Jai Bhim: ‘జై భీమ్’.. సూర్య నటించి, నిర్మించిన ఈ సినిమా సామాన్య ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇక విమర్శకుల ప్రశంసలను సైతం అందుకొంది. సూర్య అభిమానులను అయితే మెస్మరైజ్ చేసింది. పైగా ఇప్పటికే ఈ సినిమా ఆస్కార్ బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. ఇటీవల ఆస్కార్ అధికారిక యూట్యూబ్ ఛానెల్‌లో ‘సీన్ ఎట్ ది అకాడమీ’ పేరుతో ఈ సినిమాలోని ఓ సన్నివేశాన్ని వీడియో రూపంలో పోస్ట్ చేశారు. ఇప్పుడు ఏకంగా బెస్ట్ ఫీచర్ ఫిలింగా ఆస్కార్-2022 అవార్డ్స్‌కి నామినేట్ అయింది.

గతేడాది ది బెస్ట్ ఫిల్మ్‌గా విమర్శకుల ప్రశంసలు అందుకున్న జైభీమ్, తాజాగా చైనాలోనూ విడుదలై సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. మన దగ్గర IMDBలా చైనాకు చెందిన ప్రముఖ మీడియా సమీక్ష ప్లాట్‌ఫామ్ డౌబన్‌లో 8.7 రేటింగ్ సంపాదించుకుంది. చైనా చరిత్రలో ఓ తల్లి జపాన్‌లో జరిగిన తన కూతురి హత్యపై న్యాయపోరాటం చేయడం, జైభీమ్ కథని పోలి ఉండడంతో, అక్కడి ప్రేక్షకులకి ఈ చిత్రం బాగా కనెక్ట్ అయిందంటున్నారు.
Also Read: దారుణం.. బాలికపై తండ్రి, అన్న అత్యాచారం.. ఇంతకన్నా నీచం ఉంటుందా..?

ఇక మోహన్‌లాల్ నటించిన ‘మరక్కార్’ కూడా ఆస్కార్ నామినేషన్‌లో చోటు దక్కించుకుంది. అయితే, ‘జై భీమ్’ మాత్రం విమర్శకుల ప్రశంసలను సైతం అందుకొంది. ప్రముఖ న్యాయవాది, జస్టిస్ చంద్రు కథ ఆధారంగా ఈ సినిమాను డైరెక్టర్ జ్ఞానవేల్ తెరకెక్కించాడు. దేశ వ్యాప్తంగా అభిమానులను విశేషంగా ఆకట్టుకుందీ చిత్రం. మొత్తమ్మీద ‘జై భీమ్’ సినిమాలో ఎమోషన్స్ అలాగే చెప్పాలనుకున్న మెసేజ్ చాలా బాగుంది.
Also Read: అతనితో ఉన్న వీడియోని పోస్ట్ చేసింది .. బూతులు తిట్టించుకుంది !