Japan Cannibal: ఢిల్లీ లో ఆప్తాబ్ అనే యువకుడు తనతో సహజీవనం చేస్తున్న శ్రద్ద వాకర్ అనే యువతిని హత్య చేసి, కత్తులతో శరీరాన్ని 35 భాగాలు చేశాడు. వాటిని అక్కడో ముక్క, ఇక్కడో ముక్క పడేశాడు. ఈ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.. కానీ 1981లో ప్రపంచం మొత్తం విస్తు పోయే దారుణం పారీస్ లో జరిగింది.. నమ్మి వచ్చినందుకు ఓ యువతిని మెడపై కాల్చి చంపాడు. ఆపై ఆమెపై అత్యాచారం చేశాడు.. ఆమె శరీర భాగాలను వండుకొని తిన్నాడు.. వింటుంటేనే భయం వేస్తోంది కదూ.. ఇలాంటి భయాన్ని ప్రపంచం మొత్తం 1981 లో చవిచూసింది. కానీ ఈ ఘటనలో ఆ నేరగాడికి ఎటువంటి శిక్ష పడలేదు. పైగా ఈ హత్యను అతడు తన ఎదుగుదలకు వాడుకున్నాడు.. మొన్న ఢిల్లీలో జరిగిన శ్రద్ధ వాకర్ హత్య కేసులో నిందితుడు ఆప్తాబ్, ఈ జపాన్ కు చెందిన నరమాంసభక్షకుడికి పెద్ద తేడా ఏమీ లేదు.

జరిగింది ఇదీ
జపాన్ దేశానికి చెందిన ఇస్సీ నగవా ప్యారిస్ లో ఉండేవాడు.. ఒకరోజు నెదర్లాండ్స్ కు చెందిన రెనే హార్వెల్ట్ అన్న యువతిని తన గదికి రావాలని కోరితే ఆమె వెళ్ళింది.. కానీ అలా వెళ్లడమే ఆమె పాలిట పాపం అయింది. తుపాకి తో అతడు ఆమె మెడపై కాల్చాడు. ఆమె చనిపోయిన తర్వాత పలుమార్లు అత్యాచారం చేశాడు. అంతటితో ఆగలేదు.. ఆమె శరీర భాగాలను వండుకుని తిన్నాడు. మిగిలిన శరీర భాగాలను స్థానిక పార్కులో పడేసే క్రమంలో పోలీసులకు చిక్కాడు.. వారి విచారణలో తనే ఆమెను హత్య చేసినట్టు ఒప్పుకున్నాడు. ఆ సమయంలో అతడి ప్రవర్తన చూసి యావత్ ప్రపంచం దిగ్బ్రాంతికి గురయింది. అయితే ఉన్మాది మనస్తత్వం కలిగిన నిందితుడు విచారణకు అనర్హుడని భావించిన ఫ్రెంచ్ వైద్యనిపుణులు… 1993లో అతడిని మానసిక చికిత్స కేంద్రంలో చేర్పించారు. బాధితురాలు కుటుంబ సభ్యుల విజ్ఞప్తి మేరకు 1994లో అతడిని దేశం నుంచి ఫ్రాన్స్ అధికారులు బహిష్కరించారు.
జపాన్ అధికారులు కూడా..
సగావా స్వదేశానికి వెళ్ళిన తర్వాత అక్కడి అధికారులు కూడా అతడి విపరీత ప్రవర్తన ఇలా చేస్తున్నాడని గుర్తించారు. అతడికి చికిత్స అవసరం లేదని నిర్ణయించారు.. అదే సమయంలో ఈ కేసు కు సంబంధించిన పత్రాలు ఫ్రాన్స్ దేశం నుంచి అందకపోవడంతో కేసును మూసి వేశారు.. ఇలా కేసు విచారణ అటకెక్కడంతో నిందితుడు దర్జాగా బయటకు వచ్చాడు. జైలు శిక్ష నుంచి తప్పించుకున్నప్పటికీ తన నేరాన్ని మాత్రం నగావా ఎప్పుడూ దాచుకోలేదు.. పై గా తనపై వచ్చిన అపఖ్యాతినే పెట్టుబడిగా పెట్టుకొని, తన సొంత అనుభవాలను వ్యాసాల రూపంలో బహిరంగపరిచేవాడు. తాను చేసిన హత్యకు సంబంధించి వివరాలు కూడా అందులో స్పష్టంగా వివరించాడు.. పైగా తాను చేసిన దారుణంపై ఎన్నడూ కూడా పశ్చాత్తాపం వ్యక్తం చేయలేదు. మహిళలు ఎంతో రుచికరంగా ఉంటారంటూ ఓ ఇంటర్వ్యూలో విస్మయకర వ్యాఖ్యలు చేశాడు.

సెలబ్రిటీగా మారిపోయాడు
ఇంత క్రూర స్వభావం ఉన్న వ్యక్తి జాతీయ, అంతర్జాతీయ మీడియాలు ఇంటర్వ్యూలు చేయడంతో సెలబ్రిటీగా మారిపోయాడు. నరమాంస భక్షణపై తనకు ఉన్న ఆసక్తి, గతంలో పారిస్ లో చేసిన హత్య గురించి వివరాలతో 2017 లో కనీబా అనే పేరుతో డాక్యుమెంటరీ కూడా వచ్చింది. చివరకు వృద్ధాప్యంలో తన సోదరుడి వద్ద కాలం గడిపిన సగావా న్యూ మొనియా తో నవంబర్ 24న చనిపోయాడు. వ్యవస్థలో ఉన్న లోపాలు ఓ వ్యక్తిని ఎలా కాపాడాయో దానికి సగావా జీవితమే ఒక ఉదాహరణ. సాక్షాత్తు ఒక అమ్మాయిని అత్యంత పాశవికంగా హత్య చేసినప్పటికీ, ఆమె శరీర భాగాలు వండుకొని తిన్నప్పటికీ, అతడు ఆ నేరాన్ని అంగీకరించినప్పటికీ స్వేచ్ఛగా తిరగటం, పైగా తన నేరాన్ని గొప్పగా వ్యక్తీకరించడం గమనార్హం.. చాలామంది కూడా భారతదేశంలో ఉన్న చట్టాలని మార్చాలని కోరుతారు. ఇతడి ఉదంతం చూసిన తర్వాత ప్రపంచంలోని అన్ని దేశాల చట్టాలు లొసుగుల పుట్టలే అని అర్థమవుతున్నది.