https://oktelugu.com/

Chandrababu Arrest : చంద్రబాబు అయిపోయాడు.. నెక్ట్స్ లోకేష్ అరెస్ట్ అట

ఈ స్కిల్ డెవలప్ మెంట్ స్కాంలోనూ లోకేష్ పాత్ర ఉందని తెలిపి ఏపీ సీఐడీ షాకిచ్చినట్టైంది. మరి చిన్నబాబును ఎప్పుడు అరెస్ట్ చేస్తారన్నది వేచిచూడాలి.

Written By: , Updated On : September 9, 2023 / 03:57 PM IST
naiduson lokesh

naiduson lokesh

Follow us on

Chandrababu Arrest : ‘తలా పాపం తిలా పిడికెడు అంటే’ ఇదేనేమో.. ఒక్కో కేసు తవ్వుతున్నా కొద్దీ ఫాఫం తండ్రీ కొడుకులకు ఉచ్చు బిగుసుకుంటోంది.. జగన్ సర్కార్ పట్టువదలకుండా పక్కా స్కెచ్ తో చంద్రబాబును అరెస్ట్ చేయగా.. ఇప్పుడు లోకేష్ ను కూడా వదలమంటూ ఏపీ సీఐడీ చీఫ్ చెప్పడం సంచలనమైంది.

నారా చంద్రబాబు అరెస్ట్ తోనే ఈ కేసు ముగిసిపోతుందని అనుకోవడానికి లేదు. ఏ2 అచ్చెన్నాయుడు ఇప్పటికే అజ్ఞాతంలోకి వెళ్లిపోయి దాక్కున్నాడు. ఆయన కోసం పోలీసులు వెతుకుతున్నారు. అయితే ఈ స్కాంలో నాడు ఐటీ మంత్రిగా ఉన్న నారా లోకేష్ కు కూడా విచారణ ఎదుర్కోవాల్సిందేనని.. ఆయన అరెస్ట్ కూడా ఉండొచ్చన్న సంకేతాలు పంపాడు ఏపీ సీఐడీ చీఫ్.

లోకేష్‌ని కూడా విచారించాల్సి ఉంటది. లోకేష్‌ని కూడా అదుపులో తీసుకుంటామని ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్ కుమార్ తెలిపారు. ‘ఇది లోతైన ఆర్ధిక నేరం. చంద్రబాబు నాయుడు కనుసన్నల్లోనే ఈ స్కామ్ జరిగింది. ఈ విచారణలో ముఖ్య పాత్రధారిగా చంద్రబాబు ఉన్నారు. అందుకే కస్టడీలో తీసుకున్నాం. అన్నింటిలోనూ చంద్రబాబు ప్రమేయం ఉందని సృష్టం అయింది. అన్ని వెలుగులోకి తేవడానికి కస్టడీలో విచారణ జరపాల్సి ఉంటుందని ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్ కుమార్ తెలిపారు.

నిజానికి ఈ స్కిల్ డెవలప్ స్కాం కంటే ముందే ఫైబర్ గ్రిడ్ స్కాం అంటూ లోకేష్ కు ఉచ్చు బిగిసింది. అయితే అందులో లోకేష్ అరెస్ట్ వరకూ రాలేదు. ఈ స్కిల్ డెవలప్ మెంట్ స్కాంలోనూ లోకేష్ పాత్ర ఉందని తెలిపి ఏపీ సీఐడీ షాకిచ్చినట్టైంది. మరి చిన్నబాబును ఎప్పుడు అరెస్ట్ చేస్తారన్నది వేచిచూడాలి.