Uttar Pradesh Husband: కన్యాదానం సినిమా చూశారా? అందులో తన భార్యను ఆమె ప్రేమించిన వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేస్తాడు హీరో. నిజ జీవితంలో ఇలా జరుగుతుందా అంటే అప్పట్లో చాలా మంది జరగదు అనే అనుకున్నారు. కానీ ఆ సినిమా వచ్చి ఇన్నేళ్లయిన తర్వాత రీల్ లైఫ్‌లోనూ జరిగింది. అంతే కాదు ఈ టెక్ యుగంలో యమా ఫాస్ట్‌గా ఉన్న సమాజాన్ని ఔరా అనేలా ముక్కున వేలేసుకునేలా చేసింది. సోషల్ మీడియా రోజులు కాబట్టి ఈ విషయం దావనంలా వ్యాపించింది. వైరల్‌గా మారింది. ఇంతకీ ఏం జరిగిందంటే..
ఉత్తరప్రదేశ్ తెలుసు కదా! అక్కడ మీర్జాపూర్ అనే ప్రాంతం ఉంటుంది. ఆ రాష్ట్రంలో అంతి పెద్ద పట్టణాల్లో ఇది కూడా ఒకటి. ఇక్కడ రకరకాల తెగలు నివసిస్తూ ఉంటాయి. పైగా అది ఢిల్లీకి దగ్గరగా ఉండటం, నేరగాళ్లు తచ్చాడుతుండటంతో అదేదో వెబ్ సిరీస్‌లో చూపించిన పరిస్థితులే మనకు కన్పిస్తాయి. ఇక అక్కడ జరిగే వ్యవస్థీకృత నేరాలకు అడ్డూ అదుపు ఉండదు. పైగా వాళ్లకు రాజకీయ పార్టీల నాయకుల అండ అధికంగా ఉంటుంది. అలాంటి ఈ ప్రాంతంలో సరికొత్త ప్రేమ కథ వెలుగులోకి వచ్చింది. అంతే కాదు ఆ ప్రేమ కథలోనూ సినిమాకు తగ్గని ట్విస్ట్‌లు ఉన్నాయి. పైగా ఈ ప్రేమ జంట కథ వెలుగులోకి రావడంతో అక్కడ కొత్త మంది బడా వ్యక్తులు దీనిని గురించి తెలుసుకునేందుకు ఆసక్తి చూపించారు. అంతే కాదు ఆ ప్రేమ కథ పుట్టిన ఊరికి వచ్చి ఆరా కూడా తీశారు.
మీర్జాపూర్ జిల్లాలోని అమోయ్‌పూర్వా గ్రామానికి చెందిన దినేష్ అనే వ్యక్తికి, గులాబీ అనే మహిళకు ఏడాది క్రితం వివాహం జరిగింది. అయితే వీరి పక్కింట్లో ఉండే రాహుల్‌తో గులాబీ ప్రేమలో పడింది. తరుచూ అతడితో ఫోన్‌లో మాట్లాడేది. గమనించిన దినేష్ వారికి పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నారు. గులాబీ రాహుల్ తల్లిదండ్రులతో మాట్లాడి అందరి అనుమతితో పెళ్లి పెద్దగా వ్యవహరించి.. వివాహం చేశాడు. కాగా, అతడు చేసిన త్యాగం పట్ల సోషల్ మీడియాలో మీమ్స్ పేలుతున్నాయి. ‘మాములు త్యాగం కాదు భయ్యా నీది’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇక ఇలాంటి ఘటనే అప్పట్లో ఏపీలోని తిరుపతి సమీపంలో జరిగింది. ఓ వివాహిత గతంలో తన భర్త ఓ యవతిని ప్రేమించాడు. ఆ జ్ఞాపకాల నుంచి బయట పడలేక ఆయువతి నేరుగా అతడి ఇంటికి వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న ఆ మహిళ తన భర్తకు ఆ యువతితో వివాహం జరిపించింది. అంతే కాదు ఆ ముగ్గురూ ఒకే ఇంట్లో కాపురం చేస్తుండటం విశేషం.