Viral News: ఆ పెద్దాయన విషయంలోనే కాదు.. దాదాపు తెలుగు రాష్ట్రాల్లో ఎవరో ఒకరి ఇంట్లో ఇలాంటి ఘటనలు సర్వ సాధారణంగానే మారిపోయాయి.. కరోనా సమయంలో ఈ పరిస్థితి మరింత దారుణం.. కరుణ తర్వాత కూడా ఈ పరిస్థితికి కొనసాగింపు అన్నట్టుగానే మారిపోయింది గాని.. పెద్దగా తేడా అయితే రాలేదు. ఇక ప్రస్తుతం అమెరికాలో డోనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితులు వేగంగా మారిపోతున్నాయి. జన్మత: లభించే అమెరికా పౌరసత్వం విషయంలో ట్రంప్ కీలకమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇవి కాస్త వివాదాస్పదంగా మారిపోతున్నాయి. ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలను అక్కడి కోర్టులు వ్యతిరేకిస్తుండగా.. అక్కడ ఉంటున్న భారతీయ అమెరికన్లకు చుక్కలు చూపిస్తున్నాయి. ఏ క్షణంలో మమ్మల్ని దేశం విడిచి వెళ్లి పొమ్మంటారోననే ఆందోళన అక్కడివారిని కుంగదీస్తోంది. ఇదే సమయంలో భారతీయ అమెరికన్ల తల్లిదండ్రుల్లో మాత్రం మాత్రం సంతోషం వ్యక్తమవుతోంది.. దానికి సంబంధించి కొంతమంది ఔత్సాహిక కార్టూన్లు వేస్తున్న చిత్రాలు దానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి.
ప్రముఖ కార్టూనిస్ట్ ఏపూరి రాజు.. అమెరికాలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితిపై గీసిన ఒక కార్టూన్ సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయం భారతీయుల తల్లిదండ్రుల్లో హర్షాన్ని నింపుతోంది అన్నట్టుగా ఆయన కార్టూన్ గీశారు. ఎందుకంటే డాలర్ల వేటలో పడి.. సంపాదన మోజులో పడి చాలామంది భారతీయులు అమెరికా బాట పడుతున్నారు. అక్కడే స్థిరపడిపోతున్నారు. ఇక్కడికి రావడానికి ఏమాత్రం ఇష్టం చూపడం లేదు. దీంతో ఇక్కడే ఉంటున్న వారి తల్లిదండ్రులు అనారోగ్యానికి గురైనప్పుడు.. లేదా ఇంకా ఏదైనా ప్రమాదానికి గురైనప్పుడు చివరి చూపు చూసుకోవడానికి కూడా రావడం లేదు. మరికొందరైతే తమ తల్లిదండ్రులని వృద్ధాశ్రమాలలో చేర్పిస్తున్నారు. ఇలాంటి పరిణామాలు తెలుగు రాష్ట్రాలలో ఇటీవల పెరిగిపోయాయి. అందువల్లే ట్రంప్ తీసుకున్న నిర్ణయం అమల్లోకి వస్తే తమ పిల్లలు అమెరికాని వదిలిపెట్టి ఇక్కడికి వస్తారని.. తమతోనే ఉండిపోతారని తల్లిదండ్రులు భావిస్తున్నారు. ట్రంప్ తీసుకున్న జన్మతా: పౌరసత్వం విషయంలో వ్యతిరేకత వ్యక్తమౌతున్న నేపథ్యంలో.. అమెరికాలో ఏం జరుగుతుందనేది ఉత్కంఠ గా మారింది. అవన్నీ ఏమో గాని.. ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాల వల్ల అమెరికాలో స్థిరపడిన తెలుగు వారు మాత్రం ఇక్కడికి తిరిగి వస్తే.. తల్లిదండ్రుల్లో ఆనందం మామూలుగా ఉండదు. అందువల్లే ఈ కోణంలో ట్రంప్ ను అభినందించవచ్చు. చివరికి సన్మానం కూడా చేయవచ్చు.