Ghaziabad Dasna Jail: గతంలో ప్రపంచాన్ని వణికించిన వ్యాధి ఎయిడ్స్. ఇప్పుడు క్రమంగా తగ్గిపోయింది. ఎయిడ్స్ సోకిన రోగి రక్తం ఎక్కించుకుంటే, అతడు వాడిన బ్లేడు వాడితే, శృంగారంలో పాల్గొంటే ఈ వ్యాధి వస్తుందని తెలియడంతో చాలా మంది అసహజ శృంగారానికి దూరంగా ఉన్నారు. ఫలితంగా ఎయిడ్స్ క్రమంగా తగ్గుముఖం పట్టింది. అయితే ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్ దస్నా జైలులో ఓ దారుణం చోటుచేసుకుంది. జైలులో ఉన్న దాదాపు 140 మందికి హెచ్ఐవీ పాజిటివ్ రావడం కలకలం రేపుతోంది. జైలులో 5500 మంది ఖైదీలు ఉండగా వారిలో 140 మందికి మాత్రమే వ్యాధి సోకడం అనుమానాలకు తావిస్తోంది.

జైలులో ఏం జరుగుతోంది. ఖైదీల మధ్యే అసహజ శృంగారం జరుగుతోందా? లేక బయట నుంచి వ్యభిచారిణులను తీసుకొస్తున్నారా? ఎందుకు ఇంత మందికి వ్యాధి అంటుకుంది అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. జైలులో పరిస్థితిపై పూర్తిస్థాయిలో విచారణ చేస్తున్నారు. ఖైదీలకు ఎయిడ్స్ సోకడంలో ఎవరి పాత్ర ఉంది? వారికి ఈ వ్యాధి ఎందుకు సోకింది అని ఆలోచిస్తున్నారు. ఇంత మందికి ఏకకాలంలో ఎయిడ్స్ రావడం అందరిలో ఆశ్చర్యం కలిగిస్తోంది. ఖైదీలకు పరీక్షలు చేయగా 140 మందిలో ఆ లక్షణాలు కనిపించాయి.
2016 నుంచి జైలులో హెచ్ఐవీ పరీక్షలు చేస్తున్నారు. ఈ కోణంలోనే దస్నా జైలు ఎస్పీ అలోక్ సింగ్ ఎయిడ్స్ పరీక్షలు నిర్వహించారు. తొలిసారి 49 మందికి పరీక్షలు చేయగా అందరికి పాజిటివ్ వచ్చింది. నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ సర్వే 2019 ప్రకారం జాతయ స్థాయిలో 2.5 ఉండగా ఈ జైలులోనే 2.5 శాతం రావడం గమనార్హం. జైలులో పెద్దసంఖ్యలో ఖైదీలు చేరడంతో ఎయిడ్స్ వ్యాప్తి జరిగిందా? లేక కొత్త ఖైదీలు రావడంతో ఇలా జరిగిందా? అనే విషయం ఇంకా తేలడం లేదు.

ఇంత పెద్ద మొత్తంలో ఖైదీలకు హెచ్ఐవీ సోకవడం పలు అనుమానాలకు తావిస్తోంది. జైలు అధికారుల తప్పిదం ఉందేమోననే కోణంలో కూడా విచారణ సాగుతోంది. అధికారులు పూర్తి స్థాయిలో విచారణ చేస్తే ఏం నిజాలు వెలుగు చూస్తాయో తెలియడం లేదు. దీనిపై అధికార యంత్రాంగం ఏం చర్యలు తీసుకుంటుందో అని చూస్తున్నారు. ఖైదీలకు ఎయిడ్స్ రావడం కొత్త ఆలోచనలకు తెర తీస్తోంది. ఖైదీలకు హెచ్ఐవీ తేలడంతో అందరు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది రక్తమార్పిడి, శృంగారంతోనే వస్తుందని అందరికి తెలియడంతో జైలులో ఏం జరుగుతుందో కూడా అంతుచిక్కడం లేదని చెబుతున్నారు.