Homeట్రెండింగ్ న్యూస్Russian Prisoner: 22 ఏళ్లు జైల్లో ఉన్నాడు.. విడుదలకు కొన్ని గంటల ముందు అలా చేశాడు..!

Russian Prisoner: 22 ఏళ్లు జైల్లో ఉన్నాడు.. విడుదలకు కొన్ని గంటల ముందు అలా చేశాడు..!

Russian Prisoner: నేరం చేసి జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు క్షణమొక యుగంలా గడుస్తుంది. బాహ్య ప్రపంచంతో వారికి సంబంధం ఉండదు. నాలుగు గోడల మధ్య జీవనం సాగిస్తారు. శిక్షా కాలం పూర్తయ్యే కొద్ది వారిలో కొత్త ఆశలు చిగురిస్తాయి. బయటకు ఎప్పుడు వెళ్తామా అని ఆతృతగా ఎదురు చూస్తారు. కానీ, ఇక్కడో ఖైదీ 22 ఏళ్లు జైలు శిక్ష అనుభవించారు. విడుదలకు ముందు రోజు జైలు నుంచి పారిపోయాడు. రష్యాలోని ఇర్కుట్స్క్‌ సమీపంలో ఉన్న మార్కోవా జైలులో ఈ విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. 22 ఏళ్లుగా జైలు శిక్ష అనుభవిస్తున్న కమోల్జోన్‌ కలోనోవ్‌ అనే ఖైదీ విడుదల కావాల్సిన రోజే జైలు నుంచి తప్పించుకున్నాడు.

పలు నేరాల్లో 22 ఏళ్ల జైలు శిక్షణ..
రష్యాకు చెందిన కమోల్జోన్‌ కలోనోవ్‌ రెండు హత్యలు, చోరీలు, అక్రమ ఆయుధాల సరఫరా, మందుగుండు సామగ్రిని కలిగి ఉండటం వంటి పలు క్రిమినల్‌ కేసుల్లో కోర్టు 22 ఏళ్ల జైలు శిక్ష విధించింది. 22 ఏళ్లుగా క్రమశిక్షణతో శిక్ష అనుభవించాడు. ఇన్నేళ్ల నిరీక్షణ తర్వాత ఎట్టకేలకు అతను విడుదల కావాల్సిన రోజు రానే వచ్చింది. అయితే ఆ ఖైదీ అదే రోజున తెల్లవారుజామున 4 గంటలకు జైలు నుంచి అదృశ్యమవడం ఆశ్చర్యకరంగా మారింది. దీంతో జైలు అధికారులు సదరు ఖైదీ జైలు నుంచి పరారైనట్లు ప్రకటించారు. దీనిలో అతనిపై మరొక కేసు నమోదు చేశారు. రష్యాలోని ఫెడరల్‌ పెనిటెన్షియరీ సర్వీస్‌ ప్రాంతీయ విభాగానికి చెందిన పోలీస్‌ అధికారులు ఈ విషయాన్ని మీడియాకు తెలియజేశారు. ఖైదీ కమోల్జోన్‌ కలోనోవ్‌ రష్యాలోని ఇర్కుట్స్క్‌ ప్రాంతంలోని జిమా నగరంలో నివాసం ఉంటున్న వ్యక్తిగా పోలీసులు తెలిపారు.

అంతకు ముందు జైల్లోనే..
పలు నేరాలలో అతను దోషిగా తేలడంతో కోర్టలు అతనికి జైలు శిక్ష విధించింది. అయితే అతను 1997లో జైలు నుంచి విడుదలయ్యాడు. ఆ తర్వాత 2001లో అతను డబుల్‌ మర్డర్‌ కేసులో దోషిగా తేలడంతో అతనికి కోర్టు 22 ఏళ్ల పాటు జైలు శిక్ష విధించింది. శిక్ష మొత్తం అనుభవించిన కమోల్జోన్‌ కలోనోవ్‌ తాజాగా విడుదలయ్యే రోజు రాగానే పరారై జైలు అధికారులను ఆశ్చర్యానికి గురిచేశాడు.

కఠిన కారాగార శిక్ష..
ఫెడరల్‌ పెనిటెన్షియరీ సర్వీస్‌ ఆఫ్‌ రష్యా ప్రకారం కమోల్జోన్‌ కలోనోవ్‌ జైలులో కఠినమైన శిక్షను అనుభవించినట్లు తెలుస్తోంది. విడుదలైన అనంతరం అతనిని బలవంతంగా కూలీ పనులకు పంపనున్నట్లు జైలు అధికారులు తెలిపారు. బహుశా ఈ పనులు చేయడం ఇష్టంలేకనే కమోల్జోన్‌ కలోనోవ్‌ పరారయ్యి ఉంటాడని జైలు అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం రష్యా పోలీసులు అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అతను ఈసారి పట్టుబడితే కోర్టు కఠినమైన శిక్ష విధిస్తుందని అధికారులు తెలిపారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version