https://oktelugu.com/

Kakinada: కుక్క కరిచి ఆరునెలలు.. ఇంట్లో చెప్పని బాలుడు.. మృతి

కాకినాడ జిల్లా గొల్లప్రోలు గ్రామంలో ఓ 17 బాలుడిని ఆరు నెలల క్రితం ఓ వీధి కుక్క కరిచింది. దీంతో ఆ బాలుడు కుక్క కరచిన విషయం ఇంట్లో చెప్పలేదు. దీంతో వ్యాధి ముదిరింది. మూడు రోజుల క్రితం అతడికి తీవ్ర జ్వరం వచ్చింది. మంచినీళ్లు కూడా తాగలేకపోయాడు. నీళ్లను చూస్తేనే భయపడ్డాడు. అతడి తల్లిదండ్రులు బాలుడిని ఆస్పత్రికి తరలించారు.

Written By:
  • Srinivas
  • , Updated On : July 24, 2023 10:09 am
    Kakinada

    Kakinada

    Follow us on

    Kakinada: ఆ బాలుడి భయమే అతడి ప్రాణాలు తీసింది. కుక్క కరిచిందనే విషయం ఇంట్లో చెబితే తిడతారనే భయంతో చెప్పకుండా దాచాడు. కానీ అదే అతడి ప్రాణాలకు శాపంగా పరిణమించింది. రేబిస్ వ్యాధి ముదిరి చివరకు ప్రాణాలే కోల్పోయాడు. అభం శుభం తెలియని బాలుడిని బలిగొన్న రేబిస్ వ్యాధితో తల్లిదండ్రులకు శోకమే మిగిలింది. చేతికందొస్తాడని అనుకున్న కొడుకు ఇలా మధ్యలోనే చనిపోవడంతో ఆ కుటుంబం శోక సముద్రంలో మునిగిపో యింది. ఆ బాలుడు చేసిన పొరపాటుతో అతడి ప్రాణాలేపోయేలా చేసింది.

    కాకినాడ జిల్లా

    కాకినాడ జిల్లా గొల్లప్రోలు గ్రామంలో ఓ 17 బాలుడిని ఆరు నెలల క్రితం ఓ వీధి కుక్క కరిచింది. దీంతో ఆ బాలుడు కుక్క కరచిన విషయం ఇంట్లో చెప్పలేదు. దీంతో వ్యాధి ముదిరింది. మూడు రోజుల క్రితం అతడికి తీవ్ర జ్వరం వచ్చింది. మంచినీళ్లు కూడా తాగలేకపోయాడు. నీళ్లను చూస్తేనే భయపడ్డాడు. అతడి తల్లిదండ్రులు బాలుడిని ఆస్పత్రికి తరలించారు.

    టీకా వేయించుకోకపోవడం..

    పరీక్షించిన వైద్యులు కుక్క కాటుకు గురైనట్లు తేల్చారు. కానీ రేబిస్ టీకా వేయించుకోకపోవడంతో బాలుడి ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. వ్యాధి ముదిరి అతడి ప్రాణాలు పోయేందుకు కారణమైంది. బాలుడి భయం ఎంత పని చేసింది. అతడు ఇంట్లో చెబితే టీకా, వ్యాక్సిన్ వేయించుకుంటే ప్రాణాలకు ప్రమాదం ఉండేది కాదు. కానీ అతడి నిర్లక్ష్యమే ప్రాణాలు పోయేందుకు కారణమైంది.

    శోకసంద్రంలో..

    బాలుడి మరణంతో తల్లిదండ్రులు దుఖంలో మునిగిపోయారు. కుక్క కరిచిన తరువాత మూడో రోజు, ఏడో రోజు, 28వ రోజు టీకా వేయించుకుంటే రేబిస్ వ్యాధి వచ్చేది కాదు. కానీ అతడు అలా చేయకపోవడంతో వ్యాధి ముదిరి అతడి ప్రాణాలు తీసింది. రేబిస్ వ్యాధితో చనిపోవడం బాధాకరం. అతడి నిర్లక్ష్యానికి ప్రాణమే పోయింది. తల్లిదండ్రులు రోదించిన తీరు అందరిని కలచివేసింది.