Homeట్రెండింగ్ న్యూస్Zomato Delivery Boy: ఫుడ్‌ డెలివరీకి రూ.10 లక్షల బైక్‌.. జొమాటో బాయ్‌ కి ఎలా...

Zomato Delivery Boy: ఫుడ్‌ డెలివరీకి రూ.10 లక్షల బైక్‌.. జొమాటో బాయ్‌ కి ఎలా సాధ్యమైంది?

Zomato Delivery Boy: మార్కెటింగ్‌ రంగంలో ఉండే బాయ్స్‌కు తప్పనిసరిగా బైక్‌ అనే నిబంధన ఉంటుంది. చాలా కంపెనీలు రిక్రూట్‌మెంట్‌ సమయంలోనే బైక్, డ్రైవింగ్‌ లైసెన్స్‌ అడుగుతాయి. అవి ఉంటేనే ఉద్యోగం ఇస్తాయి. అతిపెద్ద ఫుడ్‌ డెలివరీ కంపెనీ జొమాటో కూడా అంతే. అయితే ఓ బాయ్‌ తన రూ.10 లక్షల విలువైన బైక్‌పై ఫుడ్‌ డెలివరీ చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. రూ.10 లక్షల బైక్‌పై జొమాటో ఫుడ్‌ డెలివరీ చేస్తున్న వీడియో వైరల్‌గా మారింది.

నిత్యం వార్తల్లో జొమాటో..
జొమాటో నిత్యం ఏదో రకంగా వార్తల్లో ఉంటుంది. జొమాటోలో పనిచేసే ఫుడ్‌ డెలివరీ ఎగ్జిక్యూటీవ్స్‌ కూడా వార్తల్లోకి వస్తుంటారు. జొమాటో డెలివరీ ఎగ్జిక్యూటివ్స్‌ పాజిటివ్‌ లేదా నెగటివ్‌ సందర్భాల్లో వార్తల్లోకి వస్తుంటారు. ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతుంటారు. ఇదేమి కొత్త కాదు. లేటెస్ట్‌గా ఇన్‌స్టాగామ్‌లో ఓ వీడియో వైరల్‌ అవుతోంది. అతను ఏకంగా రూ.10 లక్షల విలువైన బైక్‌పై ఫుడ్‌ డెలివరీ చేస్తుండటం ఆశ్చర్యపరుస్తోంది. ఆ వీడియోలో సదరు వ్యక్తిని మీరు బతకడానికి ఏం చేస్తుంటారు? అని మరో వ్యక్తి అడిగితే అతను సమాధానం చెప్పిన తీరు నెటిజన్లను ఆకట్టుకుంది.
ఒక్కో డెలివరీకి రూ.200
తాను జొమాటోలో ఫుడ్‌ డెలివరీ ఎగ్జిక్యూటీవ్‌గా పనిచేస్తున్నానని, డుకాటి బైక్‌పై కూర్చున్న వ్యక్తి దర్జాగా చెప్పాడు. అంతే కాదు… జొమాటో నుంచి తాను ఎలా సంపాదిస్తున్నానో కూడా వివరించాడు. జొమాటో తనకు ఒక్కో డెలివరీకి రూ.200 చెల్లిస్తుందని, రూ.50 పెట్రోల్‌కు ఖర్చయిపోయినా, ఒక్కో ఆర్డర్‌పై రూ.150 మిగుల్తుందని చెప్పాడు. రోజూ 20 వరకు ఆర్డర్స్‌ డెలివరీ చేస్తానని చెప్పాడు. నెలకు రూ.45,000 వరకు సంపాదిస్తానని వీడియోలో సదరు వ్యక్తి వివరించడం ఆ వీడియో చూడొచ్చు.

స్పందించిన బైక్‌ కంపెనీ
ఇన్‌స్టాగామ్‌లో Raj Gothankar పేరుతో ఉన్న ప్రొఫైల్‌లో ఈ వీడియో పోస్ట్‌ అయింది. ఈ వీడియో వైరల్‌గా మారింది. డుకాటి ఇండియా ఇన్‌స్టాగ్రామ్‌ పేజ్‌ కూడా ఈ వీడియోకు స్పందించింది. ఎమోజీతో కామెంట్స్‌ చేసింది. అయితే ఇది కామెడీ కోసం చేసిన వీడియోలా కనిపిస్తోంది. ఇది తన బైక్‌ కాదని, ఒకట్రెండు సంవత్సరాల్లో డుకాటి మాన్‌స్టర్‌ బైక్‌ కొంటానని సదరు క్రియేటర్‌ కామెంట్‌ చేశాడు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version