Kiribati New Year 2025: టైం జోన్ ప్రకారం ప్రపంచంలో అన్ని దేశాల కంటే ముందుగా కిరిబాటి దీవుల లో కొత్త సంవత్సరం వచ్చింది. మన కాలమానం ప్రకారం డిసెంబర్ 31 మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాలకే పసిఫిక్ మహాసముద్రంలోని కిరి బాటి దీవులలో ప్రజలు నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నారు. ఒక గంట వ్యవధిలోనే దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలోని టొంగా, సమోవా, అనంతరం న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, జపాన్, దక్షిణ కొరియా దేశాలు నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నాయి. ఈ ప్రాంతాలలో వేడుకలు ఆకాశాన్ని అంటే విధంగా సాగాయి. ఈ ప్రాంతాలలో ఎక్కువగా క్రైస్తవ మతం అమల్లో ఉంటుంది. దీంతో ప్రజలు చర్చిలకు వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. కేక్ కట్ చేసి పరస్పరం అభినందనలు తెలుపుకున్నారు.
ఇక్కడ మాత్రం విభిన్నం
కిరి బాటి దీవులు పసిఫిక్ సముద్రంలో విస్తరించి ఉంటాయి. ఈ ప్రాంతానికి పర్యాటకమే ప్రధాన ఆదాయం వనరు. గతంలో మీడియా అంతగా విస్తృతి చెందని క్రమంలో నూతన సంవత్సర వేడుకలంటే గతంలో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మాత్రమే గుర్తుకు వచ్చేవి..ఒపేరా హౌస్ లో బాణాసంచా కాల్చడమే మీడియాలో విస్తృతంగా కనిపించేది. కానీ ఇప్పుడు సోషల్ మీడియా వినియోగం పెరిగిన తర్వాత కిరి బాటి దీవుల ప్రస్తావన వస్తోంది. ” ఇక్కడి ప్రజలు కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారు. గతంలో ఈ ప్రాంతం అంతగా వెలుగులోకి వచ్చేది కాదు. ఈ ప్రాంతం గురించి విస్తృతంగా చర్చ జరిగేది కాదు. అయితే ఇప్పుడు మీడియా విస్తృతి పెరిగిన తర్వాత ఈ ప్రాంతం వెలుగులోకి వచ్చింది.. ఈ ప్రాంతంలోనే నూతన సంవత్సర వేడుకలు ముందుగా జరుగుతాయని ప్రపంచానికి తెలిసింది. ఈ ప్రాంతంలో ఆదివాసీలు ఎక్కువగా జీవిస్తుంటారు. వీరు విభిన్నమైన మతాలను ఆచరిస్తుంటారు. సమైక్య జీవనాన్ని గడుపుతుంటారు. నూతన సంవత్సర సందర్భంగా సంబరాలు జరుపుకున్నారు. ప్రపంచం నూతన సంవత్సరం జరుపుకుంటుండగానే.. మీరు అప్పటికే న్యూ ఇయర్ వేడుకలను ముగిస్తారు. ఈ ప్రాంతంలో సూర్యోదయం అన్ని దేశాల కంటే ముందుగా అవుతుంది. అందువల్లే ఇక్కడ నూతన సంవత్సరం ప్రపంచానికంటే ముందుగా వస్తుంది. ఈ ప్రాంతంలో నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ప్రజలు విస్తృతంగా విందు వినోదాలలో పాల్గొన్నారు. తమ ప్రాంతాన్ని సందర్శించడానికి వచ్చిన పర్యాటకులతో కలిసి నృత్యాలు చేశారు. మొత్తంగా చూస్తే వీరి సంస్కృతిలో కూడా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కొత్తదనానికి వీరు పెద్దపీట వేస్తున్నారు. అందువల్లే వీరి సంస్కృతి సరికొత్తగా కనిపిస్తోంది. ఈ దీవులలో ఉండేవారు కూడా ఉన్నత చదువులు చదువుతున్నారు. ఉన్నత ఉద్యోగాలు చేస్తున్నారు. క్రమంగా వారి జీవన విధానాన్ని సరికొత్తగా మార్చుకుంటున్నారని” తమ కథనాలలో పాశ్చాత్య మీడియా ఈ విషయాలను ప్రస్తావించింది.