Trivikram- Mahesh Babu: సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీ ప్రాజెక్ట్స్ గా చలామణి అవుతున్న కాంబినేషన్స్ లో ఒకటి మహేష్ – త్రివిక్రమ్ మూవీ..వీళ్లిద్దరి కాంబినేషన్స్ లో గతం లో వచ్చిన ‘అతడు’ చిత్రం యావరేజి గా ఆడగా, ఖలేజా చిత్రం పెద్ద డిజాస్టర్ అయ్యింది..అయినా కూడా ఈ రెండు సినిమాలు టీవీ టెలికాస్ట్ లో పెద్ద హిట్స్ గా నిలిచాయి.

మహేష్ బాబు కి కామెడీ టైమింగ్ ఒక రేంజ్ లో అలవాటు పడింది ఖలేజా సినిమా తర్వాతే..అందుకే ఈ కాంబినేషన్ పై ప్రేక్షకుల్లో మరియు అభిమానుల్లో అంతటి క్రేజ్..అంతే కాకుండా త్రివిక్రమ్ ప్రస్తుతం అలా వైకుంఠపురం లో వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ తో మంచి ఫామ్ లో ఉన్నాడు..లేటెస్ట్ గా పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన భీమ్లా నాయక్ సినిమాకి స్క్రీన్ ప్లే మరియు మాటలు అందించి మరో భారీ బ్లాక్ బస్టర్ ని తన ఖాతాలో వేసుకున్నాడు.
పైగా మహేష్ బాబు కూడా భరత్ అనే నేను సినిమా నుండి మొన్న వచ్చిన సర్కారు వారి పాట సినిమా వరకు వరుస సూపర్ హిట్స్ తో ఫుల్ జోష్ మీద ఉన్నాడు..అందుకే ఈ కాంబినేషన్ పై అంతటి అంచనాలు ఉన్నాయి..మొన్నీమధ్యనే రెగ్యులర్ షూటింగ్ ని ప్రారంభించుకున్న ఈ కాంబినేషన్ కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది..స్క్రిప్ట్ లో భారీ మార్పులు చేసి యాక్షన్ మూవీ ని కాస్త ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా మలిచారు..షూటింగ్ ఎప్పుడు ప్రారంభం అవ్వుద్దా అని అభిమానుల్లో చాలా కన్ఫ్యూజన్ ఉండేది..ఇప్పుడు ఈ మూవీ షూటింగ్ పై క్లారిటీ వచ్చింది.

సంక్రాంతి తర్వాత నుండి మార్చి చివరి వారం వరుకు ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ బ్రేక్ లేకుండా సాగబోతుందట..సుమారుగా 80 రోజుల కాల్ షీట్స్ ని ఈ సినిమా కోసం మహేష్ బాబు నాన్ స్టాప్ గా కేటాయించాడట..ఈ 80 రోజుల లాంగ్ షెడ్యూల్ తో 60 శాతం షూటింగ్ పూర్తి అవుతుంది..ఈ చిత్రం లో హీరోయిన్స్ గా పూజ హెగ్డే మరియు శ్రీ లీల ఖరారు అయ్యారు..థమన్ సంగీతం అందిస్తున్నాడు..ఈ సినిమా పూర్తి అయిన వెంటనే మహేష్ బాబు రాజమౌళి సినిమాకి షిఫ్ట్ అవుతాడు.