Sanju Valmiki Akshata Love: ఊహలకందని భావం.. ఊసులు పంచే రాగం.. మురిపించే కల.. మైమరపించే వల ఇవన్నీ కలిపితే ప్రేమ. ప్రేమ గురించి తెలియని మనిషి ఉండరంటే అతిశయోక్తి కాదేమో. ప్రేమ చిగురించని మనసు ఉండదని తెలుసు. కానీ రెండు మనసుల తీయని ప్రేమను వర్ణించడం అంత సులువు కాదు. మాటలకందని వనం.. మమతలతో పెనవేసుకునే బంధం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ప్రేమ గురించి ఎన్నో సినిమాలు చూశాం. ఎన్నో పుస్తకాలు చదివాం. కానీ ప్రేమను ఆస్వాదిస్తే తప్ప అర్థం కాదు. ప్రేమిస్తే తప్ప దాని అంతరార్థం అర్థం కాదు.

దావణగెరెకు చెందిన సంజు కె.వాల్మీకి, అక్షత చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నారు. ఇద్దరు పుట్టు మూగ, చెవిటి వారు కావడంతో ఇద్దరి మధ్య స్నేహం కుదిరింది. పది వరకు కలిసి చదువుకున్నారు. తరువాత విడిపోయారు. సంజు బెంగుళూరులో ఐటీఐ పూర్తి చేసి ఉద్యోగం చేస్తున్నాడు. అక్షత ఉన్న ఊర్లోన చదువుకుంది. కానీ ఇద్దరి మధ్య సంబంధాలు మాత్రం విడిపోలేదు. ఇప్పటికి కలుసుకుంటూనే ఉంటున్నారు. ఈ నేపథ్యంలో వారి మధ్య ప్రేమ చిగురించింది.
Also Read: కులాల కుంపటిలో యూపీ ఎన్నికలు
దీంతో ఇద్దరి మధ్య వాట్సాప్ బంధం కొనసాగింది. దీంతో ఇద్దరి అభిప్రాయాలు బాగా కలిసిపోయాయి. వారి ప్రేమ గురించి పెద్దలకు తెలియజేశారు. సంజు వారి ఇంట్లో ఒప్పుకున్నా అక్షత ఇంట్లో మాత్రం ససేమిరా అన్నారు. దీంతో ఇద్దరు కలిసి వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కలిసి జీవిత ప్రయాణం కొనసాగించాలని భావించుకున్నారు.
ఇద్దరు రిజిస్ట్రార్ ఆఫీసులో పెళ్లి చేసుకున్నారు. కానీ అక్షత కుటుంబ సభ్యులు సంజుపై కేసు పెట్టారు. తమ కూతురును కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకున్నాడని చెప్పడంతో సంజును పోలీస్ స్టేషన్ కు పిలిపించారు. కానీ అక్షత తన ఇష్ట ప్రకారమే పెళ్లి చేసుకున్నానని చెప్పడంతో పోలీసులు కూడా ఏమీ అనలేకపోయారు. ఇద్దరిని ఆశీర్వదించారు.
Also Read: కేసీఆర్ పై రాజద్రోహం కేసు పెట్టేందుకు బీజేపీ రెడీ