Homeట్రెండింగ్ న్యూస్Amritsar District : పన్నెండేళ్లకే పాపకు జన్మనిచింది.. కన్నీళ్లు తెప్పించే స్టోరీ!

Amritsar District : పన్నెండేళ్లకే పాపకు జన్మనిచింది.. కన్నీళ్లు తెప్పించే స్టోరీ!

Amritsar District :  పెరిగిన సాంకేతికత, సినిమాలు, ఇంటర్నెట్‌.. అరచేతిలో ఆన్‌డ్రాయిడ్‌ ఫోన్ల ప్రభావం పిల్లలు, యువతపై ఎక్కువగా చెడు ప్రభావం చూపుతోంది. ఏది తప్పు.. ఏది ఒప్పు అని విచక్షణ చేయలేని వయసులో పిల్లలు తప్పటడుగు వేస్తున్నారు. తప్పుదారిలో పయనిస్తున్నారు. బంధాలు, అనుబంధాలు దూరం చేస్తున్న టెన్నాలజీ అక్రమ, అవాంచిత సంబంధాలకు దారితీస్తోంది. చేతులు కాలాక ఆకలు పట్టుకున్నట్లుగా తప్పు జరిగిపోయాక బాధపడాల్సి వస్తోంది. తాజాగా పంజాబ్‌లోని అమృత్‌సర్‌ జిల్లాలో జరిగిన ఈ ఘటన తప్పుదారి పడుతున్న పిల్లల తీరుకు అద్ధం పడుతోంది.
పట్టుమని 12 ఏళ్లకే.. 
పంజాబ్‌లోని అమృత్‌సర్‌ జిల్లా ఫగ్వారా పోలీస్‌స్టేషన్‌ పరిధిలో పన్నెండేళ్ల బాలిక శనివారం ఓ చిన్నారికి జన్మనిచ్చింది. ఏడు నెలల క్రితమే ఆ బాలిక గర్భం దాల్చినప్పటికీ.. ఆ విషయం ఆమెకు తెలియకపోవడం గమనార్హం. 12 ఏళ్ల వయసు అంటే.. అప్పుడే మెచ్యూరిటీ వయసు.. తల్లి అవసరం ఈ వయసులో అవసరం. ఏది మంచి, ఏది చెడు తెలుసుకోవాల్సిన సమయంలో.. బాలిక ఏకంగా గర్భం దాల్చి తల్లయింది. బాలిక కడుపునొప్పితో బాధపడుతూ గురునానక్‌ దేవ్‌ ఆసుపత్రికి వచ్చింది. పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆమె గర్భవతి అని నిర్ధరించారు.
విషమంగా తల్లీ బిడ్డల పరిస్థితి.. 
తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతున్న బాలికకు వైద్యులు ప్రసవం చేశారు. 800 గ్రాముల బరువున్న పాపను బయటకు తీశారు. అయితే అవాంచిత గర్భం కారణంగా తల్లీబిడ్డల పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు వెల్లడించారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.
ఏడు నెలలుగా కడుపు నొప్పి అని.. 
12 ఏళ్ల ఆ బాలిక ఏడు నెలలుగా కడపు నొప్పితో బాధపడుతోంది. ఈ విషయాన్ని ఇంట్లో చెప్పినా పెద్దగా పట్టించుకోలేదు. తాత్కాలికంగా మందులు ఇచ్చి ఉపశమనం కలిగేలా చేశారు. ఆస్పత్రికి వచ్చే వరకూ ఆ చిన్నారి గర్భం దాల్చిందన్న విషయం గమనించకపోవడం విషాదకరం.
తల్లి వదిలేసింది.. 
ఇంట్లో తన కూతురు తాను మాత్రమే ఉంటున్నామని, తన భార్య వదిలేసి వెళ్లిపోయిందని బాలిక తండ్రి తెలిపాడు. ఎదిగే పాపను ఏమి అడగాలో, ఏమి అడగ కూడాదో తెయలేదని కన్నీరు పెట్టుకున్నాడు. తల్లి అందుబాటులో ఉండి ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదని పేర్కొన్నాడు. తల్లి అన్నీ గమనించేందని, తను తన పనిచేసుకుంటూ బిడ్డను పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశాడు.
అత్యాచారం ఫలితమే.. 
చిన్న వయసులో గర్భం దాల్చడంపై బాధితురాలిని ప్రశ్నించగా.. ఏడు నెలల కిందట బహిర్భూమికి వెళ్లినపుడు తనపై అత్యాచారం జరిగిందని తెలిపింది. తన శరీరంలో మార్పులు వస్తున్నట్లు గుర్తించానని, కానీ గర్భం అని తెలియలేదని పేర్కొంది. అత్యాచారం గురించి తండ్రికి చెబితే ఏమౌతుందో అని చెప్పలేదని వెల్లడించింది. ఈవిషయమై దర్యాప్తు జరుపుతున్న పోలీసులు నిందితుడిని త్వరలోనే అరెస్ట్‌ చేస్తామని తెలిపారు.
Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version