Earning Student: జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని ఎవరికైనా ఉంటుంది. అందుకు చదువే మార్గమని ఇప్పుడున్న పరిస్థితుల్లో అర్థమవుతుంది. ఒకప్పుడు చదువు లేకపోయినా ప్రతిభతో వ్యాపారంలో రాణించగలిగారు. కానీ ఉద్యోగం చేయాలనుకునేవారికి చదువు తప్పనిసరి. అయితే చాలా మంది ఉన్నత చదువులకు వెళ్లడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. ముఖ్యంగా కొన్ని కుటుంబాల్లో ఆర్థిక పరిస్థితి బాగా లేనందున చాలా మంది విద్యార్థులు చదువును మధ్యలోనే మానేస్తారు. అయితే ఓ వైపు చదువుకుంటూ మరోవైపు ఆదాయాన్ని సంపాదించవచ్చు. ఇలా చేయడానికి అనేక మార్గాలున్నాయి. కానీ విద్యార్థులకు అన్నీ షూట్ కావు. కానీ ఈ 3 ఉద్యోగాలు చేసుకుంటూ ఎటువంటి ఇబ్బంది లేకుండా చదువుకొనవచ్చు. అవేంటో చూద్దాం.
ఇన్సూరెన్స్:
కొన్ని సంస్థలు 10వ తరగతి పాస్ అయిన వారికి ఉద్యోగాలను ప్రకటిస్తాయి. ముఖ్యంగా విద్యార్థుల కోసం ఇవి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తాయి. అలాంటివే ఇన్సూరెన్స్ కంపెనీలు. లైఫ్ ఇన్సూరెన్స్, మోటార్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ ఇలా ఏ పాలసీలు అయినా కంపెనీ జారీ చేసిన వాటిని ఇతరులకు మధ్యవర్తిగా అమ్ముకోవచ్చు. ఇలా చేయడం వల్ల మంచి కమిషన్ ఉంటుంది. ఎలాంటి పెట్టుబడి లేకుండా ఈ ఉద్యోగాన్ని చేయొచర్చు. ఓ వైపు చదువుకుంటూనే మరోవైపు ఈ ఆదాయాన్ని పొందవచ్చు. అయితే ఈ ఉద్యోగం చేయాలంటే మాత్రం Posp (Point Of Sales Person) అనే పరీక్ష పాసవ్వాలి. ఆ తరువాతే పాలసీలు విక్రయించడానికి అర్హులవుతారు.
అంబాసిడర్ ప్రోగ్రామ్:
నో బ్రోకర్ అనే కంపెనీకి బయట అవసరమయ్యే కొన్ని పనుల గురించి సమాచారం ఇవ్వండి. ఉదాహరణకు ఒక గల్లీలో ToLet బోర్డు ఉంది. ఆ సమాచారాన్ని మీరు Nobroker.com అనే వెబ్ సైట్ కు సమాచారం ఇవ్వండి. ఇందులో ఒక్కో లీడ్ కు రూ.500 నుంచి ఆదాయం పొందవచ్చు. అంతేకాకుండా ప్యాకర్స్ అండ్ మూవర్స్ గురించి వీరికి చెప్పండి. ఇలా చేయడం ద్వారా 5 శాతం కమీషన్ ఇస్తారు. ఇలా చేసి కూడా డబ్బు సంపాదించవచ్చు.
ట్యూషన్స్:
చదువుకునే విద్యార్థుల్లో నాలెడ్జ్ ఎలాగూ ఉంటుంది. ఇన్నాళ్లు వారు నేర్చుకున్నది వారి తరువాత విద్యార్థులకు చెప్పొచ్చు. మీరు మంచి ట్యూటర్ అయితే ఎక్కువ మంది విద్యార్థులు రావొచ్చు. ఇలాఒక్కో విద్యార్థి నుంచి రూ.500 నుంచి రూ.1000 తీసుకున్నా నెలకు రూ.60,000 వరకు సంపాదించొచ్చు.
ఇక లేటేందుకు చదువుకుంటూనే ఉద్యోగం చేయాలనుకునేవారికి ఎటువంటి పెట్టుబడి లేకుండా ఇలా ఆదాయాన్ని పొందవచ్చు.