
Ustad Bhagat Singh- Comedian Ali: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలలో అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్న సినిమాలలో ఒకటి ‘ఉస్తాద్ భగత్ సింగ్’.గబ్బర్ సింగ్ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత మరోసారి డైరెక్టర్ హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ తో చెయ్యబోతున్న సినిమా కావడం వల్లే ఈ చిత్రం పై అభిమానుల్లో ఈ రేంజ్ అంచనాలు ఉన్నాయి.ఎప్పుడెప్పుడు ప్రారంభం అవుతుందా అని ఎదురు చూసిన చూస్తున్న సందర్భం లో, ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మార్చ్ 27 వ తారీఖున ప్రారంభం కాబోతుందని నిన్న ఒక న్యూస్ వచ్చింది.
దీనితో అభిమానుల ఆనందానికి హద్దులే లేకుండా పోయింది.ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న కాంబినేషన్ , హరీష్ శంకర్ కాస్త శ్రద్ద పెట్టినా మరో గబ్బర్ సింగ్ పక్కా అని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు.మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా, పూజా హెగ్డే మరియు శ్రీ లీల ఈ చిత్రం లో హీరోయిన్స్ గా నటిస్తున్నారు.
ఇది ఇలా ఉండగా ఈ సినిమా నుండి మరో క్రేజీ అప్డేట్ సోషల్ మీడియా ని ఊపేస్తోంది.అదేమిటి అంటే పవన్ కళ్యాణ్ చిరకాల మిత్రుడు, ప్రముఖ కమెడియన్ అలీ ఈ సినిమాలో నటించబోతున్నాడని తెలుస్తుంది.ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వ్యతిరేకంగా వైసీపీ పార్టీ లో చేరిన అలీ ఈమధ్య పవన్ కళ్యాణ్ పై తరుచు సెటైర్లు వేస్తున్న సంగతి తెలిసిందే.అభిమానులు అలీ ని ఒక శత్రువు లాగానే చూస్తున్నారు.

అతని పేరు ఎత్తితేనే మండిపడే పరిస్థితి ఏర్పడింది.అలాంటి సమయం లో హరీష్ శంకర్ అలీ ని ఈ సినిమాలో ఎలా తీసుకుంటాడు అంటూ ఫ్యాన్స్ ట్విట్టర్ లో హరీష్ ని ట్యాగ్ చేసి తిడుతున్నారు.దీనికి హరీష్ శంకర్ ఇప్పుడు రియాక్షన్ ఇవ్వకపోయినా, ఎదో ఒక ఇంటర్వ్యూ లో మాత్రం కచ్చితంగా ఇస్తాడు, అప్పటి వరకు వేచి చూడాల్సిందే, ఇక వచ్చే నెల నుండి వరుసగా ఈ సినిమా గురించి క్రేజీ అప్డేట్స్ బయటకి రానున్నాయి.