Pakistan Metro: ఆ దేశంలో పేరుకు అధ్యక్షుడు, ప్రధానమంత్రి ఉంటారు గానీ.. పరిపాలించేది మొత్తం సైన్యమే. సైన్యం చేతిలోనే సర్వాధికారాలు ఉంటాయి. ఇక అక్కడ ఉగ్రవాద కార్యకలాపాలు సరేసరి. ఎక్కడ, ఎప్పుడు, ఎలా, ఎవరు బాంబులు పేల్చుతారో తెలియదు. ఎంతమంది చనిపోతారో తెలియదు. ఒక ముక్కలో చెప్పాలంటే అక్కడ చావు అనేది నిత్యకృత్యం. అలాంటి ప్రాంతానికి వెళ్లడం అంటే సాహసమనే చెప్పాలి. అలాంటి పని ఓ విదేశీ టూరిస్ట్ చేశాడు. అతడు ఒక యూట్యూబ్ వ్లాగర్. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వింతలు విశేషాలను అతడు తన ఛానల్ ద్వారా చెబుతుంటాడు. అయితే పాకిస్తాన్లో కూడా ఒక వ్లాగ్ చేయాలని.. అక్కడి వింతలను విశేషాలను సబ్స్క్రైబర్లకు చూపించాలని అతడు అనుకున్నాడు. అందులో భాగంగా పాకిస్తాన్ వెళ్లిపోయాడు.. పాకిస్తాన్లో పలు ప్రాంతాలలో అతడు తిరిగాడు. ఏది కూడా అతగాడికి అంతగా ఆసక్తి అనిపించలేదు. దీంతో కనీసం మెట్రో గురించైనా చెబుదామని వీడియో తీయడం మొదలుపెట్టాడు.. కానీ అక్కడే అతడికి షాకింగ్ పరిణామం ఎదురైంది.
పాకిస్తాన్ లోని లాహోర్లో మెట్రో ఉంటుంది. అన్ని దేశాల్లో ఉన్నట్టుగానే ఇక్కడ కూడా మెట్రోనే ఉంది. దీంతో ఇదేదో ఆసక్తికరంగా ఉందని ఆ యూట్యూబర్ అక్కడికి వెళ్ళాడు. ముందుగా మెట్రోలో ప్రయాణించడానికి ఒక టికెట్ తీసుకున్నాడు. పాకిస్తాన్ కరెన్సీలో డబ్బులు ఇవ్వగా.. టికెట్ గా ఒక కాయిన్ ఇచ్చారు. ఆ కాయిన్ తీసుకొని అతడు రైలు వచ్చే ప్రాంతానికి వెళ్ళాడు. కాయిన్ మిషన్లో వేగా అది ఎంట్రీకి దారి చూపించింది. అయితే అతడు మెట్రో ఎక్కడానికి స్టేషన్ వద్దకు వెళ్లాడు. వెళ్లిన వెంటనే ఒక వాహనం వచ్చింది. సెంట్రల్ ఏసీ అయితే ఉంది.. జనం కూడా భారీగానే ఉన్నారు. అతడు వీడియో తీసుకుంటూ కొద్ది స్టేషన్ల తర్వాత దిగాడు. అంతసేపు వీడియో తీసి.. అక్కడ విశేషాల గురించి చెప్పిన ఆ టూరిస్ట్ కు ఏదో తెలియని వెలితి. దీంతో అతడు వచ్చి రాని ఉర్దూ లో కొంతమందిని అడిగాడు.. పాకిస్తాన్ లో మెట్రో ఇలానే ఉంటుందా అని ప్రశ్నించాడు. దానికి వారు ఇది పాకిస్తాన్ మెట్రోనే.. కాకపోతే దీనిని బస్సు అని పిలవాలి అని అతనికి కౌంటర్ ఇచ్చారు. దీంతో ఆ విదేశీ టూరిస్ట్ ఒకసారిగా షాక్ కు గురయ్యాడు. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసి.. తన అనుభవాన్ని ఆ విదేశీ టూరిస్ట్ పంచుకున్నాడు. అయితే చాలామంది ఈ వీడియోని చూశారు.. దాయాది పాకిస్తాన్ దేశాన్ని తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు.
పాక్ లో మెట్రో గురించి ఓ విదేశీ టూరిస్ట్ వెల్లడించాడు. అన్ని దేశాల్లో మాదిరిగానే పాకిస్తాన్లోనే మెట్రో ఉంటుందని.. కాకపోతే ట్రాక్ మార్గంలోకి రైలుకు బదులుగా బస్సు వస్తుందని అతడు వ్యాఖ్యానించాడు. #Pakistanmetro #Pakistan#foreigntourist #viralvideo #socialmedia pic.twitter.com/CbEzfAW8II
— Anabothula Bhaskar (@AnabothulaB) February 19, 2025