Bangalore Techie: ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉద్యోగాలు సాధించడం కష్టంగా మారింది. ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు 90 శాతం తగ్గిపోయాయి. ఇక ప్రైవేటు కొలువులు ఉన్నా.. ఆర్థిక మాంద్యం కారణంగా నోటిఫికేషన్లు ఇవ్వడం లేదు. ఒకవేళ జాబ్ ఆఫర్స్ ఇచ్చినా.. వేతనాలు తక్కువగా ఇస్తున్నాయి. అభ్యర్థుల స్కిల్స్ ఎక్కువగా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాయి. దీంతో అభ్యర్థులు జాబ్ రిక్వెస్ట్ కూడా భిన్నంగా చేయాల్సిన పరిస్థితి. గతంలో బ్రిటన్(Britan)లో చదవుకున్న ఓ భారతీయ విద్యార్థిని తనకు జాబ్ ఇప్పిస్తే ప్రీగా పనిచేస్తానని ఓపెన్‌గా కోరింది. ఈమేరకు సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది. తన రెజ్యూమ్ అప్‌లోడ్ చేసింది. అయితే ఆ సందర్భం వేరు. ఆమె వీసా గడువు ముగుస్తుండడంతో అక్కడి నుంచి వెళ్లిపోవాల్సి పరిస్థితి నెలకొంది. దీంతో ఆమె ఇలా పోస్టు పెట్టారు. ఇక తాజాగా బెంగళూరుకు చెందిన ఓ టెకీ కూడా ఇలాగే ఓ పోస్టు పెట్టాడు. జాబ్ ఇప్పించండి చాలు.. ఫ్రీగా పనిచేస్తా అని సోషల్ మీడియాలో రెజ్యూమ్ పోస్టు చేశాడు. ఇప్పుడది వైరల్‌గా మారింది.
ఇంజినీరింగ్ పూర్తిచేసిన యువకుడు..
ఇంజినీరింగ్ పూర్తిచేసన ఓ యువకుడు.. ఉద్యోగం కోసం రెండేళ్లుగా ప్రయత్నిస్తున్నా.. ఎక్కడా అవకాశం దొరకలేదు. దీంతో తీవ్ర నిరాశకు లోనయ్యడు. అనుభవం లేదంటూ తిరస్కరణలు ఎదుర్కొన్నాడు. చివరకు తన గోడు వెల్లబోసుకోవడానికి సోషల్ మీడియా ప్లాట్‌ఫాంను ఎంచుకున్నాడు. సామాజిక మాధ్యమం వేదికగా తన రెజ్యూమ్ షేర్ చేసిన సదరు యువకుడు మారుమూల లొకేషన్‌లో అయినా తనకు ఉద్యోగం ఇవ్వాలని వేడుకున్నాడు. చివరకు జీతం ఇవ్వకపోయినా పనిచేస్తానని పేర్కొన్నాడు. బెంగళూరు(Bengaloor)కు చెందిన ఈ గ్రాడ్యుయేట్ ఇంజినీర్ పోస్టుకు నెటిజన్లు స్పందిస్తున్నారు.
2023లో చదువు పూర్తి..
రెడ్డిట్‌లో సదరు యువకుడు రెజ్యూమ్ పోస్టు చేశాడు. 2023లో ఇన్‌ఫర్మేషన్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ కోర్సులో బీఈ చేశానని.. ప్రస్తుతం ఉద్యోగ వేటలో ఉన్నానని తెలిపాడు. అనేక సవాళ్లు ఎదుర్కొంటున్నానని పేర్కొన్నాడు. నా రెజ్యూమ్(Resume)తగలబెట్టినా పరవాలేదు.. తనకు మాత్రం ఉద్యోగం ఇవ్వాలని వేడుకున్నాడు. సాయం చేయండి ప్లీజ్ అభ్యర్థించాడు. ఏ మారుమూల ప్రాంతంలో పోస్టింగ్ ఇచ్చినా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపాడు. తనకు జావా, పైథాన్, క్లౌడ్ కంప్యూటింగ్, మెషీన్ లెర్నింగ్, ఏపీఐ, డాకర్, కుబేర్ నెట్స్ తదితర వాటిలో ప్రావీణ్యం ఉందని వెల్లడించాడు.
స్పందిస్తున్న నెటిజన్లు..
బెంగళూరు యువకుడు పెట్టిన పోస్టుపై సోషల్ మీడియా(Social Media) వేదికగానే నెటిజన్లు స్పందిస్తున్నారు. అతడికి సలహాలు, సూచనలు చేస్తున్నారు. సీవీని మరింత మెరుగ్గా సిద్ధం చేసుకోవాలని సూచిస్తున్నారు. కొందరు మెయిల్ ద్వారా తమకు పంపాలని సూచించారు. ఆఫర్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తామని భరోసా ఇచ్చారు. కొందరు హైబ్రిడ్ లేదా వర్క్‌ఫ్రం హోమ్ చేసే ఉద్యోగం ఇప్పిస్తామని తెలిపారు. మొత్తంగా ఐటీ రంగంలో ఒడిదుడుకులకు బెంగళూరు యువకుడి పోస్టు అందం పడుతోంది.