
Ram Charan: గత కొద్దీ రోజుల నుండి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ కోసం రామ్ చరణ్ ప్రత్యేకంగా ఫోటో షూట్స్ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.ఈ కార్యక్రమానికి అభిమానులు తండోపతండాలుగా వచ్చి రామ్ చరణ్ తో ఫోటోలు దిగుతున్నారు,దానికి సంబంధించిన వీడియోలు మరియు ఫోటోలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.
అభిమానుల పట్ల రామ్ చరణ్ చూపిస్తున్న ప్రేమపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తుంది.రీసెంట్ గా ఒక అభిమాని శరీరం మొత్తం పచ్చబొట్టు వేయించుకొని రామ్ చరణ్ ముందుకి వచ్చిన సంగతి తెల్సిందే.అది సోషల్ మీడియా లో బాగా వైరల్ గా మారింది.ఆ తర్వాత ఒక చిన్న పిల్లవాడు రామ్ చరణ్ ని కలవడానికి పడిన కష్టం గురించి చరణ్ తో చెప్పిన మాటలు ఎంత గుండెల్ని పిండేసేలా చేశాయో అందరం చూసాము..ఇలా ఎంతో మంది చరణ్ పై కురిపించిన అంతులేని అభిమానం చూసి అందరూ ఆశ్చర్యపోయారు.
ఇక ఈరోజు జరిగిన ఫోటో షూట్ లో ఒక అభిమాని జానపద గేయాన్ని రామ్ చరణ్ ముందు పాడిన వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది, రామ్ చరణ్ ఆ కుర్రాడి టాలెంట్ ని ఎంతో మెచ్చుకొని, తన సినిమాల్లో ఎప్పుడో ఒకసారి అవకాశం ఇస్తానని మాట ఇచ్చాడు.అలా రామ్ చరణ్ ఈ మూడు రోజుల్లో 500 మంది అభిమానులకు ఫోటో షూట్ ఇచ్చాడు.ప్రస్తుతం ఆయన శంకర్ తో చేస్తున్న సినిమా షూటింగ్ ఆంధ్ర ప్రదేశ్ పరిసరాల్లోనే జరుగుతుంది.

మొన్నీమధ్యనే సీడెడ్ ప్రాంతం లోని కర్నూలు లో కొండారెడ్డి బురుజు వద్ద కొన్ని కీలక సన్నివేశాలను తియ్యగా, ఇప్పుడు వైజాగ్ లోని గీతం కాలేజీ లో ఒక సాంగ్ షూట్ చేస్తున్నారు.దీనికి సంబంధించిన ఫోటోలు మరియు వీడియోలు సోషల్ మీడియా లో లీక్ అయ్యాయి.రామ్ చరణ్ తో పాటుగా శ్రీకాంత్ , రాజీవ్ కనకాల తదితరులు ఈ షూటింగ్ లో పాల్గొన్నారు.