7 Days Stranded At Sea
7 Days Stranded At Sea: డైనమిక్ యూట్యూబర్ మిస్టర్ బీస్ట్ మరో రికార్డు సృష్టించాడు. ఇప్పటికే ఎన్నో వీడియోలతో అలరించిన ఆయన తాజాగా ‘7 డేస్ స్ట్రాండెట్ ఎట్ సీ’ పేరుతో కొత్త వీడియో చేసి యూట్యూబ్ లో అప్లోడ్ చేశాడు. ఈ వీడియో 24 గంటల్లోనే అత్యధిక వ్యూస్ సాధించింది. అంతేకాకుండా నాన్ మ్యూజిక్ గా ఉన్న ఈ వీడియో ఇప్పడు యూత్ ను బాగా ఆకట్టుకుంటోంది. చిన్న వయసులోనే సంచలనాల వీడియోలు చేస్తూ వరల్డ్ ట్రెండీగా మారిన బీస్ట్ చేసిన తాజా వీడియోపై ఆయనకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఇంతకీ ఈ వీడియో ఎన్ని వ్యూస్ వచ్చాయంటే..?
యూట్యూబ్ ను షేక్ చేసే వాళ్లలో జిమ్మి డోనాల్డ్ సన్ అకా మిస్టర్ బీస్ట్ ఒకరు. తాను పెట్టిన ‘మిస్టర్ బీస్ట్’ ఛానెల్ లో సంచలన వీడియోలు పోస్టు చేశాడు. ప్రతీ వీడియో మిలియన్ల వ్యూస్ ఉన్నాయి. 13 ఏళ్ల వయసులోనే తన వీడియోలతో ఆకట్టుకుంటున్న జిమ్మికి 140 మిలియన్లకు పైగా సబ్ స్క్రైబర్లు ఉన్నారు. ఆసక్తికరమైన కంటెంట్స్ ను సృష్టించి వీడియో తీసి పోస్టు చేసి ఆకట్టుకుంటున్నాడు. 2021లో యూట్యూబ్ నుంచి ఈయన ఏకంగా 54 మిలియన్ డాలర్లు తీసుకున్నాడు. అంటే భారతీయ కరెన్సీ ప్రకారం రూ.400 కోట్ల పైమాటే.
తాజాగా ఈయన యంగ్ డైనమిక్ ‘7 డేస్ స్ట్రాండెట్ ఎట్ సీ’ అనే వీడియో తీసి పోస్టు చేశాడు. ఇది అప్లోడ్ చేసిన 24 గంటల్లోనే 46 మిలియన్ల వ్యూస్ సాధించగలిగింది. ఏమాత్రం మ్యూజిక్ లేని ఈ వీడియలో జిమ్మి డొనాల్డ్ సన్ తో పాటు నలుగురు కుర్రాళ్లు సముద్రం మధ్యలో నివసిస్తారు. సముద్రంలో జరిగే విశేషాలను వివరిస్తూ ఉంటారు. 7 రోజుల పాటు సముద్రం మధ్యలో ఉండి ఎండా, వాన ఎలాంటి వాతావరణాన్ని అయినా తట్టుకొని ఉంటారు. దీంతో ఈ వీడియో ఇంట్రెస్టింగ్ గా మారింది.
ఇక ఈ వీడియోలు వారు తమ గురించి చెబుతూనే టాస్క్ లను వేస్తారు. ఈ టాస్క్ లను పూర్తి చేయాలని చెబుతారు. గతంలో నూ గేమ్స్, ఛాలెంజ్ లు విసిరి ఆకట్టుకున్న డొనాల్డ్ ప్రస్తుతం చేసిన సాహసయాత్రకు అంతా ఫిదా అవతున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ నేను ప్రతి రాత్రి కలలు కంటాను. మా వీడియోలు చూసినందుకు మీకు ధన్యవాదములు, నేను ఎప్పుడూ మీతోనే కనెక్ట్ అయి ఉంటాను’ అని మెసెజ్ పెట్టారు.