Madhya Pradesh: టమాటా.. ఇప్పుడు ఈ పేరు వింటేనే ప్రభుత్వాలు ఉలిక్కి పడుతున్నాయి. కొనాలంటే వినియోగదారులు ఆదిరిపడుతున్నారు. అంతలా పెరిగాయి మరీ ధరలు. గత పదిహేను రోజుల నుంచి సోషల్ మీడియా నుంచి ప్రధాన మీడియా వరకు ఈ టమాటాలే ట్రెండింగ్ న్యూస్. ‘కర్ణాటకలో టమాలు పండించిన రైతులు లక్షల్లో లాభాలు గడించారు. జగిత్యాలలో ఓ ఇంట్లో దొంగతనం చేసిన దుండగులు బంగారంతో పాటు ఫ్రిడ్జ్‌లో దాచిన టమాటాలు కూడా ఎత్తుకుపోయారు.’ టమాటాల ధరలు పెరగడం మూలానా ఇలాంటి వార్తలకు కొదవ లేకుండా పోయింది. అయితే వీటంటిన్నింటినీ మించి తన అనుమతి లేకుండా కూరలో రెండు టమాటాలు ఎక్కువ వేశాడని మధ్యప్రదేశ్‌లోని షాదోల్ ప్రాంతానికి చెందిన ఆర్తి అనే మహిళ తన భర్త సందీప్ బర్మన్‌తో గొడవ పడింది. అలిగి ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. దీంతో సోషల్ మీడియాలో ఈ వార్త చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.
మళ్లీ ఇంటికీ వచ్చింది
ఆర్తి ఇంటి నుంచి వెళ్లిపోవడంతో ఆమె భర్త సందీప్ బర్మన్ షాదోల్ ప్రాంత పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారు ఈ కేసును చాలెంజ్‌గా తీసుకుని ఆమె కోసం వెతుకులాట ప్రారంభించారు. ఈక్రమంలో ఆర్తి తన సోదరి ఇంట్లో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. వారు అక్కడికి వెళ్లి “నీ భర్త దగ్గరకు వెళ్లు” అని ఆదేశించగా ఆమె అందుకు నిరాకరించింది. ఆమెకు నచ్చచెప్పిన పోలీసులు తీసుకొచ్చారు. ధన్‌ఫురి పోలీస్ స్టేషన్‌లో భార్యాభర్తలిద్దరినీ కలిపారు. ఈ క్రమంలో తనపై కోపంగా ఉన్న భార్యకు ప్రాయశ్చిత్తంగా అరకిలో టమాలు ఇచ్చాడు. ఇక తన భార్య అనుమతి లేకుండా టమాటా కూర వండనని ప్రమాణం చేశాడు. దీంతో ఆర్తి కాస్త మెత్తబడ్డది. ఇదే తరుణంలో భార్యాభర్తలకు పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు. చిన్న విషయాలకు గొడవ పడి సంసారాలను ఆగం చేసుకోవద్దని కౌన్సెలింగ్ ఇచ్చారు.
అసలు ఏం జరిగిందంటే
షాదోల్ ప్రాంతానికి చెందిన సందీప్ బర్మన్ స్థానికంగా ఒక హోటల్ నిర్వహిస్తుంటాడు. అయితే, టిఫిన్ తయారు చేసే క్రమంలో అందులో ఉపయోగించే కూర కోసం రెండు టమాటాలు వాడాడు. ఈ విషయంలో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. దీంతో మనస్తాపం చెందిన ఆర్తి అలిగి తన కూతురుతో కలిసి ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. బస్సు ఎక్కి తన అక్క ఇంటికి వెళ్లింది. ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్ అని రావడంతో సందీప్‌లో కలవరం మొదలయింది. దీంతో అతడు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారు రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టారు. ఆమె సోదరి ఇంట్లో ఉందని తెలుసుకుని నచ్చచెప్పి తీసుకొచ్చారు. కౌన్సెలింగ్ ఇచ్చి ఇద్దరినీ కలిపారు. దీంతో వారి కథ సుఖాంతమైంది.
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: A husband and wife who got separated due to a dispute over two tomatoes reunited in shadol madhya pradesh
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com