https://oktelugu.com/

Viral : ఆ వ్యక్తి కట్టేకాలే వరకూ ఆ గోమాత ప్రేమ అనంతం.. వైరల్ ఫొటో

తాజాగా గంగారం మరణాన్ని తట్టుకోలేని గోమాత ఆయన శవయాత్ర మొత్తం తాను కూడా నడిచి శ్మశానంలో కూడా ఆయన చితి పూర్తిగా కాలేంత వరకూ కన్నీరు కారుస్తూ మౌనంగా రోదిస్తూ శ్రద్దాంజలి ఘటించింది . ఆ సంఘటనతో అందరూ కదిలిపోయారు ..

Written By:
  • NARESH
  • , Updated On : June 5, 2023 8:21 pm
    Follow us on

    cow love : విశ్వాసానికి మారుపేరుగా అందరూ కుక్కను అంటుంటారు. కానీ దానికి మించి మనం సాదుకునే సాకే గోమాత తల్లికంటే గొప్పగా ప్రేమిస్తుందని తేటతెల్లమైంది. మన సాగుకు, పాలకు, మనతోపాటు కష్టించే గోమాతను వేయినోళ్ల కొలుస్తారు రైతులు. గ్రామాల్లో గోవులను మరో తల్లిగా పూజిస్తారు. దానిద్వారానే మనం వ్యవసాయం, పాడి పరిశ్రమ, పాలు, పెరుగు సహా ఎన్నో వాటిని పొందుతుంటాం. అయితే అలాంటి గోవులను ప్రేమగా చూపిస్తే ఆ ప్రేమ గొప్పతనం మనకు తిరిగి ఇస్తాయని రుజువైంది. ఓ గోమాతను కనబిడ్డగా చూసుకున్న పెద్దమనిషి చనిపోతే ఆయన అంత్యక్రియలు వెంట గోవు రావడం.. ఆయన కాలేవరకూ ఉండడం అందరినీ కలిచివేసింది.

    చెన్నై నగరం లోని వేదంపట్టు ప్రాంతానికి చెందిన గంగా రాం ఉపాద్యాయ నిన్న చనిపోయారు. ఆయన ప్రతిదినమూ ఉదయం తన వాకిట్లోకి వచ్చే గోమాతకు ఆహారాన్ని అందించిన తర్వాత మాత్రమే తన దినచర్య ప్రారంభించేవారు. అలా ఆ గోమాతకు.. గంగారంకు మంచి అనుబంధం ప్రేమ ఏర్పడింది. గంగారాం కనిపించిన ప్రతీసారి ఆ గోమాత ప్రేమగా దగ్గరకు వచ్చి ఆప్యాయత చాటుకునేది.

    తాజాగా గంగారం మరణాన్ని తట్టుకోలేని గోమాత ఆయన శవయాత్ర మొత్తం తాను కూడా నడిచి శ్మశానంలో కూడా ఆయన చితి పూర్తిగా కాలేంత వరకూ కన్నీరు కారుస్తూ మౌనంగా రోదిస్తూ శ్రద్దాంజలి ఘటించింది . ఆ సంఘటనతో అందరూ కదిలిపోయారు ..

    కపాల మోక్షం అయిందని కాటికాపరి బంధువులకు చెప్పగానే ఆశ్చర్యంగా గోమాత కూడా మౌనంగా లేచి నిలబడి ఒకసారి తలతో చివరిసారిగా అభివాదం చేసి నిష్క్రమించిది. అందుకేనేమో గోవును తల్లి తర్వాత తల్లి అని మన భారత సంస్కృతి కొనియాడింది.