Royal Enfield motorcycles : బుల్లెట్ బండికి ‘నవతరం’ సింగారింపులు

Royal Enfield motorcycles : బుల్లెట్ బండి.. 90వ దశకంలో దీన్ని పెట్రోల్/కిరసనాయిల్ కాంబినేషన్ లో స్ట్రాట్ చేసి వీధుల్లో ‘డుగ్గుడుగ్గు’ భారీ సౌండ్ తో వెళుతుంటే ఆ రాజసమే వేరు. బుల్లెట్ బండి ఆ రోజుల్లో ఉందంటే వాళ్లు ఆ గ్రామంలోనే తోపు అని భావించేవారు. నాడు యువతను, మధ్య వయస్కులు ఈ బండిని నడిపేందుకు తహతహలాడేవారు.అయితే కాలక్రమంలో అంతరించిపోయిన ఈ బైక్ లు ఇప్పుడు మళ్లీ వస్తున్నాయి. నవతరం వీటికే ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. […]

Written By: NARESH, Updated On : June 26, 2022 3:01 pm
Follow us on

Royal Enfield motorcycles : బుల్లెట్ బండి.. 90వ దశకంలో దీన్ని పెట్రోల్/కిరసనాయిల్ కాంబినేషన్ లో స్ట్రాట్ చేసి వీధుల్లో ‘డుగ్గుడుగ్గు’ భారీ సౌండ్ తో వెళుతుంటే ఆ రాజసమే వేరు. బుల్లెట్ బండి ఆ రోజుల్లో ఉందంటే వాళ్లు ఆ గ్రామంలోనే తోపు అని భావించేవారు. నాడు యువతను, మధ్య వయస్కులు ఈ బండిని నడిపేందుకు తహతహలాడేవారు.అయితే కాలక్రమంలో అంతరించిపోయిన ఈ బైక్ లు ఇప్పుడు మళ్లీ వస్తున్నాయి. నవతరం వీటికే ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. ఆ పాత వాసనలు పోకుండా.. అదే గెటప్ లో అదే సౌండ్ తో మోడ్రన్ హంగులతో వచ్చిన ఈ బుల్లెట్ బండిలు ఇప్పుడు యూత్ ఐకాన్ గా మారిపోయాయి. ఇక కొంతమంది యువత ఈ బుల్లెట్ బండిలను తమకు నచ్చిన విధంగా రిన్నవేషన్ చేసి దాని రూపురేఖలు మార్చేసి అల్ట్రామోడల్ విదేశీబైక్ లుగా తీర్చిదిద్దుతున్నారు. ఆ నవతరం ‘బుల్లెట్ బైక్’లు ఇప్పుడు ట్రెండ్ సెట్టర్ గా మారాయి.

మోటార్ సైకిల్ అభిమానులు తమకిష్టమైన బుల్లెట్ బండిని అందంగా ముస్తాబు చేసుకొని మురిసిపోతున్నారు.. ఒక్కొక్కరు ఒక్కోలా సింగారిస్తున్నారు.. పురాతన కాలంలో రోడ్లపైకి వచ్చిన ఈ బండి.. అప్పటి నుంచి ఇప్పటివరకు క్రేజ్ తగ్గలేదు. ఒకప్పుడు ఈ బండికి ఎంత విలువ ఉండేదో.. ఇప్పుడు కూడా అదే స్థాయిలో ప్రత్యేకంగా నిలుస్తోంది.మిగతా కంపెనీల కొత్త కొత్త మోడల్ బైక్స్ ఎన్ని వచ్చినా రాయల్ ఎన్ ఫీల్డ్ ను మాత్రం బీట్ చేయలేకపోతున్నాయి.. అయితే బుల్లెట్ బండి అంటే ప్రేమ ఉన్నా యువత.. తమకు అనుగుణంగా మార్చుకుంటున్నారు. ఇలా ఆ బైక్ ను మార్చిన తరువాత కొన్ని ఫొటోలను సోషల్ మీడియాలో పెట్టడంతో అవిప్పుడు వైరల్ అవుతున్నాయి. వాటిని యూత్ తెగ లైక్ చేస్తున్నారు.

దేశవ్యాప్తంగా రాయల్ ఎన్ ఫీల్డ్ ఢిల్లీ, ముంబయ్, పూణె, బెంగుళూర్ నగరాల్లో వినూత్నంగా తయారు చేస్తున్నారు. అయితే ఇప్పుడు మార్కెట్లోకి వివిధ బ్రాండెడ్ కంపెనీల రకరకాల మోడల్స్ వస్తున్నాయి. కొందరు యువత ఈ మోడల్స్ కు ఆకర్షితులు కావడం లేదు. బుల్లెట్ బైక్ లు కొని వారికి అనగుణంగా మార్చుకుంటున్నారు. తమకు కావాల్సిన విధంగా సంబంధిత కంపెనీలకు తెలిపి మరీ రిన్నవేషన్ చేసుకుంటున్నారు. యువతకు నచ్చిన విధంగా మార్చుకుంటున్నారు. ఇలా తమకు కావాల్సిన విధంగా బుల్లెట్ బండిని మార్చుకున్న ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ గా మారింది. వాటిలో కొన్నింటిని చూద్దాం..

-‘గార్’
ఒకప్పుడు రాయల్ ఎన్ ఫీల్డ్ నుంచి రాజ్ పుటానా బైకులు వచ్చేవి. ఇవి జైపూర్ లోని రాజ్ పుటానాలో తయారు చేసేవారు. అయితే ఇప్పుడు రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్ ను రాజ్ పుటానాలా మార్చుకుంటున్నారు. ఈ బైక్ హ్యాండిల్స్ డిఫరెంట్ గా ఉంటాయి. పెద్ద పెద్ద టైర్లతో పాటు లెదర్ సీట్ కలిగి ఉంటుంది. కొత్తరకం ట్యాంక్ తో పాటు టూల్ బాక్స్ అన్నీ ఇందులో కలిసి ఉంటాయి. ఇది చూడడానికి అల్ట్రామోడల్ బైక్ గా అలరిస్తోంది. పూర్తిగా మారిన ఈ ‘గార్’ యువతకు పిచ్చిపిచ్చిగా నచ్చేస్తుంది.

-‘డివైన్’
నవీన్ మోటార్ సైకిల్స్ నుంచి వచ్చిన కొత్త బుల్లెట్ బండి మరింత ఆకర్షణీయంగా ఉంది. దీనికి ‘డివైన్’ అనే పేరు పెట్టారు. ఇది పూర్తిగా బ్లాక్ కలర్స్ లో ఉండి.. ట్యాంక్ పై గోల్డ్ కలర్ కవర్ కప్పి ఉంటుంది. ఈ బైక్ పై కూర్చొంటే చేతులు పైకి పెట్టాల్సి వస్తుంది. పెట్రోల్ ట్యాంక్ ప్రత్యేకంగా ఉండి లెదర్ సీట్ ను కలిగి ఉంటుంది. ఈ డివైన్ యువతకు పిచ్చిపిచ్చిగా నచ్చేస్తోంది. ఈ బైక్ లా మార్చుకునేందుకు ఆర్డర్లు వెల్లువెత్తుతున్నాయట..

-‘డిల్లీ’
కంప్లీట్ ఎల్లో కలర్ లో ఉన్న డిల్లీ బైక్ ఆకట్టుకుంటోంది. పాత కాలం బుల్లెట్ బండినే మళ్లీ తయారు చేశారా..? అన్నట్లుగా కనిపిస్తుంది. ఎందుకంటే దీని హెడ్ లైట్ రౌండ్ గా ఓల్డ్ బుల్లెట్ బండి మాదిరిగానే ఉంది. ట్యాంక్ పై వైట్ కలర్ ఉండడం వల్ల వైట్ అండ్ ఎల్లో కలర్ లో బైక్ కొట్టోచ్చినట్లు కనిపిస్తోంది. ఇక పై రెండు బైక్ లకంటే ఇది ఎత్తు తక్కువగానే ఉన్నా లెప్ట్ సైడ్ బాక్స్ ఉంది. ఇందులో ఒకరు కూర్చని వెళ్లొచ్చు. ఇదే మోడల్ బైక్ ను మనం ‘శంకర్ దాదా జిందాబాద్’ సినిమాలో చూడొచ్చు. దీనిని ఢిల్లీకి చెందిన వారు తయారు చేశారు. దీంతో అదే పేరు వచ్చింది.

-అర్బన్ రోడ్ స్టార్..
ఎంఎస్ కంపెనీ వాళ్లు తయారు చేసిన అర్బన్ రోడ్ స్టార్ బైక్ కొత్తగా కనిపిస్తోంది. సాధారణ బైక్ లా కనిపించినా ఈ బైక్ టైర్స్ పెద్దవిగా ఉంటాయి. హెడ్ లైట్ నార్మల్ గానే ఉంటుంది. అయితే ట్యాంక్ వరకు వైట్ కలర్లో వచ్చి సీట్లు మాత్రం బ్రౌన్ కలర్లో ఆకట్టుకుంటాయి. ఈ సరికొత్త అర్బన్ రోడ్ స్టార్ కు అర్డర్లు వెల్లువెత్తుతున్నాయి.

ఇలా బుల్లెట్ బండినే రిన్నవేషన్ చేస్తూ సరికొత్తగా ‘గార్’, డివైన్, ఢిల్లీ, అర్బన్ రోడ్ స్టార్ పేరిట సరికొత్తగా ముస్తాబై యువతకు పిచ్చెక్కించేలా కనిపిస్తున్నాయి. ఈ సరికొత్త బుల్లెట్ బైక్స్ ఇప్పుడు మార్కెట్లో ఆకట్టుకుంటున్నాయి.వీటిని తయారు చేయడానికి లక్షలు ఖర్చు పెట్టడానికి కూడా వెనుకాడడం లేదు. యూత్ ఐకాన్ గా మారిన ఈ బుల్లెట్ కొత్త బండ్లు ఆకట్టుకుంటున్నాయి.