
Star Heroes Rejected Movies: సినీ ఇండస్ట్రీల్లో హీరోలకు స్టార్ ఇమేజ్ వచ్చాక వరుస సినిమాలతో బిజీ అవుతారు. ఈ తరుణంలో కొందరు డైరెక్టర్లు ఆ హీరోలతో సినిమాలు తీయాలనుకున్నప్పుడు వారి కాల్సీట్లు దొరకవు. మరికొందరు కథలు నచ్చక రిజెక్ట్ చేస్తారు. కానీ అవే కథలతో మరో హీరోలు సినిమాలు తీస్తే బ్లాక్ బస్టర్ అవుతాయి. ఆ తరువాత రిజెక్ట్ చేసిన హీరోలు పశ్చాత్తాప పడుతారు. ఆ సినిమాను ఎందుకు మిస్ చేసుకున్నామా? అని అనుకుంటారు. నాటి నుంచి నేటి వరకు స్టార్ హీరోలు వద్దనుకున్న సినిమాలను ఇతరులు చేసి సక్సెస్ కొట్టారు. ఇలాంటి సినిమాలు చాలానే ఉన్నాయి. అలాంటి 10 సినిమాల గురించి తెలుసుకుందాం.
దేవదాసు:
అక్కినేని నాగేశ్వర్ రావు నటించిన దేవదాస్ మూవీ గురించి ఇప్పటికీ చర్చ సాగుతూనే ఉంటుంది. ఇందులో నాగేశ్వర్ రావు గారు తాగుబోతు క్యారెక్టర్ లో జీవించారు. అయితే ఈ సినిమాను ముందుగా అప్పటి సీనియర్ ఎన్టీఆర్ కోసం రచించారట. అయితే తాను తాగుబోతు క్యారెక్టర్ చేయనని, అలా చేస్తే ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని వద్దన్నారట. దీంతో నాగేశ్వర్ రావు ఆ పాత్రలో జీవించి సక్సెస్ కొట్టారు.
పాతాళ భైరవి:
సీనియర్ ఎన్టీఆర్ కు ఈ సినిమాతోనే స్టార్ గుర్తింపు వచ్చింది. అయితే అంతకుముందే అక్కినేని నాగేశ్వర్ రావు సినిమాల్లో స్టార్ ఇమేజ్ ఉంది. దీంతో ఈ సినిమా కోసం నాగేశ్వర్ రావుగారిని సంప్రదించగా ఆయన రిజెక్ట్ చేశారు. అప్పటికే కీలుగుర్రం చేసిన ఆయన మరోసారి జానపద చిత్రం చేస్తే బాగుండదని వద్దన్నారట. కానీ ఎన్టీఆర్ ఈ సినిమాలో నటించడం ద్వారా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.
అడవిరాముడు:
ఈ మూవీని ముందుగా శోభన్ బాబుతో చేయాలనుకున్నారట. కానీ ఆయన కొన్ని సినిమాలతో బిజీగా ఉండడంతో ఇందులో ఎన్టీఆర్ కు అవకాశం ఇచ్చారు. ఈ సినిమాలో నటించిన ఎన్టీఆర్ సక్సెస్ ను అందుకున్న విషయం తెలిసిందే.
గ్యాంగ్ లీడర్:
మెగాస్టార్ కెరీర్ ను మలుపు తిప్పిన గ్యాంగ్ లీడర్ ను మెగా అభిమానులు ఎప్పటికీ మరిచిపోరు. ఈ సినిమాలో ముందుగా నాగబాబుతో చేద్దామని అనుకున్నారట. ‘అరె ఓ సాంబ’ అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేశారట. కానీ ఇదే సమయంలో చిరంజీవి ఫోన్ చేసి కాల్షీట్స్ ఉన్నాయి సినిమా చేద్దాం అని చెప్పడంతో చిరంజీవికి అనుకోకుండా ఓకే చెప్పారట. అయితే ఆ తరువాత నాగబాబుతో ఈ విషయం చెప్పాక.. తనకంటే అన్నయ్యనే బాగా నటిస్తారని చెప్పడంతో చిరంజీవికి ఈ సినిమా దక్కింది.
పసివాడి ప్రాణం:
చిరంజీవి, విజయశాంతి నటించిన ఈ సినిమా ఓ పిల్లాడి చుట్టూ సాగుతుంది. దీనిని ‘విట్నెస్’ అనే ఆంగ్ల సినిమా ఆధారంగా తెరకెక్కించారు. ఈ సినిమాను ముందుగా కృష్ణ, శ్రీదేవిలతో పాటు చిన్నప్పటి మహేష్ తో కలిసి చేయాలనుకున్నారు. అప్పటికే ఇలాంటి సినిమా కథతో వచ్చిన తమిళ సినిమా రైట్స్ ను అరవింద్ కొనేశాడు. దీంతో కృష్ణ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకోవడంతో ఆ సినిమా చిరంజీవి చేయాల్సి వచ్చింది.
సమరసింహారెడ్డి:
బాలకృష్ణ కెరీర్ ను మలుపు తిప్పిన మూవీ సమరసింహారెడ్డి. ఈ సినిమాతోనే ఫ్యాక్షనిజం సినిమాలు స్ట్రాట్ అయ్యాయి. అయితే ఈ మూవీని ముందుగా వెంకటేష్ తో చేద్దామనుకున్నారు. కానీ ఆయనకు సినిమా సెట్ అవదని చెప్పాడట. దీంతో బాలయ్యకు స్టోరీ చెప్పగా వెంటనే ఒప్పేసుకున్నాడు. ఆ తరువాత బ్లాక్ బస్టర్ కొట్టాడు.
చంటి:
విక్టరి వెంకటేష్ సినీ కెరీర్లోనే బ్లాక్ బస్టర్ మువీ చంటి. తమిళ సినిమా చిన్న తంబి సినిమా ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాను రాజేంద్రప్రసాద్, కుష్భూలతో చేయాలని అనుకున్నారట. కానీ నిర్మాత సురేష్ బాబు వెంకటేష్ తో చేయాలని చెప్పడంతో ఆయన హీరోగా నటించారు.
నువ్వేకావాలి:
కొత్త హీరోలతో వచ్చిన ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ అందుకుంది. అయితే తరుణ్ ప్లేసులో ముందుగా సుమంత్ ను అనుకున్నారు. కానీ ఆయన ఆ సమయంలో బిజీగా ఉండి సినిమాను రిజెక్ట్ చేశాడు. దీంతో ఈ సినిమాను తరుణ్, రీచాలతో చేయాల్సి వచ్చింది.
కలిసుందాం రా..
లవ్, కామెడీ, యాక్షన్ కలగలిపి వచ్చిన ఈ మూవీని ముందుగా నాగార్జునతో కలిసి చేద్దామనుకున్నారు. కానీ ఆయన డేట్స్ కుదరకపోవడంతో వెంకటేష్ తో చేయాల్సి వచ్చింది. ఈ సినిమాతో వెంకటేష్ సక్సెస్ ను అందుకున్నాడు.

పోకిరి:
మహేష్ బాబు రికార్డు నెలకొల్పిన చిత్రం పోకిరి. పూరిజగన్నాథ్ ఈ సినిమాను ముందుగా రవితేజతో చేయాలని అనుకున్నాడు. కానీ ఆయనకు డేట్స్ దొరకకపోవడంతో తరువాత చేద్దాం అని చెప్పాడట. కానీ మహేష్ బాబును కలిసి స్టోరీని వినిపించి కొన్ని మార్పులు కూడా చేశారట. దీంతో సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
ఇవే కాకుండా చాలా సినిమాలు ముందుగా ఒక హీరోతో అనుకుంటే ఆ తరువాత మరో నటుడితో చేయాల్సి వచ్చింది. అలా మారిన సినిమాలే ఇండస్ట్రీ హిట్టు కొట్టడం విశేషం.