https://oktelugu.com/

Deepthi Sunaina-Shanmukh: షణ్ముఖ్-దీప్తి ప్రేమ విఫలం అవ్వడానికి కారణం తెలిసింది.. ఇందులో తప్పు ఎవరిది?

Deepthi Sunaina-Shanmukh: ‘ఏమయ్యా బిగ్ బాసూ.. ఒక పచ్చటి ప్రేమలో నిప్పులు పోశావా? ఏమన్నా న్యాయముందా? చిలకా గోరింకలు లాగా ఉన్న దీప్తి సునయన-షణ్ముఖ్ జోడీ విడిపోవడానికి బిగ్ బాస్ యే కారణమా? బిగ్ బాస్ లోకి షణ్ముక్ వచ్చాక కథ మారిపోయిందా? దీప్తి ప్రేమకు ఫుల్ స్టాప్ పెట్టడానికి అసలు కారణం ఏంటి? బిగ్ బాస్ హౌస్ లో షణ్ముఖ్ మరో కంటెస్టెంట్ సిరి పట్ల వ్యవహరిస్తున్న తీరే కారణమా? ఇవన్నీ సమాధానం దొరకని ప్రశ్నలు.. […]

Written By:
  • NARESH
  • , Updated On : February 17, 2022 / 10:36 AM IST
    Follow us on

    Deepthi Sunaina-Shanmukh: ‘ఏమయ్యా బిగ్ బాసూ.. ఒక పచ్చటి ప్రేమలో నిప్పులు పోశావా? ఏమన్నా న్యాయముందా? చిలకా గోరింకలు లాగా ఉన్న దీప్తి సునయన-షణ్ముఖ్ జోడీ విడిపోవడానికి బిగ్ బాస్ యే కారణమా? బిగ్ బాస్ లోకి షణ్ముక్ వచ్చాక కథ మారిపోయిందా? దీప్తి ప్రేమకు ఫుల్ స్టాప్ పెట్టడానికి అసలు కారణం ఏంటి? బిగ్ బాస్ హౌస్ లో షణ్ముఖ్ మరో కంటెస్టెంట్ సిరి పట్ల వ్యవహరిస్తున్న తీరే కారణమా? ఇవన్నీ సమాధానం దొరకని ప్రశ్నలు.. అయితే తాజాగా బాధితుడైన భగ్న ప్రేమికుడు షణ్ముక్ బయటపెట్టాడు. తన ప్రేమ విఫలం కావడానికి అసలు కారకులు ఎవరో చెప్పాడు. అదిప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

    Deepthi Sunaina Shanmukh Breakup

    బిగ్ బాస్ లాంటి ప్రఖ్యాత ఫ్లాట్ ఫామ్ మీదకు వచ్చి మరీ తమ ప్రేమను చాటారు దీప్తి, షణ్ముక్ లు. ఇద్దరి ప్రేమకథ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. వారిద్దరూ తెరపై చూడముచ్చటైన క్యూట్ జోడీగా కనిపించారు. కానీ ఎవరికి కన్నుకుట్టిందో కానీ.. బిగ్ బాస్ నుంచి షణ్ముక్ బయటకు వచ్చాక వీరి ప్రేమకథకు ఎండ్ కార్డ్ పడింది. షణ్ముఖ్ తో ప్రేమకు దీప్తి కటీఫ్ చెప్పింది. ఐదేళ్ల ప్రేమకథ బిగ్ బాస్ నుంచి బయటకు రాగానే చెదిరిపోవడం అందరినీ తీవ్ర మనస్తాపానికి గురిచేసింది. కెరీర్ లో సెటిల్ అయ్యాక ఈ జంట పెళ్లి చేసుకుంటుందని అంతా భావించారు. కానీ ఊహించని విధంగా బ్రేకప్ అయ్యింది.

    Also Read:  షాకింగ్: చిరంజీవి, రాంచరణ్ పొలిటికల్ ఎంట్రీ..!! వేర్వేరు పార్టీల లీడర్లుగా..

    -బిగ్ బాస్ లో సిరితో షణ్ముఖ్ ది స్నేహమా? ఓవర్ యాక్షనా?
    హిందీ సహా అంతర్జాతీయ స్థాయిల్లో బిగ్ బాస్ లో స్నేహాలు, ప్రేమలు.. అంతకుమించిన పనులు చాలా కామన్. జనాలు అంతగా పట్టించుకోరు. కానీ తెలుగు జనాలకు ఇవి నచ్చవు. ఇంకా సంప్రదాయ పోకడలు ఇక్కడ బతికే ఉన్నాయి. అవే టైటిల్ గెలవాల్సిన షణ్ముక్ ను సెకండ్ ప్లేసులోకి నెట్టేశాయి. నిజానికి సిరితో షణ్ముఖ్ చేసిన ఓవరాక్షన్ కనుక లేకపోయింటే ఖచ్చితంగా బిగ్ బాస్ విజేతగా అతడే నిలిచేవాడు. కానీ సిరితో అలా రాసుకుపూసుకు తిరగడం.. స్నేహం అంటూ హగ్గులు, మద్దులు పెట్టుకోవడం జనాలకు నచ్చలేదు. అదే అతడికి టైటిల్ దూరం చేసిందని.. దీప్తి కూడా విడిపోవడానికి ప్రధాన కారణమన్న గుసగుసలు వినిపించాయి. కానీ దీప్తి తల్లి, కుటుంబం నుంచి ఒత్తిడి వల్లే తనతో విడిపోయిందని షణ్ముక్ ఆరోపించాడు. సిరితో నా రిలేషన్ షిప్ ను వాళ్లు తప్పుగా అర్థం చేసుకొని దీప్తిపై ఒత్తిడి తెచ్చి తనతో విడిపోయాలే చేశారని హాట్ కామెంట్స్ చేశాడు.

    Bigg Boss Shanmukh and Deepthi

    -దీప్తి,, సిరి ఫ్రెండ్స్ అయితే.. దీప్తి షో లోకి వచ్చి కూడా సిరి కి హాయ్ ఎందుకు చెప్పలేదు ?
    ఈ ఇంటర్వ్యూలో షణ్ముఖ్ ఒక కీలక వ్యాఖ్య చేశారు. దీప్తి, సిరి మంచి ఫ్రెండ్స్ అని అన్నాడు. అంత మంచి ఫ్రెండ్స్ అయితే ఇలా విడిపోవడం ఏమిటన్నది ప్రశ్న. సిరి గురించి దీప్తికి మొత్తం తెలుసు. అలాగే షణ్ముక్ గురించి కూడా.. మరి ఇంత తెలిసిన వీరిద్దరూ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాక కనీసం హాయ్ చెప్పుకోలేదు. మొదట్లో మాట్లాడుకోలేదు. గేమ్ ప్లానా? లేక గెలవడానికి ఇలా నాటకమాడి ప్రేక్షకులను ఫూల్స్ చేయాలనుకున్నారా? అన్నది ప్రశ్న. వారిద్దరి ఫ్రెండ్ షిప్ ను బిగ్ బాస్ లో చూసి దీప్తి హర్ట్ అవ్వకపోవచ్చు. వాళ్ల అమ్మ, కుటుంబమే ఇది చూసి తట్టుకోలేక దీప్తిపై ఒత్తిడి తెచ్చి ఈ ప్రేమకు బ్రేకప్ చెప్పించేలా చేశారు కావచ్చు. ఇదే మాటను షణ్ముఖ్ కూడా చెప్పాడు.దీంతో ఈ ప్రేమకథ ఎండ్ వెనుక దీప్తి తల్లిదండ్రులే ఉన్నారని తెలుస్తోంది.

    -సిరి వాళ్ళ అమ్మ షణ్ముఖ్ ముఖం మీదే అలా చెప్పడం తప్పు అవుతుందా ?
    ఎవరి కూతురు అయినా ప్రపంచవ్యాప్తంగా చూసే ఫ్లాట్ ఫామ్ లో అలా ప్రవర్తిస్తే ఏ తల్లికి అయినా కోపం వస్తుంది. అందుకే బిగ్ బాస్ లో సిరి-షణ్ముక్ ఓవరాక్షన్ చూసి సిరి తల్లికి అందుకే కడుపు మండింది. తల్లిగా ఆమె అలా అనడం రియాక్ట్ కావడం సహజమే.. అందుకే అందరి ముందే సిరి వాళ్ల అమ్మ షణ్ముఖ్ ముఖం మీదే ఇలా హగ్గులు, ముద్దులు తగ్గించుకోండి.. బాలేదు మీ ప్రవర్తన అని చెప్పడం తప్పు కానేకాదు. తెలుగు జనాలు సిరిని తప్పుగా అర్థం చేసుకునే ప్రమాదం ఉందన్నది ఆ తల్లి ఆవేదన..

    Shanmukh Deepthi Sunaina

    -సిరితో ఓవరాక్షన్ వల్లే షణ్ముక్ కు ఈ కష్టాలు..
    నిజానికి..హిందీ, ఇంగ్లీష్ ఇతర భాషల్లో నెగెటివిటీ ఎంతున్నా.. ప్రేమికులు, జంటలు ఇలా విశృంఖలంగా తిరిగినా అక్కడి ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు.. తప్పులు లెంకరు.. కానీ ఇది తెలుగు షో. తెలుగు జనాలకు ఓవరాక్షన్ నచ్చదు. ఇదే బిగ్ బాస్ లో కాజల్ కూడా సన్నీ, మానస్ లతో అంతే క్లోజ్ గా ఉంది. కానీ ఎక్కడా హద్దులు దాటలేదు. వారి స్నేహాన్ని జనాలు హర్షించారు. కానీ సిరి-షణ్ముక్ లది అంతకుమించి విశృంఖలంగా ఉండడంతో వ్యతిరేకించారు. విన్నర్ కావాల్సిన షణ్ముఖ్ రన్నర్ కావడానికి సిరినే కారణమన్న అపవాదు ఉంది. అదే అతడి ప్రేమను దూరం చేసిందని సోషల్ మీడియాలో నెటిజన్లు కోడై కూస్తున్నారు.

    Also Read: రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నేతలను చుట్టుముట్టిన పోలీసులు.. పరిస్థితి ఉద్రిక్తం

    Tags