https://oktelugu.com/

Kerala Man Mammika: నిన్న‌టి దాకా చెత్త ఏరుకునే వ్య‌క్తి.. నేడు పెద్ద మోడ‌ల్‌.. ల‌క్ అంటే ఇదే..!

Kerala Man Mammika: కొంద‌రి జీవితాలు అంతే.. ఏండ్లుగా అష్ట‌క‌ష్టాలు ప‌డ్డా కానీ.. వృద్ధాప్య స‌మ‌యంలో స్టార్ స్టేట‌స్ వ‌చ్చి ప‌డుతోంది వారి ఖాతాల్లోకి. అస‌లు వీరేంటి ఇలా అయిపోయారేంటి అని గుర్తు ప‌ట్ట‌లేనంత‌గా వారి ఫేమ్ మారిపోతోంది. సోష‌ల్ మీడియా పుణ్య‌మా అని వారు రాత్రికి రాత్రే పెద్ద సెలబ్రిటీలు అయిపోతున్నారు. రేణు మొండ‌ల్ ద‌గ్గ‌రి నుంచి క‌చ్చా బాదం సింగ‌ర్ దాకా ఇలా చాలామంది అష్ట‌క‌ష్టాల నుంచి సెల‌బ్రిటీ హోదా దాకా ఎదిగిన వారు […]

Written By:
  • Mallesh
  • , Updated On : February 17, 2022 / 10:33 AM IST

    Kerala Man Mammika

    Follow us on

    Kerala Man Mammika: కొంద‌రి జీవితాలు అంతే.. ఏండ్లుగా అష్ట‌క‌ష్టాలు ప‌డ్డా కానీ.. వృద్ధాప్య స‌మ‌యంలో స్టార్ స్టేట‌స్ వ‌చ్చి ప‌డుతోంది వారి ఖాతాల్లోకి. అస‌లు వీరేంటి ఇలా అయిపోయారేంటి అని గుర్తు ప‌ట్ట‌లేనంత‌గా వారి ఫేమ్ మారిపోతోంది. సోష‌ల్ మీడియా పుణ్య‌మా అని వారు రాత్రికి రాత్రే పెద్ద సెలబ్రిటీలు అయిపోతున్నారు. రేణు మొండ‌ల్ ద‌గ్గ‌రి నుంచి క‌చ్చా బాదం సింగ‌ర్ దాకా ఇలా చాలామంది అష్ట‌క‌ష్టాల నుంచి సెల‌బ్రిటీ హోదా దాకా ఎదిగిన వారు ఉన్నారు.

    Kerala Man Mammika

    కాగా ఇప్పుడు కూడా ఓ వ్య‌క్తి ఇలాగే రాత్రికి రాత్రే పెద్ద మోడ‌ల్ అయిపోయాడు. త‌న జీవిత‌మంతా చెత్త ఏరుకుంటూ బ‌తికిన అత‌ను.. బ‌ట్ట‌ల‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్ అయిపోయాడు. అదెలా అని ఆశ్చ‌ర్య‌పోకండి. అది వారి అదృష్టం అనుకోవాలి అంతే. అత‌ను రోడ్డు మీద కూర‌గాయ‌ల సంచితో న‌డుచుకుంటూ వెళ్తుండ‌తగా.. ఓ ఫొటోగ్రాఫ‌ర్ కంట్లో ప‌డ్డాడు. మ‌రి ఆ చెత్త ఏరుకునే వృద్ధుడి క‌టౌట్ లో అత‌నికి ఏం న‌చ్చిందో ఎవ‌రికీ తెలియ‌దు.

    కానీ అత‌న్ని పెద్ద మోడ‌ల్‌ను చేసేశాడు. ఆ చెత్త ఏరుకునే వ్య‌క్తి మమ్మిక్కా. అను కేరళ రాష్ట్రంల‌ని కోజికోడ్ లో నివ‌సిస్తున్నాడు. అర‌వై ఏండ్లు పైబ‌డిన ఈ వృద్ధుడు మాసిపోయిన తెల్ల‌ని గడ్డంతో లుంగీ క‌ట్టుకుని చేతిలో కూర‌గాయ‌ల సంచితో వెళ్తుండ‌గా.. ఫోటోగ్రాఫర్ షరీక్ వాయల్ కంట్లో ప‌డ్డాడు. ష‌రీక్ ఓ బ‌ట్ట‌ల కంపెనీకి యాడ్ చేయ‌డం కోసం మోడల్ ను వెతుకుతున్నాడు. ఈ క్ర‌మంలోనే అత‌నికి మ‌మ్మిక్కా క‌న‌ప‌డ్డాడు.

    Also Read: కిసాన్ డ్రోన్లతో వ్యవసాయరంగంలో విప్లవాత్మక మార్పు

    అత‌న్ని యాడ్ చేయాల‌ని ఒప్పించి అత‌ని గెట‌ప్ మొత్తం మార్చేశాడు. సెలూన్‌కు తీసుకెల్లి స్టైల్ గా హెయిర్ క‌టింగ్ తో పాటు గ‌డ్డం కూడా మార్పించేశాడు. ఇంకేముంది అత‌నికి బ్రౌన్ క‌ల‌ర్ సూట్ వేసి చాలా స్టైలిష్ మోడ‌ల్‌గా తీర్చి దిద్దాడు. చేతిలో ఐపాడ్ ప‌ట్టుకుని ఫోజిస్తున్న ఫొటోలు నెట్టింట్లో తెగ వైర‌ల్ అవుతున్నాయి. అవి చూసిన వారంతా అత‌ని బ్యాక్ గ్రౌండ్ తెలుసుకుని షాక్ అయిపోతున్నారు. ఇంత మార్పా అంటూ నోరెళ్ల‌బెడుతున్నారు. మ‌రిన్ని కంపెనీలు అత‌నిలో యాడ్స్ చేయించేందుకు పోటీ ప‌డుతున్నాయంట‌. ఎంతైనా ఈ క్రెడిట్ మొత్తం ఫొటో గ్రాఫ‌ర్ ష‌రీక్ కే ద‌క్కుతుంది క‌దా.

    Also Read: అమెరికా వెళ్లినా మన బుద్దులు మారవా?

    Tags