16 Years Girl: కలికాలం అంటే ఏంటో అనుకుంటున్నారు.. కానీ కలికాలంలో మరీ ఇంత దారుణమైన ఘటనలను వినాల్సి.. చూడాల్సి రావడం నిజంగా సిగ్గు చేటు.. ఇలాంటి ఘోరాలు చూసినప్పుడు మనం ఏ సమాజంలో బ్రతుకుతున్నాం అని అనిపించక మానదు.. కంటికి రెప్పలా కాచుకోవాల్సిన వారే కాలయముడిగా మారితే ఆ అమ్మాయిల పరిస్థితి వర్ణించడానికి కూడా కష్టమే..

బయట వారు తమ కూతురు పట్ల కానీ.. తమ చెల్లెలి పట్ల కానీ ఎవరైనా ఇంత చిన్న హాని చేసినా.. తండ్రి, అన్నలు సహించరు. వారిని హెచ్చరించడమో.. మరీ ఎక్కువ చేస్తుంటే దండించడమో చేస్తారు.. కానీ మనం ఇప్పుడు చెప్పుకోబోయే ఘటనలో ఆ అమ్మాయికి ఇందుకు పూర్తిగా విరుద్ధంగా జరిగింది. ఆమెను ప్రొటెక్ట్ చేయాల్సిన వారే ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు.
Also Read: హీరోలను వదిలేసి నిర్మాతలను పట్టిన ఆ హీరోయిన్!?
తండ్రి, కొడుకు వంతులవారీగా బాలికపై అత్యాచారం చేసిన ఘటన ముంబై లో వెలుగులోకి వచ్చింది. పదవతరగతి చదువుతున్న 16 ఏళ్ల బాలికపై తండ్రి, కొడుకులు రెండేళ్లుగా అత్యాచారం చేస్తున్న కూడా ఎవరికీ చెప్పుకోవాలో అర్ధం కాక మౌనంగా భరించింది. కానీ ఆ విషయం తన చెల్లి వరకు కూడా రావడంతో ఆమె సహించలేక పోయింది. ఆమె రెండేళ్లు మౌనంగా భరించింది.
కానీ ఇప్పుడు ఆ తండ్రి కొడుకు కన్ను చిన్న కూతురుపై పడడంతో ఆమె జీవితం లాగా చెల్లెలి జీవితం అవ్వకూడదని ధైర్యం చేసుకుని స్కూల్ టీచర్ కి చెప్పింది. స్కూల్ టీచర్ ప్రిన్సిపాల్ సహాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసారు. 16 ఏళ్ల బాలికను రేప్ చేసిన ఘటనలో ముంబైకి చెందిన 43 ఏళ్ల వ్యక్తిని, అతడి కొడుకైన 20 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసారు. విచారణలో నేరాన్ని అంగీకరించడంతో కేసు పెట్టి రిమాండ్ కు తరలించారు.
Also Read: ట్రెండింగ్ న్యూస్.. ఏడాదిలో 3 వేల కోట్ల అప్పు తీర్చిన మహిళ..!
[…] […]