Homeట్రెండింగ్ న్యూస్Buddhist Temple: బీరు సీసాలతో బుద్ధుడి గుడి.. ఎక్కడ ఉంది.. ఎన్ని సీసాలు వాడరో తెలుసా?

Buddhist Temple: బీరు సీసాలతో బుద్ధుడి గుడి.. ఎక్కడ ఉంది.. ఎన్ని సీసాలు వాడరో తెలుసా?

Buddhist Temple: గుడి అనగానే అద్భుతమైన నిర్మాణం.. ఆధ్యాత్మికత ఉట్టిపడే శిల్పాలు.. భక్తిభావం పెంపొందించే దేవతామూర్తులు.. ఇలా అనేక అంశాలు గుర్తొస్తాయి. అయితే ఆలయాల నిర్మాణంలో వివిధ శైలులు ఉన్నాయి. మనల్ని పాలించిన పూర్వీకులు వారి కళానైపుణ్యం, వారి పాలన తీరు తెలిసేలా కూడా నిర్మాణాలు చేశారు. పాలకులు వారు ఆరాధించే ఆలయాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఇలా వెలిసిన ఆలయాల్లో అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయం.. తమిళనాడులోని బంగారు మహాలక్ష్మి ఆలయం.. ఎంతో ప్రసిద్ధి. వీటిని పూర్తిగా బంగారంతో నిర్మించారు. ఇలాంటి భిన్నమైన శైలి నిర్మాణం గల ఆలయం ఒకటి ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. అదే బీర్‌ బాటిల్‌ టెంపుల్‌. థాయ్‌లాండ్‌లో ఉన్న ఈ గుడిని బౌద్ధ సన్యాసులు బుద్ధిడికి నిర్మించారు.

వ్యర్థానికి అర్థం తెలిపేలా..
థాయ్‌లాండ్‌ టూరిజానికి చాలా ప్రసిద్ధి. ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది ఇక్కడికి వస్తుంటారు. సముద్ర తీరంలో ఎంజయ్‌ చేస్తుంటారు. ఈ క్రమంలో సముద్ర తీరంలో మద్యం సేవించి ఖాళీ సీసాలను అక్కడే పడేస్తున్నారు. ఇలా సముద్రతీరమంతా గుట్టలుగా సీసలు పేరుకుపోతున్నాయి. దీనిని గమనించిన బౌద్ధ సన్యాసులు వాటిని దేనికైనా ఉపయోగించాలని నిర్ణయించారు. ఈ క్రమంలో వాటిని సేకరించి సముద్రం నీటితో శుభ్రంగా కడిగి నిల్వ చేయడం ప్రారంభించారు.

బుద్ధుడికి గుడి..
ఈ క్రమంలో తమ ఆరాధ్య దైవమైన బుద్దుడికి ఆలయం నిర్మించాలని ఆలోచిస్తున్నారు. ఇందుకోసం ఇటుక, ఇసుక, సిమెంటు, స్టీల్‌ సేకరించాలనుకున్నారు. అయితే ఇంతలో వారికి ఓ ఆలోచన వచ్చింది. తాము సేకరిస్తున్న ఖాళీ సీసాలతో గుడి నిర్మిస్తే బాగుంటుందని, భిన్నంగా ఉంటుందని అనుకున్నారు. ఇందుకు అందరూ అంగీకరించారు. దీంతో ఖాళీ సీసాలతో నిర్మాణం చేపట్టారు.

15 లక్షల సీసాలు..
సిసాకెన్స్‌ ప్రావిన్స్‌లోని కుసాహాథ్‌ జిల్లాలో వాట్పామహా చెడిక్యూ పేరుతో ఈ ఆలయం నిర్మాంచారు. ఇందుకు సుమారుగా 15 లక్షల బీరు సీసాలు వినియోగించారు. దీనికి బౌద్ధ సన్యాసులతోపాటు, ప్రభుత్వం నుంచి కూడా సహకారం అందింది. ఆలయంతోపాటు ఆలయం ముందు కొలను కూడా సీసాలతోనే నిర్మించారు. 10 లక్షలకు పైగా సీసాలు వినియోగించి నిర్మించినందున ఈ ఆలయాన్ని మిలియన్‌ బాటిల్‌ టెంపుల్‌గా కూడా పిలుస్తారు.

భిన్నమైన శైలి..
ఆలయం పైభాగం మొత్తం ఆకుపచ్చ రంగులో ఉంటుంది. ఆలయ ప్రాంగణం, నేట, మెట్లు, ప్రహరీ, ఈత కొలను కూడా సీసాలతోనే నిర్మించారు. మధ్యమధ్యలో ఎరుపు రంగు సీసాలు డిజైన్‌ కోసం వాడారు. ఇక సీసాల మూతలను కరిగింది. బుద్ధుడి విగ్రహం తయారు చేయించి ఈ ఆలయంలోనే ప్రతిష్టించారు. ఈ ఆలయ నిర్మాణానికి రెండేళ్ల సమయం పట్టిందట. ప్రస్తుతం థాయ్‌లాండ్‌ టూరిజంలో ఈ మిలియన్‌ బాటిల్‌ టెంపుల్‌ ప్రత్యేక ఆకర్షణగా మారింది. పర్యాటకులను ఆకట్టుకుంటోంది. అయితే కొంతమంది గుడిని మద్యం బాటిళ్లతో కట్టడం ఏంటని విమర్శలు కూడా చేస్తున్నారు. కానీ భిన్నమైన ఆలోచనతో ఈ ఆలయం నిర్మితమైంది కాబట్టి చాలా మంది అభినందిస్తున్నారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version