
Rajinikanth Remuneration: సౌత్ ఇండియన్ లో కల్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ మరియు క్రేజ్ కి పర్యాయ పదం లాంటి హీరో సూపర్ స్టార్ రజినీకాంత్.ఎంత స్టార్ హీరోలు వచ్చినా ఆయన క్రేజ్ ఇప్పటికీ ఇసుమంత కూడా తగ్గలేదు.70 ఏళ్ళ వయస్సు లో కూడా వందల కోట్ల రూపాయిలను బాక్స్ ఆఫీస్ వద్ద కొల్లగొడుతున్న ఏకైక సీనియర్ హీరో ఆయన మాత్రమే.అలాంటి స్టార్ స్టేటస్ ఉన్న రజినీకాంత్ కి గత కొంత కాలం నుండి సరైన బ్లాక్ బస్టర్ హిట్ లేదు.
అభిమానులు ఆయన కం బ్యాక్ సినిమా కోసం ఎప్పటి నుండో ఎదురు
చూస్తున్నారు.ప్రస్తుతం డాక్టర్ మరియు బీస్ట్ వంటి చిత్రాలను తీసిన నిల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం లో జైలర్ అనే సినిమాలో నటిస్తున్నాడు.ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ చిత్రం ఈ ఏడాది లోనే విడుదల కాబోతుంది.దీనిపై రజినీకాంత్ అభిమానులు భారీ అంచనాలే పెట్టుకున్నారు.
ఇది ఇలా ఉండగా విష్ణు విశాల్ మరియు విక్రాంత్ హీరోలుగా నటిస్తున్న ‘లాల్ సలాం’ అనే సినిమాలో అతిథిపాత్ర పోషించడానికి సూపర్ స్టార్ రజినీకాంత్ ఇటీవలే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.అందుకోసంగా ఆయన వారం రోజుల కాల్ షీట్స్ కూడా కేటాయించాడు.ఈ వారం రోజులకు గాను రజినీకాంత్ 25 కోట్ల రూపాయిల పారితోషికం అందుకుంటున్నట్టు సమాచారం.కొంత మంది స్టార్ హీరోలు ఫుల్ సినిమా చేసిన కూడా ఈ రేంజ్ లో రాని రెమ్యూనరేషన్ రజినీకాంత్ కి కేవలం వారం రోజుల కాల్ షీట్స్ కోసం ఇస్తున్నారు అంటే ఆయన క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.

ఇక ఈ చిత్రం రజినీకాంత్ వల్ల హీరో విష్ణు విశాల్ కి మంచిగా ఉపయోగపడుతుందనే చెప్పాలి.ఎందుకంటే ఈమధ్య కాలం లో ఇతగాడు చేసిన సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొడుతున్నాయి, ఈ సినిమా తో ఎలా అయినా బౌన్స్ బ్యాక్ అవ్వాలని చూస్తున్నాడు.చూడాలి మరి ఈ చిత్రం తో ఆయన హిట్ అందుకుంటాడా లేదా అనేది.