Brazilian Couple: కోరికలు గుర్రాలు అయితే.. వాటికి పట్ట పగ్గాలు ఉండవు అంటారు పెద్దలు. అలాంటిదే ఇది కూడా.. ఓ జంట లో కలిగిన విచిత్రమైన కోరిక.. వారిని కొండ ప్రాంతం వరకు ప్రయాణించేలా చేసింది. వారిలో కట్టలు తెంచుకున్న ఉద్వేగం తీవ్రంగా రెచ్చగొట్టింది. కొండపైకి వెళ్ళిన తర్వాత వారిలో కామం నదిలాగా ప్రవహించింది. అదే వారి జీవితాలలో అనుకోని మార్పులకు కారణమైంది.
బ్రెజిల్ దేశంలో ఇటీవల దారుణం చోటుచేసుకుంది. ఓ కారులో ఓ యువతీ యువకుడు నగ్న స్థితిలో మృతి చెంది కనిపించారు. వారు ప్రయాణిస్తున్న కారు కూడా ధ్వంసం అయింది. మొదట్లో ఇది ప్రమాదవశాత్తు జరిగిందని అందరూ అనుకున్నారు. ఆ తర్వాత ఏదైనా హత్య ప్రయత్నం జరిగిందా అనే కోణంలో కూడా ఆలోచించారు. కాని చివరికి అసలు విషయం తెలిసి ముక్కున వేలేసుకున్నారు. ఇలా కూడా జరుగుతుందా.. ఇలాంటివి కూడా చేస్తారా.. అని ఆశ్చర్యపోయారు.
బ్రెజిల్ దేశంలో ఓ జంట వినూత్నంగా శృం*గారం జరుపుకోవాలని భావించింది. ఏకంగా ఓ కొండ ప్రాంతం వద్దకు వెళ్ళింది. దాదాపు 1300 అడుగుల ఎత్తైన కొండ అది. ఆ కొండ అంచున ఆ జంట తమ కారును ఆపింది. ఆ సమయంలో అందులో ఉన్న వారు శృం*గారం మొదలుపెట్టారు. ఆ తాకిడికి కారు ముందుకు కదిలింది. అంతేకాదు అది బలంగా నేలను ఢీ కొట్టింది. అలా కారు కింద పడింది. ఆ సమయంలో అందులో ఉన్న వారిద్దరు దుర్మరణం చెందారు.. వారి దేహాలు తీవ్రంగా గాయపడ్డాయి. రక్తం విపరీతంగా కారింది.. ఈ దృశ్యాలను అక్కడి స్థానికులు చూసి పోలీసులకు సమాచారం అందించారు. చనిపోయిన వారిని ఆండ్రియానా మచ్చాడో రిబీరో(42), మార్కోన్ డా సిల్వా కార్డో సో(26) గా గుర్తించారు. వీరిద్దరు కూడా ఓ పార్టీలో పాల్గొని తిరిగి వస్తున్న సమయంలో ఈ దారుణం జరిగి ఉంటుందని తెలుస్తోంది. తెల్లవారుజామున ఒంటిగంట సమయంలో ఈ ఘటన చోటు చేసుకుందని తెలుస్తోంది. మరుసటి రోజు ఉదయం ఓ కేర్ టేకర్ ఈ విషయాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించాడు.