రూ.2.5కోట్లు పలికిన మహాత్మ గాంధీ కళ్లజోడు..!

మనలో చాలామంది పురాతన కాలం నాటి వస్తువులను, ప్రముఖులు వాడిన వస్తువులను ఇష్టపడుతూ ఉంటారు. ఆ వస్తువులు సొంతం చేసుకోవడానికి అవకాశం వస్తే ఎంత ఖర్చు చేయడానికైనా వెనుకాడరు. వేలంలో పోటీ పడి కోట్ల రూపాయలు ఖర్చు చేసి మరీ వస్తువులను సొంతం చేసుకుంటూ ఉంటారు. తాజాగా ఇంగ్లండ్ లోని ఈస్ట్ బ్రిస్టోల్ ఆక్షన్స్ అనే సంస్థ మన దేశ జాతిపిత మహాత్మ గాంధీ కళ్లజోడును వేలం వేసింది. వేలంలో గాంధీ కళ్లద్దాలు భారీ ధర పలకడం […]

Written By: Navya, Updated On : August 23, 2020 11:39 am
Follow us on

మనలో చాలామంది పురాతన కాలం నాటి వస్తువులను, ప్రముఖులు వాడిన వస్తువులను ఇష్టపడుతూ ఉంటారు. ఆ వస్తువులు సొంతం చేసుకోవడానికి అవకాశం వస్తే ఎంత ఖర్చు చేయడానికైనా వెనుకాడరు. వేలంలో పోటీ పడి కోట్ల రూపాయలు ఖర్చు చేసి మరీ వస్తువులను సొంతం చేసుకుంటూ ఉంటారు. తాజాగా ఇంగ్లండ్ లోని ఈస్ట్ బ్రిస్టోల్ ఆక్షన్స్ అనే సంస్థ మన దేశ జాతిపిత మహాత్మ గాంధీ కళ్లజోడును వేలం వేసింది.

వేలంలో గాంధీ కళ్లద్దాలు భారీ ధర పలకడం గమనార్హం. గాంధీజీ దక్షిణాఫ్రికాలో ఉన్న సమయంలో ధరించిన కళ్లద్దాలను బ్రిస్టల్ లో వేలానికి పెట్టారు. ఈ కళ్లద్దాలు ఏకంగా 2,60,000 యూరోలకు అమ్ముడయ్యాయి. భారత కరెన్సీ ప్రకారం గాంధీజీ కళ్లజోడు విలువ ఏకంగా రెండున్నర కోట్లు పలకడం గమనార్హం. అమెరికాకు చెందిన పేరు తెలియని వ్యక్తి ఈ కళ్లద్దాలను దక్కించుకున్నట్టు తెలుస్తోంది.

ఆక్షనర్ ఆండీ స్టోవ్ మాట్లాడుతూ కళ్లద్దాలను కేవలం 15,000 యూరోల ధరకే రిజర్వ్ చేశామని చెప్పారు. మన దేశంతో పాటు ఇతర దేశాలకు చెందిన చాలామంది గాంధీజీ కళ్లజోడును కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపారని చెప్పారు. దీంతో కళ్లజోడు ధర ఊహించని విధంగా భారీగా పెరిగింది. గాంధీజీ దక్షిణాఫ్రికాలో ఉన్న సమయంలో బ్రిటిష్ పెట్రోలియంలో పని చేసే ఒక వ్యక్తికి ఈ కళ్లజోడును ఇచ్చాడని సమాచారం. ఇంగ్లండ్ కు చెందిన వ్యక్తి వంశపారంపర్యంగా వచ్చిన ఈ కళ్లజోడును బ్రిస్టోల్ ఆక్షన్ కు పంపి భారీ మొత్తం దక్కించుకున్నాడు. స్టోవ్ కళ్లజోడు విక్రయం ద్వారా తన జీవితాన్ని మార్చేంత డబ్బును సొంతం చేసుకున్నానని మీడియాకు తెలిపాడు.