
Titanic Re Release: 1997 వ సంవత్సరం లో ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కెమరూన్ తెరకెక్కించిన ‘టైటానిక్’ చిత్రం ప్రపంచ బాక్స్ ఆఫీస్ ని ఏ రేంజ్ లో ఊపేసిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.ఇప్పటికీ ఈ సినిమా హాలీవుడ్ బాక్స్ ఆఫీస్ టాప్ 3 చిత్రాలలో ఒకటిగా నిల్చింది అంటే ఆ సినిమా రేంజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.అతి తక్కువ టికెట్ రేట్స్ ఉన్న ఆ రోజుల్లోనే ఈ సినిమా రెండు బిలియన్ డాలర్లను వసూలు చేసింది.
అంటే ఇండియన్ కరెన్సీ లెక్క ప్రకారం 16000 కోట్ల రూపాయిలు అన్నమాట.ఇప్పుడు ఉన్నంత టెక్నాలజీ ఆ రోజుల్లో లేదు.3D ,4D మరియు ఐమాక్స్ ఫార్మట్స్ థియేటర్స్ కూడా లేవు.అయినా కూడా ఈ చిత్రం అంత వసూళ్లను రాబట్టింది అంటే సాధారణమైన విషయం కాదు.మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత ఆ చిత్రాన్ని లేటెస్ట్ 3D టెక్నాలజీ కి మార్చి ఫిబ్రవరి 10 వ తారీఖున రీ రిలీజ్ చేసారు.
రీ రిలీజ్ లో కూడా ఈ చిత్రానికి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది.కేవలం మొదటి వీకెండ్ లోనే ఈ చిత్రానికి 25 మిలియన్ డాలర్లు వచ్చినట్టు హాలీవుడ్ ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి.ఇది జేమ్స్ కెమరూన్ తెరకెక్కించిన అవతార్ చిత్రం కూడా గత ఏడాది రీ రిలీజ్ అయ్యింది కానీ ‘టైటానిక్’ రేంజ్ రెస్పాన్స్ ని మాత్రం దక్కించుకోలేకపోయింది.ఇండియన్ కరెన్సీ ప్రకారం టైటానిక్ చిత్రం రీ రిలీజ్ అయినా తర్వాత 200 కోట్ల రూపాయిల వసూళ్లను రాబట్టింది అట.

ఇది నిజంగా ఆల్ టైం అన్న బీటబుల్ వరల్డ్ రికార్డు గా చెప్పుకోవచ్చు.ఇప్పటికీ థియేటర్స్ లో సక్సెస్ ఫుల్ గా నడుస్తున్న ఈ సినిమా ఫుల్ రన్ లో 200 మిలియన్ డాలర్లు వసూలు చేస్తుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద కూడా ఈ సినిమా డీసెంట్ స్థాయి వసూళ్లను రాబట్టినట్టు సమాచారం.