https://oktelugu.com/

Egg: గుడ్లు అంటే మీకు చాలా ఇష్టమా.. బాగా తింటున్నారా.. అయితే విషయాలు తెలుసుకోండి..!

గుడ్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల మధుమేహం వచ్చే ప్రమాదం ఉంది.. అంతేకాకుండా మెటబాలిక్‌ సిండ్రోమ్‌ వచ్చే అవకాశం కూడా ఉందని కూడా కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి.

Written By:
  • Raj Shekar
  • , Updated On : October 1, 2023 / 03:47 PM IST

    Egg

    Follow us on

    Egg: మీరు గుడ్డు ప్రియులా.. నేషనల్‌ ఎగ్‌ కోఆర్డినేషన్‌ కమిటీ వారి ప్రకటన ‘‘ సండే కానీ, మండే కానీ.. రోజూ తినండి గుడ్డు’’ విని రోజూ గుడ్డు తినడం ప్రారంభించారా.. అయితే మీరు గుడ్డు గురించి కూడా తెలుసుకోవాలి. గుడ్డు మన రోజువారీ ఆహారంలో ముఖ్యమైన భాగం.. ఎందుకంటే ఇది ప్రోటీన్, విటమిన్‌ డితోపాటు అనేక ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం సాధారణంగా రోజుకు 2 ఉడికించిన గుడ్లు తినాలి. గుడ్లు తింటే లెక్కలేనన్ని లాభాలు ఉన్నా.. కొన్ని అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే మాత్రం తక్కువగా తినాలంటున్నారు ఆరోగ్య నిపుణులు.. లేకపోతే మరిన్ని సమస్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. అవి ఎలానో తెలుసుకుందాం.

    – రోజూ పరిమితికి మించి గుడ్లు తీసుకుంటే బరువు పెరుగుతుంది. అది గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా సృష్టిస్తుంది. అందుకే అధికంగా తింటే అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా తమ బరువును అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నిస్తున్న వారు.. గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారు గుడ్లు తీసుకోవడంలో జాగ్రత్తలు పాటించాలంటున్నారు.

    – గుడ్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల మధుమేహం వచ్చే ప్రమాదం ఉంది.. అంతేకాకుండా మెటబాలిక్‌ సిండ్రోమ్‌ వచ్చే అవకాశం కూడా ఉందని కూడా కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. అందుకే ప్రతీ వ్యక్తి ఆహార అవసరాలు భిన్నంగా ఉండవచ్చని.. కానీ, గుడ్లు అధికంగా తీసుకునే వారు ముందుగా అవసరాన్ని బట్టి పోషకాహార నిపుణులను, లేదా వైద్యులను సంప్రదించాలంటున్నారు.

    – కొన్ని అనారోగ్య సమస్యలున్న వారు.. ఎప్పటికప్పుడు గుడ్ల పరిమాణాన్ని నియంత్రించాలని సూచిస్తున్నారు. గుడ్లకు బదులుగా ఆహారంలో ఇతర ప్రోటీన్‌ పదార్థాలను కూడా చేర్చుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

    – గుడ్లు మానవ శరీరానికి మంచివని ఈ పరిశోధన ప్రతి ఒక్కరికి గుర్తు చేస్తుంది. అయితే వ్యక్తి అవసరాలు, వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితులను బట్టి ఎప్పటికప్పుడు గుడ్ల పరిమాణాన్ని నియంత్రించడం చాలా ముఖ్యం. మీకు ఎంత ప్రోటీన్, విటమిన్‌ డి అవసరమో దాని ఆధారంగా గుడ్లు తినాలని సూచిస్తున్నారు.