Hero Ram: దేవదాస్ సినిమా తో ఇండస్ట్రీ కి పరిచయమైనా హీరో రామ్ తన ఎనెర్జిటిక్ యాక్టింగ్ తో అద్భుతమైన డ్యాన్స్ మరియు ఫైట్స్ తో మాస్ మరియు యూత్ ఆడియన్స్ లో ఒక రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ని ఏర్పాటు చేసుకున్నాడు..సోషల్ మీడియా వృద్ధిలోకి వచ్చిన తర్వాత రామ్ రేంజ్ ఎవ్వరూ ఊహించని రేంజ్ కి వెళ్ళిపోయింది..ముఖ్యంగా బాలీవుడ్ ఆడియన్స్ రామ్ సినిమాలంటే మెంటలెక్కిపోతున్నారు.

రీసెంట్ గా ఆయన హీరో గా నటించిన ‘ది వారియర్’ అనే చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద ఫ్లాప్ గా నిలిచింది..కానీ ఈ సినిమాని హిందీ లో డబ్ చేసింది కొన్ని రోజుల క్రితమే యూట్యూబ్ లో అప్లోడ్ చేసారు..విడుదలైన కొద్దీ రోజుల్లోనే ఈ సినిమాకి వంద మిలియన్ కి పైగా వ్యూస్ రావడం అందరినీ షాక్ కి గురి చేసింది..కేవలం ఈ సినిమానే కాదు..రామ్ గతం లో నటించిన సినిమాలకు కూడా రికార్డు స్థాయి వ్యూస్ వచ్చాయి.
అలా హిందీ లో డబ్ అయినా రామ్ 7 సినిమాలకు వందకి పైగా వ్యూస్ వచ్చాయి..టాలీవుడ్ నుండి ఒక హీరో కి ఈ రేంజ్ వ్యూస్ ఇప్పటి వరుకు ఎవరికీ రాలేదు..ఒక్క రామ్ కి తప్ప..చాలా కాలం తర్వాత రామ్ కెరీర్ లో భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ఇస్మార్ట్ శంకర్ మూవీ ని హిందీ లో డబ్ చేసి యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తే 300 మిలియన్ కి పైగా వ్యూస్ వచ్చాయి.

హలో గురు ప్రేమకోసమే చిత్రానికి 489 మిలియన్ వ్యూస్ , నేను శైలజ చిత్రానికి 523 మిలియన్ వ్యూస్..ఉన్నది ఒక్కటే జిందగీ మూవీ కి 264 మిలియన్ వ్యూస్..ఇలా ఆయన నటించిన సినిమాలన్నిటికీ కలిపి 2000 మిలియన్ కి పైగా వ్యూస్ వచ్చాయని..వీటి నుండి సుమారు 150 కోట్ల రూపాయిలు వచ్చి ఉంటాయని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు..ఇది బాలీవుడ్ దర్శక నిర్మాతలు కూడా గమనించి రామ్ తో సినిమాలు చెయ్యడానికి క్యూ కట్టేస్తున్నారట.