https://oktelugu.com/

Diamond Ganesh Idol : ఒకటి కాదు రెండు కాదు.. రూ.600 కోట్ల గణపతి.. చూస్తేనే షేక్ అవుతారు.. వైరల్ ఫొటో

ఈ ఖరీదైన వజ్రపు గణేశుడికి మరో ప్రత్యేకత కూడా ఉంది. అందులో కనిపించే గణేశుని ట్రంక్‌ కుడివైపున తిరిగి ఉంటుంది. ఇలాంటిది చాలా వినాయక విగ్రహాల్లో కనిపించడం లేదు

Written By:
  • NARESH
  • , Updated On : September 23, 2023 / 04:29 PM IST
    Follow us on

    Diamond Ganesh Idol : గణపతి అనగానే పేదల దేవుడు అంటారు. చిన్నపాటి గరికపోస సమర్పించి కోరిక కోరగానే కరిగోయే స్వామి లంబోధరుడు. అలాంటి స్వామి ఇక్కడ బాగా కాస్ట్‌లీ.. ఆ ధనపతి ఎందుకు అంత ఖరీదు.. ఎక్కడ ఉన్నాడో తెలుసుకుందాం..

    గుజరాత్‌లో వజ్రంతో..
    వినాయక నవరాత్రి ఉత్సవాల సంరద్భంగా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వజ్ర వినాయకుడిని ఏర్పాటు చేశాడు గుజరాత్‌లో ఓ భక్తుడు. సూరత్‌కు చెందిన వజ్రాల వ్యాపారి.. వినాయక చవితి సందర్భంగా ఆయన తన నివాసంలో అత్యంత ఖరీదైన, అరుదైన గణేశ విగ్రహాన్ని ప్రతిష్టించాడు. కనుభాయ్‌ రామ్‌జీభాయ్‌ అసోదరియా అనే వ్యక్తి 600 కోట్ల రూపాయల విలువైన వజ్ర గణపతిని ప్రతిష్టించారు.

    వజ్రాల్లో సహజ గణపతి..
    వజ్రాల వ్యాపారి అయిన అతడు వ్యాపారం నిమిత్తం 15 ఏళ్ల క్రితం బెల్జియం వెళ్లాడు. అక్కడి నుండి ముడి వజ్రాలను భారత్‌కు తీసుకువచ్చారు. అందులోని ఒక వజ్రం గణపతి ఆకారంలో ఉన్నట్టుగా తన తండ్రికి కల వచ్చిందట. వెంటనే వెళ్లి పరిశీలించగా, అందులో ఒక వజ్రం ప్రకృతిసిద్ధంగా ఏర్పడిన వినాయకుడి ఆకారంలో కనిపించింది. దాంతో ఇక అప్పటి నుంచి వాళ్లు ఈ వజ్ర గణపతికి పూజలు చేస్తున్నారు.

    దీని విలువ..
    ఈ గణపతి విగ్రహం 182.3 క్యారెట్‌ డైమండ్‌. 36.5 గ్రాముల బరువు ఉంటుంది. దీని మార్కెట్‌ ధర రూ.600 కోట్లుగా చెబుతున్నారు. సూరత్‌లోని అత్యంత ఖరీదైన గణేశ విగ్రహం ఇదే. ఇది లండన్‌లోని వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ ద్వారా కూడా ధ్రువీకరించారు.

    వజ్రాల గనిలో..
    రూ.600 కోట్ల వజ్ర గణపతిని ప్రతిష్టించిన వ్యాపారవేత్త కునాభాయ్‌ మాట్లాడుతూ.. తమకు కరమ్‌ ఎక్స్‌పోర్ట్‌ డైమండ్‌ అనే కంపెనీ ఉందన్నారు. ఇంట్లో ప్రతిష్టించిన ఈ వినాయకుడు వజ్రాల గనిలో కనిపించాడని చెప్పాడు. ఇది సహజంగా ఏర్పడింది. ఇది వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ ద్వారా నిరూపించబడింది. ప్రత్యేకమైన గణేశుని కారణంగా దీనిని ప్రపంచంలోని ఏకైక వజ్రం అని పిలుస్తారు. కరాన్ని డైమండ్‌ గణేశుడు అని కూడా అంటారు. కోహినూర్‌ వజ్రం కంటే ఇది పెద్దదని వ్యాపారవేత్త అనుభాయ్‌ రామ్‌జీభాయ్‌ తెలిపారు.

    వజ్రపు గణేశునికి మరో ప్రత్యేకత..
    ఈ ఖరీదైన వజ్రపు గణేశుడికి మరో ప్రత్యేకత కూడా ఉంది. అందులో కనిపించే గణేశుని ట్రంక్‌ కుడివైపున తిరిగి ఉంటుంది. ఇలాంటిది చాలా వినాయక విగ్రహాల్లో కనిపించడం లేదు. గణేశుడి విగ్రహాలలో ఎక్కువగా ట్రంక్‌ ఎడమ వైపు మాత్రమే కనిపిస్తుంది. ప్రతి ఏటా ఈ వినాయకుడికి పూజలు చేసి, నిమజ్జం కార్యక్రమంలో భాగంగా నది జలాలను విగ్రహం మీద చల్లుతారు.