
Rashmika Mandanna: రష్మిక మందాన తన అభిమానులకు ప్రేమికుల రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇంస్టాగ్రామ్ లో ఒక క్రేజీ వీడియో షేర్ చేశారు. తన పెట్ డాగ్ ఆరా తో ఆడుకుంటున్న వీడియో రష్మిక పోస్ట్ చేశారు. సదరు వీడియోకి ”నన్ను ప్రేమించే మీ అందరికీ మా తరపున హ్యాపీ వాలెంటైన్స్ డే!” అని కామెంట్ చేశారు. రష్మిక మందన పోస్ట్ వైరల్ గా మారింది. అదే సమయంలో ఫ్యాన్స్ భిన్నమైన కామెంట్స్ చేస్తున్నారు. విజయ్ దేవరకొండ ఎక్కడ? అని కొందరు అడుగుతుంటే. సిద్ధార్థ్ మల్హోత్రా-కియారా అద్వానీ మాదిరి పెళ్లి చేసుకోవచ్చుగా… అని సలహాలు ఇస్తున్నారు.
Also Read: Chiranjeevi Bhola Shankar: భోళా శంకర్ తర్వాత చిరంజీవి సినిమాలు చెయ్యడం లేదా..? అయ్యోమయంలో ఫ్యాన్స్
చాలా కాలంగా రష్మిక-విజయ్ దేవరకొండ మధ్య లవ్ ఎఫైర్ నడుస్తుందంటూ ప్రచారం జరుగుతుంది. ఓ ఏడాది నుండి మరింత ఊపందుకుంది. గత ఏడాది రెండు పర్యాయాలు రష్మిక-విజయ్ దేవరకొండ మాల్డీవ్స్ వెకేషన్ కి వెళ్లారు. వీరిద్దరూ కలిసి ట్రిప్ ఎంజాయ్ చేయడంతో పాటు ఒకే గదిలో స్టే చేశారనడానికి ఆధారాలు లభించాయి. ఇదే విషయం అడిగితే రష్మిక సమర్ధించుకున్నారు. విజయ్ దేవరకొండ నా బెస్ట్ ఫ్రెండ్. అతనితో వెకేషన్ కి వెళితే తప్పేంటి అంటూ ఎదురు ప్రశ్నించారు.
ఇటీవల విజయ్ ఫ్యామిలీతో దుబాయ్ ట్రిప్ కి వెళ్లగా అక్కడ కూడా రష్మిక ప్రత్యక్షమైంది. వరుస సంఘటనల నేపథ్యంలో రష్మిక-విజయ్ దేవరకొండ మధ్య ఎఫైర్ నిజమే అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. కాగా కెరీర్ బిగినింగ్ లో రష్మిక కన్నడ హీరో రక్షిత్ శెట్టిని ప్రేమించారు. ఇద్దరికీ ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. కొద్దిరోజుల్లో పెళ్లి అనగా క్యాన్సిల్ చేసుకున్నారు. ఇటీవల వేణు స్వామి అనే జ్యోతిష్కుడు నేను చెప్పడం వలనే రష్మిక ప్రియుడు రక్షిత్ శెట్టితో మ్యారేజ్ క్యాన్సిల్ చేసుకుందంటూ… బాంబు పేల్చాడు.

వేణు స్వామితో కెరీర్ లో ఎదగడానికి రష్మిక ప్రత్యేక పూజలు చేయించారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు వైరల్ అయ్యాయి. మరోవైపు రష్మిక కెరీర్ పీక్స్ లో ఉంది. ఆమె రెండు భారీ ప్రాజెక్ట్స్ లో హీరోయిన్ గా నటిస్తున్నారు. అల్లు అర్జున్ కి జంటగా పుష్ప 2 చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ఇటీవలే మొదలైంది. ఇక సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో యానిమల్ మూవీ చేస్తున్నారు. రన్బీర్ కపూర్ హీరోగా యానిమల్ మాఫియా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుంది. యానిమల్, పుష్ప 2 ఇదే ఏడాది విడుదల కానున్నాయి.
Also Read:Senior NTR- Junior NTR: ఆ హీరోయిన్స్ తో ప్రేమలో ఫెయిలైన సీనియర్-జూనియర్!
View this post on Instagram