది. ఈ భయానక దృశ్యాన్ని చూసిన వారందరు ఆశ్చర్యపోతున్నారు. దీనికి కామెంట్లు కూడా విచ్చలవిడిగా వస్తున్నాయి. పూర్తిగా ఎదిగిన పాము కావడంతో ఇంత పొడవుంటుందా అని అందరు అవాక్కవుతున్నారు. అది వెంట పడితే ఇంకేమైనా ఉంది కచ్చితంగా ప్రాణాలు పోవడం ఖాయమనే వాదనలు కూడా వస్తున్నాయి. మొత్తానికి కింగ్ కోబ్రా వీడియో అందరిలో దడ పుట్టిస్తోంది.
మన పూర్వీకులు
మన పూర్వ కాలం నుంచి పాములను దేవతలుగా పూజిస్తారు. నాగుల కోసం ప్రత్యేకంగా విగ్రహాలు సైతం ఏర్పాటు చేస్తారు. నాగుల చవితి సందర్భంగా వాటికి ప్రత్యేకంగా పాలు పోసి వేడుకుంటారు. నాగుపామును నాగదేవతగా భావిస్తారు. దానికి ప్రత్యేకమైన పూజలు చేస్తారు. ఈ నేపథ్యంలో నాగు పాములను దేవతలుగా పూజించే మన వారు ఎదురు పడినా చేతులెత్తి దండం పెడతారు కానీ కొట్టి చంపే సాహసం చేయరు. ఎవరో కొందరే పాములను చంపుతారు. కానీ అందరు వాటిని దేవుళ్లుగానే భావించడం గమనార్హం.
https://www.youtube.com/watch?v=bzUumQJCOCw&t=12s