
Balagam Box Office Collection: ఈమధ్య బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద సినిమాలకంటే కూడా చిన్న సినిమాలకే ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.స్టార్ డైరెక్టర్స్ అందరూ కమర్షియల్ సినిమా అంటూ డబ్బుల వెంటపడుతుంటే, కొంతమంది కొత్త డైరెక్టర్స్ మన సంస్కృతిని, సంప్రదాయాలను వెలికితీస్తూ వెండితెర మీద అద్భుతంగా ఆవిష్కరించే ప్రయత్నం చేసి సక్సెస్ అవుతున్నారు.అలాంటి డైరెక్టర్స్ జాబితాలోకి ప్రముఖ జబర్దస్త్ కమెడియన్ ‘వేణు టిల్లు’ కూడా చేరిపోయాడు.
కామెడీ స్కిట్స్ ని రాసుకుంటూ ఇంత దూరం వచ్చిన వేణు లో ఇంత గొప్ప కథని చెప్పే దర్శకుడు ఉన్నాడా అని అందరూ ఆశ్చర్యపొయ్యేలా చేసింది రీసెంట్ గా విడుదలైన ‘బలగం’ చిత్రం.ఇలాంటి సినిమాలు కమర్షియల్ గా వర్కౌట్ అవ్వవు అని ట్రేడ్ విశ్లేషకులు అంటూ ఉంటారు.కానీ రోజులు మారాయి, ఇప్పుడు జనాలు కమర్షియల్ విలువలకంటే కూడా సినిమా కంటెంట్ నాణ్యత వైపే ఎక్కువ మొగ్గు చూపిస్తున్నారు, ‘బలగం’ సినిమా విషయం లో మరోసారి అదే ప్రూవ్ చేసి చూపించారు ఆడియన్స్.
మొదటి రోజు వచ్చిన ఓపెనింగ్ అంతంత మాత్రమే, కానీ రెండవ రోజు మొదటి రోజు కంటే ఎక్కువ వసూళ్లు రాబట్టడం, మూడవ రోజు రెండవ రోజు కంటే ఎక్కువ వసూళ్లను రాబట్టడం ట్రేడ్ లో హాట్ టాపిక్ గా మారిపోయింది.ఈ కలెక్షన్స్ మొత్తం మెజారిటీ తెలంగాణ ప్రాంతం నుండే రావడం మరో విశేషం.అంతే కాదు, వర్కింగ్ డేస్ లో కూడా ఈ సినిమా అద్భుతమైన వసూళ్లను రాబట్టింది.ఇక హోలీ పండుగ రోజు అయితే ఈ సినిమాకి కోటి కోటి 80 లక్షల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసింది.

ఆరవ రోజు కూడా ఈ చిత్రానికి కోటి 20 లక్షల రూపాయిల గ్రాస్ వచ్చిందని ట్రేడ్ పండితులు చెప్తున్నారు.అలా ఆరు రోజులకు గాను 6 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్, మూడు కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను సాధించింది.అలా కోటి రూపాయిల లోపే ప్రీ రిలీజ్ బిజినెస్ ని జరుపుకున్న ఈ సినిమాకి మూడింతలు లాభాలు వచ్చాయి.ఈ వీకెండ్ తో ఆరింతలు లాభాలకు రీచ్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదని ట్రేడ్ పండితులు చెప్తున్నారు.