Zomato Deepinder Goyal: నేటి కాలంలో అవసరమే ఆదాయ వనరుగా మారిపోతుంది. ఈ అవసరాలే కార్పొరేట్ కంపెనీలకు కాసులు కురిపిస్తున్నాయి. అవసరాల ఆధారంగానే కంపెనీలు ఏర్పడుతున్నాయి . వీటిని నేటి కాలపు పరిభాషలో స్టార్టప్ కంపెనీలని వ్యవహరిస్తున్నారు. వినూత్నమైన ఆలోచనలు ఉన్నవారు స్టార్టప్ కంపెనీలు ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో పెట్టుబడులు పెట్టి భారీగా లాభాలు కళ్ళ చేస్తున్నారు.. అలా వినూత్నమైన కంపెనీ ఒకటి ఏర్పాటు చేసి భారీగా లాభాలు వెనకేసుకుంటున్న వ్యక్తి పేరు దీపిందర్ గోయల్. ఈ పేరు చెప్పగానే జొమాటో ఫౌండర్ గుర్తుకు వస్తాడు.
Also Read: నితీష్ కుమార్ రెడ్డికి గిల్ మామ అవుతాడా? వారి మధ్య బంధుత్వం ఎప్పటినుంచి? వైరల్ వీడియో
దీపిందర్ గోయల్ జొమాటో ఏర్పాటు చేయడం వెనుక ఎంతో కథ ఉంది. కాకపోతే దానిని అత్యంత విలువైన కంపెనీగా మార్చాడు అతడు. అంతేకాదు కంపెనీలో అనేక మార్పులు చేర్పులు చేపట్టాడు.. తద్వారా భారత దేశంలో అతిపెద్ద ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థగా తన కంపెనీని ఎదిగేలా చేశాడు. పోటీ సంస్థలు ఎన్ని ఉన్నప్పటికీ జొమాటో మార్కెట్లో నెంబర్వన్ స్థానంలో కొనసాగుతోంది . అయితే ఇప్పుడు దీపిందర్ సరికొత్త ఆలోచన చేశాడు. ఏకంగా 52.3 కోట్లతో కీలక నిర్ణయం తీసుకున్నాడు.
దీపిందర్ చేతులో ప్రస్తుతం దండిగా డబ్బుంది. వ్యాపార విస్తరణకు అతని వద్ద కావలసినంత నగదు నిల్వలు ఉన్నాయి. తను అనుకున్న లక్ష్యం పూర్తి కావడంతో జొమాటో అధినేత 52.3 కోట్లు పెట్టి ఒక సూపర్ లగ్జరీ బహుళ అంతస్తుల భవనాన్ని కొనుగోలు చేశాడు. ఇది హర్యానా రాష్ట్రంలోని గురు గ్రామ్ ప్రాంతంలో ఉంది. డిఎల్ఎఫ్ సంస్థ ఈ బహుళ అంతస్తుల భవనాన్ని నిర్మిస్తోంది. దీని పేరు ది కామెల్లియస్ రెసిడెన్షియల్ సెక్టార్ దీని విస్తీర్ణం మొత్తం 10,813 చదరపు అడుగులు. ఇందులో ఐదు పార్కింగ్ స్పేస్ లు ఉన్నాయి. 2022లోనే జొమాటో ఫౌండర్ దీనిని కొనుగోలు చేశాడు. ఈ ఏడాది మార్చిలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొత్తం పూర్తయింది. స్టాంపు డ్యూటీ కింద 3.66 కోట్లు చెల్లించినట్టు తెలుస్తోంది.
వ్యాపార విస్తరణకు నగదు భారీగానే సమకూర్చుకున్న తర్వాత.. జొమాటో ఫౌండర్ తనకంటూ ఒక విలాసవంతమైన భవనం కావాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. పైగా తనకు నచ్చినట్టుగా ఈ బహుళ అంతస్తుల భవనాన్ని జొమాటో ఫౌండర్ నిర్మించుకున్నట్లు సమాచారం. 2022లోనే దీనిని కొనుగోలు చేసినప్పటికీ.. అధికారిక ప్రక్రియలు మొత్తం పూర్తయ్యేసరికి మూడు సంవత్సరాలు పట్టింది. ఇక త్వరలోనే ఈ బహుళ అంతస్తుల భవనంలోకి జొమాటో ఫౌండర్ ప్రవేశిస్తాడు.
జొమాటో విస్తరణ మరింత వేగంగా చేపట్టేందుకు దీపిందర్ ప్రణాళిక రూపొందిస్తున్నాడు . తృతీయ శ్రేణి పట్టణాలలో కూడా జొమాటో సేవలు అందించాలని దీపిందర్ భావిస్తున్నాడు. ఇందులో భాగంగానే విస్తరణకు నిధులు సమకూర్చుకున్నాడు. మరికొద్ది రోజుల్లో జొమాటో సేవలు తృతీయ శ్రేణి పట్టణాలలో కూడా ప్రారంభంకానున్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా సేవలు అందిస్తున్న జొమాటో.. త్వరలో తృతీయ శ్రేణి పట్టణాలలో కూడా తన సేవలు మొదలు పెడితే.. మన దేశంలోనే అతిపెద్ద ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థగా జొమాటో ఎదుగుతున్నది.