https://oktelugu.com/

Noida : ఇదేంది.. ఎప్పుడూ సూడలే.. పెళ్లయిన తెల్లారే బిడ్డ పుట్టింది.. వరుడి షాక్‌!!

సికింద్రాబాద్‌కు చెందిన ఆ యువతి పెళ్లికి ముందే గర్భం దాల్చిందన్న విషయం తెలిసి కూడా పెళ్లికూతురు తల్లిదండ్రులు విషయాన్ని దాచారని వరుడు, అతని తల్లిదండ్రులు ఆరోపించారు. తల్లీ వద్దు.. బిడ్డా వద్దు అని తెగేసి చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : July 1, 2023 / 01:03 PM IST
    Follow us on

    Noida : కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు పుడతారంటారు.. ఇదీ సామెత… అచ్చం ఈ సామెతలా కాకపోయినా.. ఓ వరుడు పెళ్లయిన మరుసటి రోజే బిడ్డకు తండ్రయ్యాడు. కాపురం చేయకుండానే బిడ్డ పుట్టింది. అదేంటి.. అదెలా సాధ్యం.. ఇలాంటి వింత ఎక్కడా చూడలేదు అనుకుంటున్నారు. నిజమే వింతే.. ఎక్కడా ఇలా జరుగదు కూడా కాపురమే చేయకుండా పిల్లలు పుట్టడం అసాధ్యం కానీ.. నోయిడాలో ఓ జంట పెళ్లిచేసుకున్న మరుసటి రోజే వధువు ప్రసవించింది. బిడ్డకు జన్మనిచ్చింది. షాక్‌ అవ్వడం వరుడి వంతైంది.
    కడుపు నొప్పని వెళ్తే.. 
    జూన్‌ 26 సోమవారం రోజున పెద్దల సమక్షంలో వేదమంత్రాల సాక్షిగా ఆ జంట ఒక్కటయ్యారు. అదే రోజు రాత్రి వధువుకు కడుపులో చిన్నగా నొప్పి వస్తోందని చెప్పడంతో కుటుంబ సభ్యులు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు ఆమెను పరీక్షించి చూడగా ఆమె ఏడో నెల గర్భవతి అని తెలిపారు. దీంతో అంతా షాక్‌ అయ్యారు. పరీక్షలు సరిగా చేయలేదేమో అని వైద్యులతో వాగ్వాదానికి దిగారు. ఇంతలోనే వధువుకు నొప్పులు పెరిగాయి. దీంతో ఇది కడుపు నొప్పి కాదని, పురిటి నొప్పుటని వైద్యులు గుర్తించారు. వెంటనే డెలివరీ చేయాలని చెప్పి ఆపరేషన్‌ థియేటర్‌కు తీసుకెళ్లారు. కాసేపటికి పండండి బిడ్డను తీసుకొచ్చి వరుడి చేతిలో పెట్టారు. అమ్మనీ బడవా.. ఇదేంది.. నా ప్రమేయం లేకుండా బిడ్డకు తండ్రయ్యానా అని వరుడితోపాటు అత్తమామలు షాక్‌ అయ్యారు.
    కిడ్నీ ట్రీట్‌మెంట్‌ ప్రభావం అనుకుని..
    గతంలో వధువుకు కిడ్నీలో రాళ్లు రావడంతో వైద్యం చేయించారు. ఆ తర్వాత ఆమె కడుపు పెరగడం ప్రారంభమైంది. దీంతో కుటుంబ సభ్యులు కిడ్నీ వ్యాధి ట్రీట్‌మెంట్‌ ప్రభావంతో ఇలా జరుగుతుందేమో అనుకున్నారు. కానీ లోపల బిడ్డ పెరుగుతుందని గ్రహించలేదు అని వధువు తల్లిదండ్రులు చెబుతున్నారు.
    తల్లి వద్దు.. బిడ్డా వద్దు.. 
    ఇదిలా ఉంటే.. సికింద్రాబాద్‌కు చెందిన ఆ యువతి పెళ్లికి ముందే గర్భం దాల్చిందన్న విషయం తెలిసి కూడా పెళ్లికూతురు తల్లిదండ్రులు విషయాన్ని దాచారని వరుడు, అతని తల్లిదండ్రులు ఆరోపించారు. తల్లీ వద్దు.. బిడ్డా వద్దు అని తెగేసి చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు. అంతలోనే బంధువులు కల్పించుకుని సమస్య సద్దుమణింది. బిడ్డకు తండ్రి ఎవరో మాత్రం వధువే చెప్పాలి మరి!