Dolly Sohi: బాలీవుడ్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన అక్క చెల్లెళ్ళు 24 గంటల వ్యవధిలో కన్నుమూశారు. హిందీ సీరియల్స్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరయ్యారు డాలీ సోహి. 2000 లో ప్రసారమైన కలాష్ ఆమె డెబ్యూ సీరియల్. ‘బాబీ’ సీరియల్ ఆమెకు మంచి గుర్తింపు తెచ్చింది. 24 ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో డాలీ సోహి ఇరవైకి పైగా సీరియల్స్ లో నటించింది.
డాలీ సోహి కొన్నాళ్లుగా గర్భాశయ క్యాన్సర్ తో బాధపడుతుంది. చికిత్స తీసుకుంటూ నేడు ముంబైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కన్నుమూసింది. మరణానికి ముందు ఆమె సోషల్ మీడియాలో ఓ సందేశం పోస్ట్ చేసింది. ‘ప్రార్థన అనేది ప్రపంచంలో గొప్ప వైర్లెస్ కనెక్షన్ . అది ఒక మాయలా పని చేస్తుంది. నాకు మీ ప్రార్థనలు కావాలి…’ అని సోషల్ మీడియా సందేశంలో పొందుపరిచారు. అంతలోనే ఆమె మరణించారు.
ఆమె మరణంలో అతిపెద్ద విషాదం ఏమిటంటే.. డాలీ సోహి మరణానికి ముందు రోజు ఆమె సిస్టర్ కూడా అకాల మరణం పొందారు. జాండిస్ కి చికిత్స తీసుకుంటూ డాలీ సోహి సిస్టర్ అమందీప్ సోహి చనిపోయారు. డాలీ మరణం నేపథ్యంలో అభిమానులు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ప్రముఖులు సానుభూతి తెలియజేస్తున్నారు. డాలీ సోహి వయసు 48 ఏళ్ళని సమాచారం.
కాగా ఇటీవల పూనమ్ పాండే ఇదే జబ్బుతో మరణించినట్లు ప్రచారం జరిగింది. ఆమె సోషల్ మీడియా అకౌంట్ లో గర్భాశయ క్యాన్సర్ తో మరణించినట్లు సందేశం పోస్ట్ చేశారు. నిజానికి పూనమ్ పాండే మరణించలేదు. ఈ గర్భాశయ క్యాన్సర్ గురించి మహిళల్లో అవగాహన పెంచేందుకు అలా చేశానని పూనమ్ పాండే అనంతరం వీడియో విడుదల చేసింది.