Chiranjeevi Waltair Veerayya Collections: మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం జనవరి 13 వ తారీఖున విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తుందో మనం చూస్తూనే ఉన్నాము..ప్రతీ రోజు ఈ సినిమాకి వస్తున్న వసూళ్లను చూసి ట్రేడ్ పండితులకు సైతం మైండ్ బ్లాక్ అవుతుంది..మెగాస్టార్ గత రెండు చిత్రాల వసూళ్లను చూసి తక్కువ అంచనా వేసిన ప్రతీ ఒక్కరికి తన స్టార్ స్టేటస్ తో మరోసారి బుద్దిచెప్పాడు మెగాస్టార్.

డైరెక్టర్ బాబీ వింటేజ్ మెగాస్టార్ ని బయటకి తీస్తే ఈ రేంజ్ బాక్స్ ఆఫీస్ విద్వంసం ఉంటుందా అని నోరెళ్లబెడుతున్నారు ప్రేక్షకులు..మొదటి రోజు రివ్యూస్ మరియు రేటింగ్స్ మూవీ కి బాగా నెగటివ్ గా ఇచ్చినప్పటికీ ఆడియన్స్ వాటిని లెక్క చెయ్యలేదు..థియేటర్స్ కి తండోపతండాలుగా తరలి వెళ్తూనే ఉన్నారు..ఈ ప్రవాహం ఇప్పట్లో ఆగదు..ఈ నెల మొత్తం కొనసాగుతూనే ఉంటుంది అని ట్రేడ్ పండితులు చెప్తున్నారు.
ఈ సినిమా విడుదలై నేటికీ మూడు రోజులు పూర్తి అయ్యాయి..ఈ మూడు రోజులకు ఈ సినిమా ఏకంగా వంద కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి..మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో అత్యంత వేగవంతంగా బాక్స్ ఆఫీస్ వద్ద వంద కోట్ల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసిన రెండవ చిత్రం గా ‘వాల్తేరు వీరయ్య’ నిలిచిపోయింది..గతం లో ఆయన హీరో గా నటించిన ‘సై రా నరసింహారెడ్డి’ చిత్రం రెండు రోజుల్లోనే వంద కోట్ల రూపాయిల గ్రాస్ ని మార్కు ని అందుకుంది.

ఇక షేర్ వసూళ్ల విషయానికి వస్తే మూడు రోజులకు కలిపి దాదాపుగా 63 కోట్ల రూపాయిలు వసూలు చేసిందని అంచనా వేస్తున్నారు..ఈరోజు మార్నింగ్ షోస్ కూడా అదిరిపోయాయి..బాక్స్ ఆఫీస్ వద్ద మరో అద్భుతమైన రోజు ని ఎంజాయ్ చేయబోతుంది ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం..మరి ఈ సినిమా ప్రతిష్టాత్మక 100 కోట్ల షేర్ మార్కుని ఎన్ని రోజుల్లో అందుకోబోతుందో ఇప్పుడు ఆసక్తికరమైన విషయం.