Balakrishna- Veera Simha Reddy: సంక్రాంతి సీజన్ వచ్చిందంటే చాలు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ గలగలమంటుంది..ఈ సీజన్ లో వచ్చే సినిమాలకు కాస్త యావరేజి టాక్ వచ్చినా కూడా వసూళ్ల మోత మోగేస్తుంది..అలా ఈ సంక్రాంతి సీజన్ కూడా క్రేజీ మూవీస్ తో బాక్స్ ఆఫీస్ పోరు లో తలపడడానికి సిద్ధంగా ఉన్నాయి..వాటిల్లో ముందుగా మనం మాట్లాడుకోవాల్సింది బాలయ్య బాబు వీర సింహ రెడ్డి మరియు మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాల గురించే..ఈ రెండు సినిమాల పై అభిమానుల్లో మాములు అంచనాలు లేవు.

చిరంజీవి మరియు బాలయ్య బాబు సినిమాల మధ్య పోరు అంటే కేవలం వాళ్ళ అభిమానులకే కాదు..ప్రేక్షకులకు కూడా కనుల విందుగా ఉంటుంది..దశాబ్దాల వారీగా వీళ్లిద్దరి మధ్య ఆ పోటీతత్వం ఉంది..ఇది ఇలా ఉండగా వీర సింహా రెడ్డి బాలయ్య బాబు కి బాగా అచొచ్చిన ఫ్యాక్షన్ నేపథ్యం లో కొనసాగే సినిమా..ఈ నేపథ్యం లో వచ్చిన బాలయ్య సినిమాలు ఇప్పటి వరుకు పరాజయం పాలైనవి చేతి వేళ్ళతో లెక్కపెట్టొచ్చు.
ఇప్పుడు వీర సింహా రెడ్డి చిత్రం కూడా బాలయ్య బాబు కెరీర్ లో మైల్ స్టోన్ గా నిలిచిపోనుందని ఇండస్ట్రీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తున్న టాక్..సాధారణంగానే బాలయ్య బాబు సినిమాల్లో మాస్ సన్నివేశాలకు కొదవే ఉండదు..ఫాన్స్ కి పూనకాలు రప్పించే రేంజ్ ఎలేవేషన్ సీన్స్ కచ్చితంగా ఉండాల్సిందే..వీర సింహా రెడ్డి చిత్రం లో ఆ మోతాదు కాస్త ఎక్కువే ఉంటుందట..ఈ సినిమాలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 11 ఫైట్ సీన్స్ ఉంటాయట.

కన్నడ స్టార్ హీరో దునియా విజయ్ ఈ సినిమా లో విలన్ గా నటిస్తుండగా..శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది..ఇక వరుసగా విలన్ రోల్స్ తో ప్రేక్షకులను అలరిస్తున్న వరలక్ష్మి శరత్ కుమార్ ఇందులో బాలయ్య బాబు కి చెల్లెలు గా నటిస్తుంది..టీజర్ లో థమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది..ఇలా ఎన్నో ప్రత్యేకతలతో తెరకెక్కుతున్న ఈ చిత్రం అఖండ రేంజ్ లో భారీ హిట్ అవుతుందో లేదో చూడాలి.