Viral Video: చాలా మంది రైతులు తమ పంట పొలాలను కాపాడేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కొందరు వాణిజ్య పంటలు వేసే వాళ్ళు కోతులు, అడవి పందులు, బెడద నుంచి రక్షించుకునేందుకు కంచెలు, ఇతర సదుపాయాలను ఏర్పాటు చేసుకుంటారు. కానీ రైతులు పొలంలో లేని సమయంలో అవి వచ్చి పంటలను ధ్వంసం చేస్తూ ఉంటాయి. అంతేకాకుండా పండించిన పంట మొత్తం వాటి చర్యలతో నాశనం అవుతుంది. దీంతో రైతులు కష్టం పంట నేలపాలు కావడంతో దుఃఖమయంలో మునిగిపోతారు. అయితే కాలం మారుతున్న కొద్ది టెక్నాలజీ అందుబాటులోకి వస్తుంది. ఈ క్రమంలో రైతులు కొత్త కొత్త పద్ధతులతో తమ పంటలను కాపాడుకుంటూ ఉంటున్నారు. తాజాగా కొందరు రైతులు పంటను కాపాడుకునేందుకు చేసిన ప్రయత్నాలతో అందరూ షాక్ అవుతున్నారు. ఇక్కడ టెక్నాలజీ ఉపయోగించకుండా సింపుల్ ట్రిక్ తో జంతువులు రాకుండా చేస్తున్నారు. ఇంతకీ ఆ రైతులు ఏం చేశారో తెలుసా..?
ఇప్పటివరకు చాలామంది రైతులు తమ పంటల్లోకి జంతువులు రాకుండా దిష్టిబొమ్మలను ఏర్పాటు చేసుకునేవారు. కానీ అడవి పందులు రాత్రి వేళల్లో పంటల్లోకి చొచ్చుకు వచ్చి ధ్వంసం చేస్తున్నాయి. దీంతో రైతులు ఉదయం చేనులోకి వచ్చేసరికి పంటలు నాశనం అవుతున్నాయి. అయితే ఇప్పుడు రైతులు స్వయoగా రంగంలోకి దిగి అవి రాకుండా ప్రయత్నాలు చేస్తున్నారు.
తాజాగా ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రాత్రి ఇద్దరూ రైతులు కలిసి తమ పంట పొలాల్లోకి వెళ్తారు. వీరిలో ఒక రైతు టార్చిలైట్ పట్టుకొని ఉంటారు. మరో రైతు డప్పు కొట్టుకుంటా నోటితో అరుస్తాడు. ఈ సౌండ్ తో గ్రామం మొత్తం దద్దరిల్లిపోయింది. ఈ శబ్దం వల్ల ఎలాంటి జంతువులు పంటలోకి రావు అని ఆ రైతులు పేర్కొంటున్నారు. అయితే రాత్రి సమయంలోనే జంతువులు ఎక్కువగా వస్తుండడంతో ఈ రైతులు రాత్రులు ఇలా చేశారు .
ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియో పై చాలామంది రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఈ శబ్దానికి జంతువులు మాత్రమే కాదు దయ్యాలు కూడా రావు అని కొందరు కామెంట్ చేయడం విశేషం. మరోవైపు ఎంతో కాలంగా శ్రమిస్తున్న రైతులకు ఇది మంచి ఉపాయమని అంటున్నారు. అయితే ఈ శబ్దాలతో పాటు రైతులు ఒక రికార్డింగ్ ఏర్పాటు చేసి మైక్ లో ఉంచినా సరిపోతుందని చెబుతున్నారు. ఈ మైకు వల్ల రైతులు పంట పొలాల్లో రానాల్సిన రావాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. మొత్తానికి పంటలను కాపాడుకునేందుకు రైతులు శబ్దం చేసే ప్రయత్నం ఫలితాలను ఇస్తుందని అంటున్నారు.
View this post on Instagram